ఆటో ఎక్స్‌పో 2018: ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్

Written By:

ఆటో ఎక్స్‌పో 2018: హ్యుందాయ్ మోటార్స్ ఢిల్లీలో జరుగుతున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద తమ సరికొత్త ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేసింది. సరికొత్త హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 5.34 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 9.15 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు మరియు ఫోటోలు ఇవాళ్టి స్టోరీలో...

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

ఇండియన్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి బాలెనో, వోక్స్‌వ్యాగన్ పోలో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు పోటీగా ఎలైట్ ఐ20 కారును భారీ మార్పులు చేర్పులతో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో హ్యుందాయ్ ఇండియా విడుదల చేసింది.

Recommended Video - Watch Now!
Auto Rickshaw Explodes In Broad Daylight
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ధరలు

స్టాండర్డ్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్న హ్యుందాయ్ ఎలైట్ ఐ20 పెట్రోల్ వేరియంట్ల ధరల శ్రేణి రూ. 5.34 లక్షల నుండి 7.90 లక్షల మధ్య ఉండగా, డీజల్ వేరియంట్ల ధరల శ్రేణి రూ. 6.73 లక్షల నుండి 9.15 లక్షల మధ్య ఉంది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఇంజన్ మరియు స్పెసిఫికేషన్స్

సరికొత్త 2018 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్‌లో అవే మునుపటి తరం ఇంజన్‌లు ఉన్నాయి. ఇందులోని 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ 6,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 83బిహెచ్‌పి పవర్ మరియు 4,000ఆర్‌పిఎమ్ వద్ద 115ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ 1.4-లీటర్ డీజల్ ఇంజన్ 4,000ఆర్‌పిఎమ్ వద్ద 89బిహెచ్‌పి పవర్ మరియు 1,500ఆర్‌పిఎమ్ వద్ద 219ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ట్రాన్స్‌మిషన్

పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మరియు డీజల్ ఇంజన్ వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది. పెట్రోల్ వెర్షన్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను అతి త్వరలో ప్రవేశపెడతామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 డిజైన్

సరికొత్త హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లో ప్రధానంగా గుర్తించదగిన మార్పు సరికొత్త ఫ్రంట్ గ్రిల్. హ్యుందాయ్ గతంలో విడుదల చేసిన ఎలంట్రా మరియు వెర్నాలో అందించిన అదే ఫ్రంట్ గ్రిల్ ఇందులో అందించింది. పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న పదునైన హెడ్ ల్యాంప్స్ హైలైట్‌గా నిలిచాయి.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

2018 ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్‌ రియర్ డిజైన్‌లో టు-పీస్ న్యూ టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ బంపర్ కలర్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సరికొత్త ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ ఆరు విభిన్న ఎక్ట్సీరియర్ రంగుల్లో మరియు మూడు విభిన్న ఇంటీరియర్ రంగుల్లో ఎంచుకోవచ్చు.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

ఎక్ట్సీరియర్ డిజైన్‌తో పాటు ఇంటీరియర్ ఫీచర్ల పరంగా హ్యుందాయ్ ఈ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్‌లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. బ్లాక్ అండ్ బీజి డ్యూయల్ టోన్ థీమ్ ఇంటీరియర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేయగల సరికొత్త 7-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరియు 8-స్పీకర్ ఆడియో సిస్టమ్ కలదు.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ మోటార్స్ ఈసారి తమ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లో భారీ భద్రత ఫీచర్లను అందించింది. రెండు ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్లను అన్ని వేరింయట్ల తప్పనిసరిగా అందించింది. టాప్ ఎండ్ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగులు అందించింది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

నూతన ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ మీద మూడేళ్ల పాటు వారంటీ లేదా ఒక లక్ష కిలోమీటర్ల వారంటీ అందిస్తోంది. అంతే కాకండా మూడేళ్ల పాటు ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్ కల్పిస్తోంది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ మోటార్స్ తమ న్యూ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్‌లో శక్తివంతమైన 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు ఎంతో ముఖ్యమైన ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను మిస్ చేసింది. ఏదేమైనప్పటికీ అధునాతన డిజైన్, అత్యంత పోటీతత్వమున్న ధర మరియు ఎన్నో ఇంటీరియర్ మరియు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లను ఎంచుకునే కస్టమర్లకు ఎలైట్ ఐ20 ఫేవరెట్‌గా నిలవనుంది.

English summary
Read In Telugu: Auto Expo 2018: New Hyundai Elite i20 Launched At Rs 5.34 Lakh — Specs, Features & Colours
Story first published: Wednesday, February 7, 2018, 13:52 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark