ఆటో ఎక్స్‌పో 2018: ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించిన మారుతి సుజుకి

Written By:
Recommended Video - Watch Now!
New Maruti Swift Launch: Price; Mileage; Specifications; Features; Changes

ఆటో ఎక్స్‌పో 2018: ఢిల్లీలో భారతదేశపు అతి పెద్ద ఆటో షో 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో ఘనంగా ప్రారంభమైంది. దేశీయ దిగ్గజం ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తమ సరికొత్త ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ ఫోటోలు మరియు ఇతర వివరాలు కోసం...

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

మార్కెట్లో మారుతి వితారా బ్రిజా ఎస్‌యూవీ క్రింది స్థానాన్ని భర్తీ చేయనున్న ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ మారుతి సుజుకి ఇండియా డిజైనింగ్ బృందం అభివృద్ది చేసింది.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

మారుతి సుజుకి ఇండియా డిజైనింగ్ బృందం అభివృద్ది చేసిన ఫ్యూచర్ కాన్సెప్ట్ పూర్తిగా నూతన డిజైన్ శైలిలో ఉంది. ఎత్తైన బాడీ, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు నూతన కొలతలు దీనిని సొంతం.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

మారుతి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ మూడు డోర్ల ఎస్‌యూవీ. కండలు తిరిగిన శరీరాకృతి పలుచటి హెడ్ ల్యాంప్స్, మారుతి ఇప్పటి వరకు పరిచయం చేయని ఫ్రంట్ గ్రిల్ మరియు ముందు వైపు అద్దం చుట్టూ ఉన్నతెలుపు రంగు పట్టీ ఉంది.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

మారుతి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ ఫ్రంట్ బంపర్ క్రింద పెద్ద పరిమాణంలో ఉన్న సిల్వర్ బాష్ ప్లేట్ ఉంది. ఇది ఎయిర్ ఇంటేకర్‌కు క్రింది వైపున అందివ్వడం జరిగింది. తెలుపు రంగు చతుర్బుజాకారపు పెట్టెలో ఆకర్షణీయమైన గుండ్రటి ఫాగ్ ల్యాంప్స్ అందించారు.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

మారుతి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ సైడ్ ప్రొఫైల్‌లో బానెట్ తరహా బాడీ లుక్ మరియు బ్లాక్ గ్లాస్ సెక్షన్ ఎస్‌యూవీకి ఒక విభిన్న రూపాన్ని తీసుకొచ్చాయి. పెద్ద పరిమాణంలో ఉన్న బాడీ కలర్ మరియు బ్లాక్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

ఫ్యూచర్ ఎస్ కాన్సెఫ్ట్ ఇంటీరియర్‌లో బాడీ కలర్ సొబగులు ఉన్నాయి. ఆరేంజ్ కలర్ డోర్ ట్రిమ్స్, సీట్లు, స్టీరింగ్ వీల్, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, డ్యాష్ బోర్డ్ మరియు పలు ఇతర ఇంటీరియర్ ఫీచర్లు కాషాయం రంగును పులుముకున్నాయి.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

ఇంటీరియర్‌లోని సెంటర్ కన్సోల్‌ను పియానో బ్లాక్ ఫినిషింగ్‌లో అందివ్వడం జరిగింది. ప్రకాశవంతమైన షేడ్స్, గుండ్రటి ఆకారంలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ ఓవరాల్ డిజైన్‌ను గాలి ద్వారా కలిగే ఘర్షణను నివారించేలా రూపొందించారు.

మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా ఆవిష్కరించిన ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ భారతదేశపు అర్బన్ ఎస్‌యూవీగా మార్కెట్లోకి రానుంది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే వితారా బ్రిజా క్రింది స్థానాన్ని భర్తీ చేయనుంది. మారుతి తమ ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్‌లో కేవలం మూడు డోర్లను అందించింది. దీనిని పూర్తి స్థాయిలో దేశీయంగానే ఉత్పత్తి చేసే దేశవిదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది.

ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్సులో మాతో పంచుకోండి...

English summary
Read In Telugu: Auto Expo 2018: Maruti Concept Future S Unveiled - To Rival The Maruti Dzire
Story first published: Wednesday, February 7, 2018, 11:12 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark