హీరో మోటోకార్ప్ తన సరికొత్త హంక్ ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది.

By Anil

హీరో మోటోకార్ప్ దేశీయ టూవీలర్ మార్కెట్లోకి సరి కొత్త మోడల్ హంక్ బైక్‌ను తీసుకు వచ్చింది. ఈ హంక్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేశారు. హీరో వారి దాదాపుగా అన్ని మోడల్లకు చెందిన టూవీవలర్లను భారతీయ ప్రజలు ఆదరిస్తున్నారు. అయితే ఇది కూడా మార్కెట్లో మంచి ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: అమ్మ బాబోయ్ ఇంత ఖరీదైన బైకా...!!

కొత్త హంక్ టూ వీలర్‌కు చెందిన ఇంజన్, స్పెసిఫికేషన్లు, లభించు రంగులు మరియు ధర వంటి ఇతర విషయాల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే క్రింద గల కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

ధర

ధర

హీరో హంక్ రెండు ఆప్షన్‌లలో లభించనుంది వాటి ధరలు

  • 2016 హంక్ సింగల్ డిస్క్ బ్రేక్ ధర రూ. 69,725 రూ.
  • 2016 హంక్ రెండు వైపులా డిస్క్ బ్రేక్ గల వేరియంట్ ధర రూ. 72,825
  • గమనిక: రెండు ధరలు ఎక్స్-షోరూమ్, (ఢిల్లీ) గా ఇవ్వబడ్డాయి

     వేరియంట్స్

    వేరియంట్స్

    హీరో మోటో కార్ప్ ఈ హంక్ మోటార్ సైకిల్స్‌ను రెండు వేరియంట్లలో అందించారు.

    బేస్ మోడల్ హంక్ లో కేవలం సింగల్ డిస్క్ బ్రేక్‌ను అందించారు మరియు తరువాత వేరియంట్‌లో ముందు, వెనుక రెండువైపులా డిస్క్ బ్రేక్‌లను అందించారు.

     ఇంజన్

    ఇంజన్

    ఈ రెండు వేరియంట్‌లలో 150 సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ ఎటియఫ్‌టి ఇంజన్ కలదు. అయితే దీనిని ఇంజనీర్లు ఇంతకు ముందు గల హంక్‌లోని ఇంజన్ కన్నా కొన్ని మార్పులు చేసి మన ముందుకు తెచ్చారు.

     పవర్

    పవర్

    ఇందులో గల 150సీసీ కెపాసిటి గల ఇంజన్ 15.6ల బిహెచ్‌పి పవర్ మరియు 13.5 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకోసం ఈ బైకులో హీరో మోటోకార్ప్ వారు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌ను అందించారు.

    షాక్ అబ్జార్వర్స్

    షాక్ అబ్జార్వర్స్

    కొత్త హంక్‌లో ఇన్వర్టెడ్ జిఆర్‌‌ఎస్ గ్యాస్-ఛార్జ్‌డ్ రియర్ షాక్ అబ్జార్వ‌ర్ కలదు. దీనిని అత్యధికంగా 5-స్టెప్స్ వరకు అడ్జెస్ట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో విస్కస్ ఎయిర్ ఫిల్టర్‌ను కల్పించారు. మరియు కొన్ని మెకానికల్ మార్పులు కూడా చోటు చేసుకున్నాయి.

    లభించు రంగులు

    లభించు రంగులు

    హీరో మోటో కార్ప్ వారు ఈ సరి కొత్త హంక్‌ను ఆరు విభిన్న రంగుల్లో అందిస్తున్నారు.

    1. బోల్డ్ బ్రౌన్
    2. ప్యాంథర్ బ్లాక్
    3. ఎబొని గ్రే
    4. ఫోర్స్ సిల్వర్
    5. బ్లేజింగ్ రెడ్
    6. మట్టి బ్లాక్
    భారతీయ మార్కెట్లోకి హీరో వారి కొత్త హంక్ విడుదల

    ఈ హంక్ అప్‌డేటెడ్ మోడల్ దేశ వ్యాప్తంగా గల అన్ని హీరో షోరూమ్‌లలో లభిస్తున్నట్లు తెలిపారు. అత్యుత్తమ ధర, బెస్ట్ ఇంజన్, విసృత శ్రేణి రంగుల్లో లభించడం వంటి కారణాల వలన ఇది మంచి అమ్మకాలను సాధిస్తుందని తెలిపారు.

    భారతీయ మార్కెట్లోకి హీరో వారి కొత్త హంక్ విడుదల
    1. హోండా కొత్త బైక్ విడుదల: ధర ఎంతో తెలుసా?
    2. భారతదేశపు భవిష్యత్తు మోటార్ సైకిల్స్...ఇవి ఎలా ఉంటాయి ?
    3. హోండా సిటి హార్నెట్ 160ఆర్ బుకింగ్స్ ప్రారంభం

More from DriveSpark

Article Published On: Thursday, December 10, 2015, 16:20 [IST]
English summary
Hero MotoCorp has provided its Hunk motorcycle with an update for 2016. The all-new Hunk is now available in two choices
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+