విపణిలోకి సరికొత్త హోండా గ్రాజియా స్కూటర్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు, ప్రత్యేకతలు

Written By:

భారతదేశపు అతి టూ వీలర్ల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలోకి సరికొత్త గ్రాజియా స్కూటర్‌ను విడుదల చేసింది. ఆల్ న్యూ హోండా గ్రాజియా ప్రారంభ ధర రూ. 57,827 లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

హోండా గ్రాజియా స్కూటర్

హోండా టూ వీలర్స్ ఇండియా విక్రయించే స్కూటర్లలో అత్యంత ఖరీదైన మరియు అతి ముఖ్యమైన మోడల్‌గా విడుదలైన హోండా గ్రాజియా స్కూటర్ వేరియంట్లు, వాటి ధరలు, బుకింగ్స్, ఫీచర్లు, లభించే కలర్ ఆప్షన్స్ మరియు పూర్తి వివరాలు...

Recommended Video - Watch Now!
[Telugu] TVS Jupiter Classic Launched In India - DriveSpark
హోండా గ్రాజియా స్కూటర్

హోండా ఫ్లాగ్‌షిప్ స్కూటర్ గ్రాజియా మూడు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. అవి, ఎస్‌టిడి, అల్లాయ్ మరియు డిఎల్ఎక్స్.

హోండా గ్రాజియా స్కూటర్ విడుదలకు ముందే రూ. 2,000 లతో బుకింగ్స్ ప్రారంభించింది. ఇది వరకే బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ రోజు నుండి డెలివరీ ఇవ్వనున్నారు.

హోండా గ్రాజియా స్కూటర్

హోండా గ్రాజియా స్కూటర్ ధరలు

వేరియంట్లు ధరలు
గ్రాజియా ఎస్‌టిడి రూ. 57,827 లు
గ్రాజియా ఆల్లాయ్ రూ. 57,897 లు
గ్రాజియా డిఎల్ఎక్స్ రూ. 62,269 లు
హోండా గ్రాజియా స్కూటర్

హోండా గ్రాజియా ఇంజన్ వివరాలు

సరికొత్త గ్రాజియా స్కూటర్‌లో ఆక్టివా 125 మోడల్‌లో ఉన్న అదే ఇంజన్‌ను ఉపయోగించారు. గ్రాజియాలో గల 124.9సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 6,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 8.52బిహెచ్‌పి పవర్ మరియు 5,000ఆర్‌పిఎమన్ వద్ద 10.54ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా గ్రాజియా స్కూటర్

హోండా గ్రాజియా కొలతలు

గ్రాజియా పొడవు 1,812ఎమ్ఎమ్, వెడల్పు 697ఎమ్ఎమ్, ఎత్తు 1,146ఎమ్ఎమ్, వీల్ బేస్ 1,260ఎమ్ఎమ్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 155ఎమ్ఎమ్‌గా ఉంది. నేల నుండి సీటు ఎత్తు 766ఎమ్‌ఎమ్‌గా ఉంది. గ్రాజియాలో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 5.3-లీటర్లు.

హోండా గ్రాజియా స్కూటర్

గ్రాజియా సస్పెన్షన్, చక్రాలు మరియు టైర్లు

హోండా గ్రాంజియా సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు. అందే విధంగా ముందు వైపున్న 12-అంగుళాల అల్లాయ్ వీల్‌కు 90/90-12 కొలతలు గల టైరు, వెనుక వైపున 10-అంగుళాల అల్లాయ్ వీల్‌కు 90/100-10 కొలతలో ఉన్న చక్రాలను అందివ్వడం జరిగింది.

Trending On DriveSpark Telugu:

పాత ఇంటర్‌సెప్టార్ బైకును మళ్లీ ఆవిష్కరించిన రాయల్ ఎన్ఫీల్డ్

ఊహించని ధరతో విడుదలైన సుజుకి ఇంట్రూడర్ 150: ధర, ఇంజన్, ఫీచర్లు, మైలేజ్

ఆపరేషన్ చీతా పేరుతో విజృంభించిన ట్రాఫిక్ పోలీసులు రెండు గంటల్లో 5 లక్షలు వసూల్!!

హోండా గ్రాజియా స్కూటర్

హోండా గ్రాజియా బ్రేకింగ్ సిస్టమ్

గ్రాజియా స్కూటర్‌లో బ్రేకింగ్ కార్యకలాపాల కోసం ముందు వైపున టాప్ ఎండ్ వేరియంట్లో 190ఎమ్ఎమ్ డిస్క్ మరియు ప్రారంభ వేరియంట్లో 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ కలదు. అన్ని గ్రాజియా వేరియంట్లలో వెనుక వైపున 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ కలదు. సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం హోండా ఇందులో కాంబి బ్రేకింగ్ ఫీచర్ అందించింది.

హోండా గ్రాజియా స్కూటర్

హోండా గ్రాజియా డిజైన్

హోండా గ్రాజియా స్కూటర్‌ను ప్యూచరిస్టిక్ డిజైన్ అంశాలతో రూపొందించింది. హోండా స్కూటర్స్ లైనప్‌లో ఉన్న డియో స్కూటర్ ప్రేరణతో సరికొత్త గ్రాజియా ప్రీమియమ్ స్కూటర్‌ను హోండా అభివృద్ది చేసింది. ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న ట్విన్ పోడ్ హెడ్ లైట్, దీనిపైన ఇరువైపులా పెద్ద పరిమాణంలో ఉన్న టర్న్ ఇండికేటర్స్ అమరిక అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

హోండా గ్రాజియా స్కూటర్

హోండా గ్రాజియా ఫీచర్లు

హోండా గ్రాజియా స్కూటర్‌లో పూర్తి స్థాయి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్ కలదు. ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్ గల భారతదేశపు తొలి స్కూటర్ గ్రాజియా 125. ఇందులో త్రీ స్టెప్ ఎకో స్పీడ్ ఇండికేటర్ ఉంది.

హోండా గ్రాజియా స్కూటర్

మూడు రకాల ఎకో స్పీడ్ ఇండికేటర్ రైడర్ అత్యుత్తమ మైలేజ్ మరియు పర్ఫామెన్స్ పొందడంలో సహాయపడుతుంది. ఫ్రంట్ గ్లూవ్ బాక్స్ ద్వారా యాక్ససరీలను భద్రపరుచుకునే స్టోరేజ్ స్పేస్ కలదు.

హోండా గ్రాజియా స్కూటర్

ఇతర ఫీచర్లను చూసుకుంటే, స్పోర్టివ్ స్ల్పిట్ గ్రాబ్ రెయిల్, మలిచిన డిజైన్ తీరులో ఉన్న టెయిల్ ల్యాంప్స్ క్లస్టర్, 18-లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ మరియు అండర్ సీట్ స్టోరేజ్ లాక్‌తో సహా 4-ఇన్-వన్ లాక్ సిస్టమ్ కలదు.

హోండా గ్రాజియా స్కూటర్

లభించే కలర్స్

సరికొత్త హోండా గ్రాజియా 125 ప్రీమియమ్ స్కూటర్ ఆరు విభిన్న రంగుల్లో లభించును. అవి, నియో ఆరేంజ్ మెటాలిక్, పర్ల్ నైట్‌స్టార్ బ్లాక్, పర్ల్ స్పార్టాన్ రెడ్, పర్ల్ అమేజింగ్ వైట్, మ్యాట్ ఆక్సిస్ గ్రే మెటాలిక్ మరియు మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్.

హోండా గ్రాజియా స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా టూ వీలర్స్ ప్రీమియమ్ డిజైన్, ప్రీమియమ్ ఫీచర్లు మరియు భారతదేశం మెచ్చిన 125సీసీ ఇంజన్‌ను అందించి సరికొత్త గ్రాజియా స్కూటర్‌‌ను అత్యంత పోటీతత్వమైన ధరతో చేసింది. ఆక్టివా తరహా విజయాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ది చేసిన గ్రాజియా 125 విపణిలో ఉన్న సుజుకి యాక్సెస్ 125 మరియు వెస్పా స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది.

హోండా గ్రాజియా స్కూటర్ మీద మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్సు ద్వారా మాతో పంచుకోండి...

English summary
Read In Telugu: Honda Grazia Launched In India - Prices Start At Rs 57827

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark