28 కిలోమీటర్ల మైలేజ్, సన్‌రూఫ్.. 8 లక్షల బడ్జెట్‌లో అద్భుతమైన ఎస్‌యూవీలు ఇవే
మధ్యతరగతి భారతీయులకు కారు అనేది ఒక కల. ముఖ్యంగా నేటి కాలంలో సెడాన్ లేదా హ్యాచ్‌బ్యాక్ కంటే ఎస్‌యూవీ (SUV)లకే క్రేజ్ ఎక్కువగా ఉంది. స్టైలిష్ లుక్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, కంఫర్ట్ కారణంగా అందరూ వీటివైపే మొగ్గు చూపుతున్నారు. అయితే, బడ్జెట్ విషయానికి వస్తే 8 లక్షల రూపాయల లోపు మంచి ఫీచర్లు, అదిరిపోయే మైలేజ్ ఇచ్చే కార్ల కోసం జనం వేచి చూస్తుంటారు. 2026లో మారుతి సుజుకి ఫ్రాంక్స్, టయోటా టైజర్, కియా సోనెట్ వంటి మోడల్స్ ఈ బడ్జెట్‌లో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి. వీటి విశేషాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx):
మారుతి సుజుకి నుంచి వచ్చిన మోస్ట్ స్టైలిష్ క్రాస్ఓవర్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్. దీని ప్రారంభ ధర సుమారు రూ.6.85 లక్షలుగా ఉంది. ఇది చూడటానికి మారుతి గ్రాండ్ విటారాను పోలి ఉండటం దీనికి పెద్ద ప్లస్ పాయింట్. పట్టణాల్లో తిరగడానికి లేదా పల్లెటూరి రోడ్లపై వెళ్లడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

ఫ్రాంక్స్‌లో మనకు రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లు లభిస్తాయి. ఒకటి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, రెండోది పవర్‌ఫుల్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. మైలేజ్ విషయంలో మారుతి కార్లను కొట్టేవాళ్లే లేరు. ఇది పెట్రోల్ వెర్షన్‌లో లీటరుకు సుమారు 21.79 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండగా, సిఎన్‌జి (CNG) వెర్షన్‌లో ఏకంగా 28.51 కిలోమీటర్ల మైలేజీని అందిస్తోంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లతో మారుతి ఈ కారును పటిష్టంగా రూపొందించింది.
2. టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor):
మీకు మారుతి ఫ్రాంక్స్ నచ్చింది కానీ, టయోటా బ్రాండ్ అంటే ఇష్టమైతే మీకు టైజర్ బెస్ట్ ఛాయిస్. మారుతి ఫ్రాంక్స్‌కు రీబ్యాజ్డ్ వెర్షన్ అయిన టైజర్, తనదైన శైలిలో ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. దీని ధర సుమారు రూ.7.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టయోటా సర్వీస్ నెట్‌వర్క్, రీసేల్ వాల్యూ బాగుంటుందని నమ్మే వారికి ఇది సరైన ఎంపిక.

ఇంజిన్, పెర్ఫార్మెన్స్ పరంగా ఇది ఫ్రాంక్స్ లాగే ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, టర్బో ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ మైలేజ్ సుమారు 20-22 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. టైజర్‌లో ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడీ లైట్ల డిజైన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. లోపల 360-డిగ్రీల కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD) వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. టయోటా బిల్డ్ క్వాలిటీపై జనాలకు నమ్మకం ఎక్కువ కాబట్టి, లాంగ్ జర్నీలు చేసే వారికి ఇది ఒక భరోసా ఇస్తుంది. ముఖ్యంగా టయోటా అందించే వారంటీ పీరియడ్ కస్టమర్లను ఎక్కువగా ఆకర్షిస్తోంది.
3. కియా సోనెట్ (Kia Sonet):
ఫీచర్లు అంటే కియా.. కియా అంటేనే ఫీచర్లు. 8 లక్షల బడ్జెట్‌లో అత్యంత టెక్నాలజీతో కూడిన కారు కావాలనుకుంటే కియా సోనెట్‌ను మించింది లేదు. దీని ధర రూ. 7.30 లక్షల నుంచి మొదలవుతుంది. సోనెట్ లుక్ పరంగా చాలా అగ్రెసివ్‌గా, బోల్డ్‌గా కనిపిస్తుంది. యువతను ఎక్కువగా ఆకట్టుకునే డిజైన్ దీని సొంతం.

సోనెట్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో పెట్రోల్, టర్బో పెట్రోల్ మాత్రమే కాదు, డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. మైలేజ్ పరంగా డీజిల్ వెర్షన్ లీటరుకు 24 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. సోనెట్‌లో వెంటిలేటెడ్ సీట్లు (వేసవిలో చల్లగా ఉండే సీట్లు), ఎలక్ట్రిక్ సన్ రూఫ్, బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో కియా రాజీ పడలేదు. లెవల్-1 ఏడీఏఎస్ (ADAS) టెక్నాలజీ ద్వారా డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలను పసిగట్టి కారును అలర్ట్ చేసే సౌకర్యం ఉంది. సిటీ ట్రాఫిక్‌లో ఈ కారును నడపడం చాలా సులభంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








