రోజూ వందల మంది క్యూ కడుతున్నారు! రూ.3.70 లక్షలకే కారు.. 34 కి.మీ మైలేజ్

భారత కార్ల మార్కెట్లో సంవత్సరాలుగా మంచి గుర్తింపు పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10) ఒకటి. చిన్న సైజు, తక్కువ ధర, మంచి మైలేజీ వంటి అంశాలతో ఈ కారు సాధారణ వినియోగదారుల మధ్య మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం మార్కెట్లో SUV కార్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ హ్యాచ్‌బ్యాక్ తన ప్రత్యేక స్థానం నిలబెట్టుకుంటూ స్థిరమైన అమ్మకాలను కొనసాగిస్తోంది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా ఈ కారుకు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి నెలలో మారుతి సుజుకి మొత్తం 9,787 ఆల్టో K10 కార్లను వినియోగదారులకు డెలివరీ చేసింది.

చిన్న కుటుంబాలు, మొదటిసారి కారు కొనేవారు, తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజీ కలిగిన కారు కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఈ కారు అమ్మకాలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. 2025 ఫిబ్రవరిలో మొత్తం 8,541 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అయితే 2026 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 9,787 యూనిట్లకు పెరగడంతో సుమారు 15 శాతం వార్షిక వృద్ధి నమోదైంది.

India Best Hatchback Maruti Suzuki Alto K10 February 2026 Sales 15 Percent Growth

ఈ గణాంకాలు ఆల్టో కె10 ఇప్పటికీ భారత మార్కెట్లో మంచి ఆదరణను కొనసాగిస్తోందని సూచిస్తున్నాయి. ఆల్టో కె10 ప్రధానంగా సరసమైన ధరతో అందుబాటులో ఉండే కారు కావడంతో సాధారణ వినియోగదారుల మధ్య మంచి ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఈ కారు సుమారు రూ.3.70 లక్షలు నుంచి గరిష్టంగా రూ.5.45 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) లభిస్తోంది. అందువల్ల తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలనుకునే చాలా మంది వినియోగదారులు దీనిని సులభంగా ఎంచుకుంటున్నారు.

నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఈ కారును రూపొందించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సులభంగా నడిపేలా దీని పరిమాణం, డ్రైవింగ్ ఉండటం ప్రత్యేకత. ఇది LXI, VXI, VXI Plus వంటి వేరియంట్లలో అందుబాటులో ఉంది. డిజైన్ పరంగా కూడా ఈ మోడల్‌లో కొన్ని ఆధునిక మార్పులు కనిపిస్తాయి. ఆకర్షణీయమైన లుక్ ఇవ్వడానికి ఇందులో LED హెడ్‌లైట్లు, LED DRLలు, LED టెయిల్ ల్యాంప్‌లు వంటి ఫీచర్లు అందించారు.

India Best Hatchback Maruti Suzuki Alto K10 February 2026 Sales 15 Percent Growth

పనితీరు పరంగా కూడాఆల్టో కె10 మంచి సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఈ కారులో 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 5,500 rpm వద్ద 67.6 PS శక్తిని, 3,500 rpm వద్ద 91 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు సరిపడే శక్తిని ఈ ఇంజిన్ అందిస్తుంది. అదే సమయంలో ఈ కారుకు CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఈ 1.0 లీటర్ CNG ఇంజిన్ 5,300 rpm వద్ద 55.92 PS పవర్, 3,400 rpm వద్ద 82.1 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి ఈ వెర్షన్ మంచి ఎంపిక. వేరియంట్‌ను బట్టి ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో లభిస్తుంది. మైలేజీ 24 నుంచి 34 kmpl వరకు అందిస్తుంది. గరిష్టంగా 145 kmph వేగాన్ని అందుకోగలదు.

India Best Hatchback Maruti Suzuki Alto K10 February 2026 Sales 15 Percent Growth

క్యాబిన్ డిజైన్ సింపుల్‌గా ఉండటంతో పాటు ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఇందులో 5 సీట్లు, 214 లీటర్ల బూట్ స్పేస్ కూడా లభిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Android Auto, Apple CarPlay, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ వంటి సదుపాయాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, March 7, 2026, 17:03 [IST]
English summary
India best hatchback maruti suzuki alto k10 february 2026 sales 15 percent growth
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+