మహిళా పోలీసులకు డ్యూయెట్ స్కూటర్లను బహుకరించిన హీరోమోటోకార్ప్

Written By:

దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరోమోటోకార్ప్ హర్యానా మహిళా పోలీసులకు డ్యూయెట్ స్కూటర్లను బహుకరించింది. మహిళా పోలీస్ దివాస్ సందర్భంగా హీరోమోటోకార్ప్ "ప్రాజెక్ట్ శక్తి" క్రింద హర్యానా మహిళా పోలీసులకు 100 డ్యూయెట్ స్కూటర్లను అందించింది.

మహిళా పోలీసులకు స్కూటర్లు

మహిళా పోలీసులు రోజూ వారీ డ్యూటీ కోసం మరియు పెట్రోలింగ్ నిర్వహించడానికి డ్యూయెట్ స్కూటర్లను ప్రధానం చేయడం జరిగింది. మహిళా పోలీసులు వినియోగించే ఈ స్కూటర్లలో సైరన్లు, ట్రాఫిక్ లైట్లు మరియు చిన్న పాటి మైకులను అమర్చి అందజేయడం జరిగింది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మహిళా పోలీసులకు స్కూటర్లు

హీరో మోటోకార్ప్ సిఐఒ మరియు ఎస్ఎస్ఆర్ విభాగాధిపతి విజయ్ సేతి పోలీసు డిపార్ట్‌మెంట్‌కు స్కూటర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్‌తో పాటు హర్యానా డిజిపి మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మహిళా పోలీసులకు స్కూటర్లు

గడిచిన ఏడాది కాలం నుండి హీరో మోటోకార్ప్ సుమారుగా 200 కు పైగా టూ వీలర్లను వివిధ కార్యక్రమాల్లో హర్యానా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు అందజేసింది. పోలీసులల రైడింగ్ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు వివిధ పోలీస్ అకాడమీలలో హీరో మోటోకార్ప్ పలు పరకాల శిక్షణలు కూడా చేపట్టింది.

మహిళా పోలీసులకు స్కూటర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో మోటోకార్ప్ పోలీసు వ్యవస్థతో చాలా దగ్గరగా పనిచేస్తోంది. రైడ్ సేఫ్ ఇండియా పేరుతో సురక్షితమైన రైడింగ్ పట్ల అవగాహన కల్పిచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది.

English summary
Read In Telugu: Hero MotoCorp Presents 100 Duet Scooters To Women Police In Haryana
Story first published: Monday, August 7, 2017, 11:17 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark