అన్ని హీరో టూ వీలర్ల మీద పెరిగిన ధరలు

హీరో మోటోకార్ప్ విపణిలో ఉన్న తమ అన్ని మోడళ్ల మీద ధరలు పెంచింది. కంపెనీ తమ మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని ఉత్పత్తుల ఎక్స్-షోరూమ్ ధరల మీద రూ. 625 పెంచింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి.

By Anil Kumar

ప్రపంచపు అతి పెద్ద మరియు దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ విపణిలో ఉన్న తమ అన్ని మోడళ్ల మీద ధరలు పెంచింది. కంపెనీ తమ మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని ఉత్పత్తుల ఎక్స్-షోరూమ్ ధరల మీద రూ. 625 పెంచింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి.

హీరో టూ వీలర్ల మీద పెరిగిన ధరలు

క్రమంగా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు మరియు ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కునేందుకు తమ అన్ని మోడళ్ల మీద స్వల్ప మేర ధరల పెంపు తప్పనిసరి అయ్యిందని హీరో మోటోకార్ప్ వెల్లడించింది.

హీరో టూ వీలర్ల మీద పెరిగిన ధరలు

హీరో మోటోకార్ప్ ఈ ఏడాదిలో ధరల పెంపు చేపట్టడం ఇది రెండోసారి, మొదటిసారి 2018 జనవరిలో ప్రతి మోడల్ మీద రూ. 400 లు వరకు పెరిగింది. మొదటిసారి ధరల పెంపు కూడా పెట్టుబడి ఖర్చులు పెరగడమే ప్రధాన కారణం.

హీరో టూ వీలర్ల మీద పెరిగిన ధరలు

టీవీఎస్ మోటార్స్ మరియు బజాజ్ ఆటో సంస్థలు తమ అన్ని మోడళ్ల మీద ధరల పెంపు తరువాత హీరో మోటోకార్ప్ కూడా ధరలు పెంపు చేపట్టింది. ఏదేమైనప్పటికీ, ధరల పెంపు జరిగినా టూ వీలర్ల మార్కెట్ స్థిరమైన వృద్దిని సాధిస్తోంది.

హీరో టూ వీలర్ల మీద పెరిగిన ధరలు

హీరో విసృత శ్రేణి టూ వీలర్లను విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి ప్రారంభ మోడల్ హెచ్ఎఫ్ డాన్ ధర రూ. 37,000 ల నుండి గరిష్టంగా అప్‌కమింగ్ హీరో ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ధర రూ. 85,000 లు అంచనాగా ఉండవచ్చు.

హీరో టూ వీలర్ల మీద పెరిగిన ధరలు

ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అతి త్వరలో అతి ముఖ్యమైన ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకును విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఏప్రిల్ చివరి నాటికి లేదా మే ప్రారంభం నాటికల్లా లాంచ్ చేసే అవకాశం ఉంది. సరికొత్త 200సీసీ కెపాసిటి ఇంజన్ గల హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ మార్కెట్లో ఉన్న టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్200 4వి మరియు బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

హీరో టూ వీలర్ల మీద పెరిగిన ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో మోటోకార్ప్ ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు ధరల పెంపు చేపట్టింది. కేవలం నాలుగు నెలలు మాత్రమే పూర్తయిన ఈ సంవత్సరంలో ఇంకా పలుమార్లు ధరలు పెంపు చేపట్టే అవకాశం ఉంది. హీరో, టీవీఎస్ మరియు బజాజ్‌తో పాటు ఇతర టూ వీలర్ల తయారీ సంస్థలు కూడా అతి త్వరలో ధరల పెంపును చేపట్టే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Hero MotoCorp Announces Price Hike Across All Models — Effective Immediately!
Story first published: Thursday, April 26, 2018, 18:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X