ఆటో ఎక్స్‌పో 2018: అప్రిలియా SR 125 స్కూటర్ విడుదల - ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:

ఆటో ఎక్స్‌పో 2018: అప్రిలియా తమ ఎస్ఆర్ 125 స్కూటర్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త అప్రిలియా ఎస్ఆర్ 150 స్కూటర్ ధర రూ. 65,310 లు ఎక్స్-షోరూమ్(పూనే)గా ఉన్నట్లు అప్రిలియా ప్రతినిధులు వెల్లడించారు.

అప్రిలియా ఎస్ఆర్ 125 ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోల కోసం...

అప్రిలియా ఎస్ఆర్ 125

125సీసీ స్కూటర్ సెగ్మెంట్లోకి విడుదలైన అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్ టీవీఎస్ తాజాగా విడుదల చేసిన ఎన్‌టార్క్ 125, హోండా గ్రాజియా మరియు సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్లతో పోటీపడనుంది.

Recommended Video - Watch Now!
Auto Rickshaw Explodes In Broad Daylight
అప్రిలియా ఎస్ఆర్ 125

సరికొత్త అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్‌లో 124సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే 3-వాల్వ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది 8,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 9.46బిహెచ్‌పి పవర్ మరియు 7,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 8.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అప్రిలియా ఎస్ఆర్ 125

అప్రిలియా ఎస్ఆర్ 125 ఆటోమేటిక్ స్కూటర్‌లో 7-లీటర్ కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. అత్యుత్తమ హ్యాండ్లింగ్ కోసం 775ఎమ్ఎమ్ ఎత్తున్న సీటు, ముందు వైపున టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు.

అప్రిలియా ఎస్ఆర్ 125

బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు రియర్ వీల్‌కు 140ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. 14-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను 120/70 కొలతల్లో ఉన్న టైర్లను జోడించారు.

అప్రిలియా ఎస్ఆర్ 125

అప్రిలియా ఎస్ఆర్ 125 డిజైన్ మరియు ఫీచర్లు

అప్రిలియా ఎస్ఆర్ 150 డిజైన్‌నే ఎస్ఆర్125 లో కూడా తీసుకొచ్చింది. ఫ్రంట్ డిజైన్‌లో ట్విన్ పోడ్ హెడ్ ల్యాంప్ సిస్టమ్ మరియు హ్యాండిల్ బార్‌కు ఇరువైపులా ఇండికేటర్ లైట్లు ఉన్నాయి.

అప్రిలియా ఎస్ఆర్ 125

ఎస్ఆర్ 125 లో ఉన్న అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఎస్ఆర్150 స్కూటర్‌ శైలిలో అందించారు. అంతే కాకుండా సరికొత్త డ్యూయల్ టోన్ సీటును కూడా అందివ్వడం జరిగింది. విభిన్న బాడీ గ్రాఫిక్స్‌తో బ్లూ మరియు సిల్వర్ కలర్ స్కీములో ఎంచుకోవచ్చు.

అప్రిలియా ఎస్ఆర్ 125

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్ విడుదలతో ఇటాలియన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం అప్రిలియా ఇప్పుడు ఇండియన్ 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. యువ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ ప్రవేశపెట్టిన అప్రిలియా ఎస్ఆర్ 125 బెస్ట్ పవర్ అవుట్‌పుట్ ఇస్తుంది.

ఆటో ఎక్స్‌పో 2018: ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించిన మారుతి సుజుకి

ఆటో ఎక్స్‌పో 2018: ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్

English summary
Read In Telugu: Auto Expo 2018: Aprilia SR 125 Launched At Rs 65,310 - Specifications, Features & Images
Story first published: Wednesday, February 7, 2018, 15:50 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark