ఎఫ్ఐ టెక్నాలజీతో వస్తున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్

హీరో మోటోకార్ప్ తమ సరికొత్త ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైకును దేశీయ మార్కెట్లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే, తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఫ్య

By Anil Kumar

ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ సరికొత్త ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైకును దేశీయ మార్కెట్లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే, తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ వస్తున్నట్లు తెలిసింది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఎఫ్ఐ

హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీమ్200ఆర్ బైకును రానున్న రెండు వారాల్లో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. రిపోర్ట్స్ మేరకు, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ గల ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ టాప్ ఎండ్ వేరియంట్‌ను ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయనుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఎఫ్ఐ

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ మరియు ఎక్స్‌పల్స్ రెండు బైకులను ఒకే ఛాసిస్ మీద నిర్మించింది. అయితే, రెండు బైకులను కూడా వాటి లక్షణాలకు అనుగుణంగా ట్యూనింగ్ చేసిన ఇంజన్‌లను అందివ్వడం జరిగింది. అయితే రెండింటిలో కూడా ఒకే ఇంజన్ మరియు విడి పరికరాలు ఉన్నాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఎఫ్ఐ

సాంకేతికంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకులో 200సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 18.1బిహెచ్‌పి పవర్ మరియు 17.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ లీటర్‌కు 39.9కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఎఫ్ఐ

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైకులో ముందు వైపున 37ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్ కోసం ముందు వైపున 276ఎమ్ఎమ్ డిస్క్ మరియు వెనుక వైపున 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఎఫ్ఐ

సేఫ్టీ పరంగా ఫ్రంట్ డిస్క్ బ్రేకు వద్ద సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా కలదు. వచ్చే ఏప్రిల్ 2019 నుండి 125సీసీ కంటే ఎక్కువ కెపాసిటి గల అన్ని టూ వీలర్లలో కూడా ఏబిఎస్ తప్పనిసరి చేయడంతో హీరో మోటోకార్ప్ 125సీసీ ఎక్కువ కెపాసిటి గల అన్ని టూ వీలర్లలో ఏబిఎస్ అందివ్వడానికి సిద్దమైంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఎఫ్ఐ

రోజు వారీ అవసరాలకు ఉపయోగించే 160సీసీ బైకులకు ప్రత్యామ్నాయంగా 200సీసీ సెగ్మెంట్ రేంజ్‌లో అత్యుత్తమ పవర్ మరియు అధిక మైలేజ్‌నిచ్చే బ్రాండెడ్ పర్ఫామెన్స్ బైకులను ఎంచుకోవాలనుకునే వారికి హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అంతే కాకుండా, ఇతర 200సీసీ బైకులతో పోల్చుకుంటే అత్యంత సరసమైన ధరలో రానుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఎఫ్ఐ

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ వేరియంట్ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే, విపణిలో ఉన్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 మరియు టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. మరియు వీటి కంటే తక్కువ ధరలోనే లభ్యం కానుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఎఫ్ఐ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయ కమ్యూటర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్‌ను శాసిస్తున్న హీరో మోటోకార్ప్ పర్ఫామెన్స్ మోటార్ సైకిల్ విభాగంలో రాణించలేకపోతోంది. ఎలాగైనా ఈ సెగ్మెంట్లో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు 200సీసీ కెపాసిటి గల బైకులను సిద్దం చేస్తోంది. అందులో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ మరియు ఎక్స్‌పల్స్200.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఎఫ్ఐ

దేశీయ విపణిలో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైక్ హీరో మోటోకార్ప్‌కు అత్యంత ముఖ్యమైన మోడల్ కానుంది. హీరో యొక్క హైఎండ్ మరియు ఖరీదైన ఉత్పత్తి ఎక్స్‌ట్రీమ్ 200ఆర్. మరి ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకు హీరో కంపెనీకి విజయాన్ని సాధించిపెడుతుందా....? హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్‌లో మాతో పంచుకోండి....

Source: Bikewale

Most Read Articles

English summary
Read In Telugu: Hero Xtreme 200R To Get Fuel Injection System — Launch Details Revealed
Story first published: Tuesday, May 29, 2018, 10:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X