భారతదేశపు భవిష్యత్తు మోటార్ సైకిల్స్.... మరి ఇందులో దేనిని ఎంచుకుంటారు

By Anil

భారత దేశపు టూ వీలర్ మార్కెట్ క్రమక్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మైలేజ్ వెహికల్స్ కాకుండా ఎక్కున పనితీరును కనబరిచే సెగ్మెంట్‌లలో ఈ డిమాండ్ మరింత పెరుగుతోంది. అనగా ఇంజన్ సీసీ ఎక్కువ గల టూ వీలర్లు, ఈ సెగ్మెంట్‌లో ఎక్కువగా టూ వీలర్లను అమ్ముతున్న సంస్థ కెటియమ్.

అయితే దేశ వ్యాప్తంగా యువత ఇప్పుడు ఎక్కువ సీసీ గల వాహనాల వైపు మొగ్గు చుపుతున్నారు. అంటే దాదాపుగా 1000 సీసీ కన్నా ఎక్కువ వాహనాల మీద యువత ఆశక్తి చూపుతోంది.ఇలాంటి దాదాపు 15 మోటార్ సైకిల్స్‌ను 2015 మిలాన్ మోటార్ షోలో ప్రదర్శించారు. మన దేశంలోకి ఇవి భవిష్యత్తులో యువతను దృష్టిలో ఉంచుకుని రాబోతున్నాయి. వీటి గురించి ప్రత్యేక కథనం...

 01. యమహా యమ్‌టి-03

01. యమహా యమ్‌టి-03

యమహా యమ్‌టి-03 మోటార్ సైకిల్ భారతీయ రోడ్లకు ఎంతో బాగా సరిపోతుంది.ఈ యమ్‌టి-03 మోడల్ బైకు యమాహా యొక్క ఆర్3 ప్రేరణతో మన తయారయింది. ఇందులో ఆర్3 మడల్ బైకులోని ఇంజన్‌ను తీసుకువచ్చారు. ఇది 42బిహెచ్‌పి మరియు 29.5యన్‌యమ్ టార్క్‌ను దీనిలో గల 6-స్పీడ్ గేర్ బాక్స్ ద్వారా ఉత్పత్తి చేస్తుంది.

ధర దాదాపుగా: రూ. 3 లక్షల వరకు ఉండవచ్చు.

పోటీదారులు: కెటియమ్ డ్యూక్ 390, బెనెల్లి టియన్‌టి 300, కవాసకి జడ్‌‌‌‌250.

02.బియమ్‍డబ్ల్యూ జి301ఆర్

02.బియమ్‍డబ్ల్యూ జి301ఆర్

కార్లనే కాదు ఖరీదైన బైకులు కూడా అందిస్తామంటోంది బియమ్‌‌డబ్ల్యూ. 300సీసీ సెగ్మెంట్లో టివియస్ మరియు బియమ్‌‌డబ్ల్యూ భాగస్వామ్యంతో మన దేశంలోకి విడుదలవుతున్న మొదటి బైకు ఇది. ఇందులో గల శక్తివంతమైన సింగల్ సిలిండర్ ఇంజన్ 34బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే మోటార్ సైకిల్ భారతీయ మార్కెట్లో బియమ్‌డబ్ల్యూ యొక్క అనుభందాన్ని మరింత పటిష్టం చేయనుంది.

ధర దాదాపుగా: రూ. 2.8 లక్షలు వరకు ఉండవచ్చు

పోటీదారులు: కెటియ్ డ్యూక్ 390, బెనెల్లి టియన్‌టి 300, కవాసకి జడ్‌‌‌‌250.

03.హొయసంగ్ జిటి300ఆర్

03.హొయసంగ్ జిటి300ఆర్

ఇది హొయసంగ్ 250ఆర్ మోడల్‌కు అప్‌డేట్ వర్షన్, ఈ జిటి 300ఆర్ టూ వీలర్‌లో 275సీసీ గల వి-ట్విన్ ఇంజన్ కలదు, ఇది 28బిహెచ్‌పి మరియు 23యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ స్పోర్ట్స్ బైకు 2016 మధ్య బాగానికి మన దేశ మార్కెట్లోకి రానుంది.

ధర దాదాపుగా: రూ. 4 లక్షలు లోపు ఉండవచ్చు

పోటీదారులు: కెటియ్ ఆర్‌సి390, యమహా వైజడ్‌‌యఫ్-ఆర్3, కవాసకి నింజా 300, హోండా సిబిఆర్ 250ఆర్.

Image credit: Hyosung GT300R

04. బెనెల్లి టొరాండొ 302

04. బెనెల్లి టొరాండొ 302

ఈ బెనెల్లి టొరాండొ 302 మోడల్ బైక్ ఇప్పటే మన దేశంలో అమ్ముడుపోతున్న టియన్‌టి 300కి చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. ఇందులో అచ్చం టియన్‌టి 300 మోడల్‌లో ఉన్న ఇన్-లైన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది మీకు 35బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర దాదాపుగా: రూ. 3 లక్షల వరకు ఉండవచ్చు.

పోటీదారులు: కెటియమ్ ఆర్‌సి390, యమహా వైజడ్‌‌యఫ్-ఆర్3, కవాసకి నింజా 300, హోండా సిబిఆర్250ఆర్.

05. కెటియమ్ ఆర్‌సి390

05. కెటియమ్ ఆర్‌సి390

ఆస్ట్రియన్ కు చెందిన ఈ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ త్వరలో భారతీయ మార్కెట్లోకి తన కెటియమ్‌ ఆర్‌సి390 బైకు ప్రవేశపెట్టనుంది. ఇందులో సింగిల్ సిలిండర్ లిక్వడ్ కూల్డ్ ఇంజన్ కలదు, ఇది దాదాపుగా 43బిహెచ్‌పి మరియు 35 యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర దాదాపుగా: రూ 2.15 లక్షలుగా ఉండవచ్చు.

పోటిదారులు: యమహా వైజడ్‌‌యఫ్-ఆర్3, కవాసకి నింజా 300, హోండా సిబిఆర్250ఆర్.

06. డుకాటి స్క్రాంబ్లర్ సిక్ట్సి2

06. డుకాటి స్క్రాంబ్లర్ సిక్ట్సి2

డుకాటి సంస్థ అతి తమ అన్ని మోడల్స్ కన్నా అతి తక్కువ ధరకు అందిస్తున్న బైకు డుకాటి స్క్రాంబ్లర్ సిక్ట్సి2. ఇందులో 399సీసీ గల యల్‌‌-ట్విన్ ఇంజన్ కలదు, ఇది దాదాపుగా 41బిహెచ్‌పి మరియు 35యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో స్టాండర్డ్ ఫీచర్‌గా యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించారు. ఇది మన దేశ మార్కెట్లోకి 2016 సంవత్సరం మద్య భాగానికి వచ్చే సూచనలు ఉన్నాయి.

ధర దాదాపుగా: రూ 5 లక్షల వరకు ఉండవచ్చు

పోటీదారులు: కెటియమ్ డ్యూక్ 390, బెనెల్లి టియన్‌టి 300, కవాసకి జడ్‌250.

 07. హొయసంగ్ అక్విలా 300

07. హొయసంగ్ అక్విలా 300

ఇది హొయసంగ్ వారి జిటి250ఆర్ మరియు జిటి300ఆర్ మోడల్ల ప్రేరణతో రూపొందించారు. ఈ హొయసంగ్ అక్విలా 300 లో జిటి300ఆర్ ఇంజన్‌ను అందించారు. ఇది దాదాపుగా 27బిహెచ్‌పి మరియు 23.5యన్‌యమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్‌ని, యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించారు. దీనిని వచ్చే ఏడాదిలో మన దేశంలోకి ప్రవేశపెట్టనున్నారు.

ధర దాదాపుగా: రూ. 3.2 లక్షల వరకు ఉండవచ్చు.

పోటిదారులు: రాయల్ ఎన్ఫీల్డ్ 350, బజాజ్ అవెంజర్ క్రూయిజ్, యుయమ్ రెనిగేడ్(త్వరలో రాబోతోంది).

Image credit: Hyosung Aquila 300

08.యుయమ్ రెనిగేడ్ స్పోర్ట్ యస్

08.యుయమ్ రెనిగేడ్ స్పోర్ట్ యస్

దీనిని ఇంతకు ముందు 2015 మిలాన్ మోటార్‍‌‌షోలో ప్రదర్శించారు. ఈ కొత్త బైకు ఎండ్యురాన్స్ బ్రేకులు మరియు గ్యాబ్రియల్ సస్పెన్షన్ మరియు టివియస్ టైర్లను కలిగి ఉంది అంటే అన్ని కూడా దేశీయంగా తయరైనవే. ఇందులో 279సీసీ గల సిలిండర్ ఇంజన్ 26బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర దాదాపుగా: రూ. 2 లక్షల వరకు ఉంటుంది.

పోటిదారులు: రాయల్ ఎన్ఫీల్డ్ 350, బజాజ్ అవెంజర్ క్రూయిజ్

Image credit: UM Renegade Sport S

09. బెనెల్లి టిఆర్‌కె 502

09. బెనెల్లి టిఆర్‌కె 502

బెనెల్లీ సంస్థ దాదాపుగా తమ అన్ని మోడల్లను భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. ఇది 2016 కల్లా మన దేశంలోకి విడుదల కానుంది. ఈ బెనెల్లీ టిఆర్‌కె 502 అడ్వెంచర్ మోటార్ సైకిల్‌లో 500సీసీ గల ఇంజన్ కలదు ఇది 47బిహెచ్‌పి మరియ 45యన్‌యమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది.

ధర దాదాపుగా: రూ. 5 లక్షల వరకు ఉండవచ్చు

పోటిదారులు: డుకాటి స్క్రాంబ్లర్ సిక్ట్సి2, కవాసకి వెర్సెస్ 650 (రెండు త్వరలో విడుదల కానున్నాయి).

10. హొయసంగ్ జిటి650ఆర్

10. హొయసంగ్ జిటి650ఆర్

ఈ హొయసంగ్ జిటి650ఆర్ మోడల్‌ను జిటి 300ఆర్ మరియు అక్విలా మోడల్ యొక్క అప్‌డేట్ బైక్‌ అని తెలిపారు. అయితే ఇందులో ఎక్కువగా డిజైన్‌లో మార్పులు చేశారు. ఇందులో గల 647సీసీ గల వి-ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ దాదాపుగా 73బిహెచ్‌పి మరియు 55 యన్‌యమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది.

ధర దాదాపుగా: రూ. 5.5 లక్షల వరకు ఉంటుంది

పోటీదారులు: బెనెల్లీ టియన్‌టి 600ఐ, హోండా సిబి600యఫ్, కవాసకి ఇఆర్-6యన్.

Image credit: Hyosung GT650R

11.కవాసకి నింజా జడ్‌యక్స్-10ఆర్

11.కవాసకి నింజా జడ్‌యక్స్-10ఆర్

జపాన్‌కు చెందిన టూవీలర్ల తయారీ సంస్థ కవాసకి 2015 మిలాన్‌లో జరిగన మోటార్ షోలో దీనిని ప్రదర్శించింది. కవాసకి దీనిని వింటర్ ఎడిషన్‌గా పరచయం చేసింది. ఈ కవాసకి నింజా జడ్‌యక్స్-10ఆర్ సూపర్ బైకులో 998సీసీ గల ఇన్-లైన్ నాలుగు సిలిండర్లు గల లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు ఇది దాదాపుగా 197 బిహెచ్‌పి మరియు 113యన్‌యమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర దాదాపుగా: రూ. 17 లక్షల వరకు ఉండవచ్చు.

పోటీ దారులు: యమహా వైజడ్‌యఫ్-ఆర్1, సిబిఆర్ 1000ఆర్ఆర్, బియమ్‌డబ్ల్యూ యస్‌1000ఆర్ఆర్, సుజుకి జియస్‌యక్స్-ఆర్1000

12. యమహా యమ్‌టి-10

12. యమహా యమ్‌టి-10

యమహా మోటార్స్ సంస్థ తన స్టీట్ బైక్ వెర్షన్ వైజడ్‌యఫ్-ఆర్1 మోడల్‌ను యమ్‌టి-10 పేరుతో విడుదల చేసింది. ఇందులో గల ఇన్-లైన్ నాలుగు సిలిండర్ల ఇంజన్‌ను యమహా యొక్క ఆర్1 మోడల్ నుండి దీనికి అందించారు. ఇది ఉత్తమమైన పని తీరును కనబరుస్తుంది.

ధర దాదాపుగా: రూ. 20 లక్షల వరకు ఉంటుంది.

పోటీదారులు: యమ్‌వి అగస్టా బ్రుటాలి 1090, డుకాటి మాన్‌స్టెర్ 1200యస్, బియమ్‌డబ్ల్యూ యస్1000ఆర్.

13.ట్రయంప్ స్పీడ్ ట్రిపుల్

13.ట్రయంప్ స్పీడ్ ట్రిపుల్

ట్రయంప్‌కు చెందిన ఈ స్పీడ్ ట్రిపుల్ బైకు దాదాపుగా 104 మార్పులతో మన ముందుకు వచ్చింది. ఇంజన్ మరియు డిజైన్‌ పరంగా ఎక్కువగా మార్పులు చోటు చేసుకున్నాయి. కాని దీని ఇంజన్‌ యొక్క వివరాలు కంపెనీ విడుదల చేయలేదు.

ధర దాదాపుగా: రూ. 12 లక్షల వరకు ఉండవచ్చు

పోటీదారులు: యమ్‌వి అగస్టా బ్రుటాలి 1090, డుకాటి మాన్‌స్టెర్ 1200యస్, బియమ్‌డబ్ల్యూ యస్1000ఆర్.

14. డుకాటి యక్స్‌దివాలె

14. డుకాటి యక్స్‌దివాలె

డుకాటి సంస్థ ఇప్పటి వరకు చాలానే మోడల్లనే విడుదల చేసింది. అందులో భాగంగానే ఈ అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ బైక్ మీద దృష్టిపెట్టింది. ఈ డుకాటి యక్స్‌‌దివాలె బైకులో 1,262సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు, ఇది దాదాపుగా 156బిహెచ్‌పి మరియు 129యన్‌యమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర దాదాపుగా: రూ. 21 లక్షల వరకు ఉండవచ్చు.

పోటిదారులు: యమహా వి-మ్యాక్స్

2015 మిలాన్ మోటార్‌ షో

2015 మిలాన్‌లో జరిగిన ఇఐసి‌యమ్‌ఎ మోటార్ సైకిల్ ‌షోలో ఎన్నో కొత్త మోడల్ టూ వీలర్లను ప్రవేస పెట్టారు వాటి గురించి మరింత తెలుసుకోండి.2015 మిలాన్ మోటార్ షో గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Upcoming Motorcycles In India — Top 14 Motorcycles To Lookout For
Story first published: Friday, November 27, 2015, 14:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X