హీరో ప్యాసన్ ప్రో మరియు ఎక్స్‌ప్రో విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:

దేశీయ దిగ్గజ కమ్యూటర్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ విపణిలో ప్యాసన్ ప్రో మరియు ఎక్స్‌ప్రో బైకులను లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 53,189 మరియు 54,189 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి. మోటార్ సైకిల్ సామ్రాజ్యంలో ఆధిపత్యం చెలాయిస్తున్న హీరో ప్యాసన్ మోడళ్ల ద్వారా కమ్యూటర్ బైకుల సెగ్మెంట్ మొత్తం వాటాలో 50 శాతాన్ని సొంతం చేసుకునే లక్ష్యాన్ని పెట్టుకుంది.

Recommended Video - Watch Now!
హోండా ఎక్స్-బ్లేడ్ 160సీసీ బైక్ రివీల్ | Honda X-Blade - Details & Full Specifications - DriveSpark
హీరో ప్యాసన్ ప్రో మరియు ఎక్స్‌ప్రో విడుదల

హీరో మోటోకార్ప్ 100-110సీసీ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో 75శాతం వాటాను సొంతం చేసుకుని సింహ భాగంలో నిలిచింది. హీరో మోటోకార్ప్ విపణిలో స్ల్పెండర్ భారతదేశపు అత్యధికంగా అమ్ముడయ్యే మోటార్ సైకిల్ అయితే, ప్యాసన్ బ్రాండ్ రెండవ స్థానంలో నిలిచింది.

హీరో ప్యాసన్ ప్రో మరియు ఎక్స్‌ప్రో విడుదల

హీరో ప్యాసన్ ప్రో

నేటి స్మార్ట్ జనరేషన్ కోసం రూపొందించిన ప్యాసన్ ప్రో బైకులో ఫ్లష్ టైప్ క్యాప్ గల 11-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, రీడిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్, డిస్క్ మరియు డ్రమ్ రెండు రకాల వేరియంట్లలో లభ్యమవుతోంది.

హీరో ప్యాసన్ ప్రో మరియు ఎక్స్‌ప్రో విడుదల

సరికొత్త హీరో ప్యాసన్ ప్రోలో సెమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ కలదు, ఇందులో డిజిటల్ ఫ్యూయల్ గేజ్, ట్రిప్ మీటర్ మరియు సైడ్ స్టాండ్ వంటి వివరాలను పొందవచ్చు.

హీరో ప్యాసన్ ప్రో మరియు ఎక్స్‌ప్రో విడుదల

హీరో ప్యాసన్ ప్రో ఐదు విభిన్న మెటాలిక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. అవి, స్పోర్ట్స్ రెడ్, బ్లాక్ మోనోటోన్, ఫోర్స్‌డ్ సిల్వర్, హెవీ గ్రే మరియు ఫ్రోస్ట్ బ్లూ.

హీరో ప్యాసన్ ఎక్స్‌ప్రో

హీరో ప్యాసన్ ప్రో మరియు ఎక్స్‌ప్రో విడుదల

యువతను టార్గెట్ చేసుకొని, ప్యాసన్ ఎక్స్‌ప్రో బైకును రూపొందించారు. కండలు తిరిగిన ఫ్యూయల్ ట్యాంక్ డీకాల్స్, విభిన్న టెయిల్ ల్యాంప్ డిజైన్, ప్రో నుండి సేకరించిన అదే డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ ఇందులో ఉంది. అయితే, కేవలం 9.2 లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.

హీరో ప్యాసన్ ప్రో మరియు ఎక్స్‌ప్రో విడుదల

హీరో ప్యాసన ఎక్స్‌ప్రో ఐదు రకాల డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లలో లభ్యమవుతోంది. అవి, స్పోర్ట్స్ రెడ్ + బ్లాక్, బ్లాక్ + స్పోర్ట్స్ రెడ్, బ్లాక్ + టెక్నో బ్లూ, బ్లాక్ + హెవీ గ్రే మరియు ఫోర్స్ సిల్వర్ + బ్లాక్. ప్యాసన్ ఎక్స్‌ప్రో బైకులో ట్యూబ్ లెస్ టైర్లు కూడా ఉన్నాయి.

హీరో ప్యాసన్ ప్రో మరియు ఎక్స్‌ప్రో విడుదల

ప్యాసన్ ప్రో మరియు ఎక్స్‌ప్రో రెండు బైకుల్లో కూడా బిఎస్-IV ఉద్గార ప్రమాణాలను పాటించే 110సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 7,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 9.3బిహెచ్‌పి పవర్ మరియు 5,500ఆర్‌పిఎమ్ వద్ద 9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హీరో ప్యాసన్ ప్రో మరియు ఎక్స్‌ప్రో విడుదల

5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల రెండు బైకులు కూడా గంటకు 0 నుండి 60కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.45 సెకండ్లలోనే అందుకుంటుంది. రెండింటిలో కూడా మైలేజ్ పెంచడానికి హీరో పేటెంట్ పొందిన ఐడిల్-స్టార్ట్-స్టాప్-సిస్టమ్(i3s) పరిజ్ఞానం ఇందులో ఉంది.

హీరో ప్యాసన్ ప్రో మరియు ఎక్స్‌ప్రో విడుదల

హీరో మోటోకార్ప్ తమ రెండు మోడళ్లను కూడా అత్యంత అగ్రెసివ్ డిజైన్ శైలిలో, అధునాతన ఫీచర్లతో యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని విపణిలోకి ప్రవేశపెట్టింది. ప్యాసన్ సిరీస్ పరిచయం నుండి హీరో మోటోకార్ప్‌కు బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్‌గా నిలిచింది. నూతన అప్‌డేట్స్, ట్యూబ్ లెస్ టైర్లు, డిస్క్ బ్రేకులు మరియు అత్యంత చాకచక్యంగా నిర్ణయించిన ధరలతో ప్యాసన్ ప్రో మరియు ప్యాసన్ ఎక్స్‌ప్రో బైకుల సేల్స్ ఊపందుకోనున్నాయి.

English summary
Read In Telugu: Hero Passion PRO & XPRO Launched In India; Prices Start At Rs 53,189
Story first published: Friday, March 16, 2018, 13:34 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark