ఆంపియర్ నుంచి బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, ఆటోవెర్ట్‌తో ఒప్పందం

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఆంపియర్ వెహికల్స్ దేశంలో సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఉత్పత్తులను అందించడానికి ఫైనాన్షియల్-టెక్ కంపెనీ ఆటోవర్ట్ టెక్నాలజీస్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త భాగస్వామ్యంతో ఆంపియర్ ఈవి యజమానులు ఇప్పుడు బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

ఆంపియర్ నుంచి బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, ఆటోవెర్ట్‌తో ఒప్పందం

ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ విధానాన్ని ముందుగా బెంగళూరు నగరంలోని ఎంపిక చేసిన డీలర్ల వద్ద ప్రారంభించారు. ఈ ప్రణాళిక ద్వారా ఇకపై ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సొంతం చేసుకోవటం మరింత సరళతరంగా మారుతుంది. దేశవ్యాప్తంగా బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్రణాళికను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.

ఆంపియర్ నుంచి బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, ఆటోవెర్ట్‌తో ఒప్పందం

కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్రణాళిక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలకు అయ్యే ఖర్చును తగ్గిస్తుందని మరియు కొనుగోలుదారులకు ప్రత్యామ్నాయ ఎంపికను అందిస్తుందని బ్రాండ్ పేర్కొంది.

MOST READ:ఎలక్ట్రిక్ కారుకి పెట్రోల్ నింపడానికి ట్రై చేసిన వ్యక్తి : ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

ఆంపియర్ నుంచి బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, ఆటోవెర్ట్‌తో ఒప్పందం

ఈ కొత్త విధానంతో వినియోగదారులు ఇప్పుడు ఆంపియర్ ఇటీవలే విడుదల చేసిన మాగ్నస్ ప్రో మోడల్‌ను రూ.49,990 తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు, అయితే వీరు నెలవారీ బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌ను రూ.1,990 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మామూలుగా అయితే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.73,990గా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

ఆంపియర్ నుంచి బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, ఆటోవెర్ట్‌తో ఒప్పందం

కొత్త బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్రణాళిక, ఆంపియర్ ఇప్పటికే అందిస్తున్న ఇతర వాహన ప్రయోజనాలైన ఐదేళ్ల పొడిగించిన వారంటీ, పూర్తి వాహన భీమా, 24 నెలల సర్వీస్ అండ్ మెయింటినెన్స్, బ్యాటరీల రీప్లేస్‌మెంట్‌పై తగ్గింపులు మొదలైన ప్రయోజనాలను అందిస్తున్నారు.

MOST READ:వర్షపు నీటిలో పడవపై ప్రయాణించిన వ్యక్తిపై కేసు బుక్ చేసిన పోలీసులు : ఎందుకో తెలుసా

ఆంపియర్ నుంచి బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, ఆటోవెర్ట్‌తో ఒప్పందం

ఆంపియర్ వెహికల్స్ నుంచి లభిస్తున్న మాగ్నస్ ప్రో మరియు జీల్ మోడళ్లకు నెలకు రూ.2,777 నుండి పూర్తి వాహన సబ్‌స్క్రిప్షన్ ప్రణాళికలను కంపెనీ అందిస్తుంది.

ఆంపియర్ నుంచి బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, ఆటోవెర్ట్‌తో ఒప్పందం

ఈ విషయంపై ఆంపియర్ వెహికల్స్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ పి సంజీవ్ మాట్లాడుతూ, "ఈ ప్రత్యేకమైన బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్రణాళికను ప్రవేశపెట్టడానికి ఆటోవర్ట్ టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉంది. ప్రత్యేక ఆంపియర్ స్వేచ్ఛా ఆఫర్లతో కూడిన ఈ అసోసియేషన్‌తో, మేము ఆంపియర్ వాహనాలను మరింత సరసమైనవిగా మరియు వినియోగదారునికి అందుబాటులో ఉండేలా లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అన్నారు.

MOST READ:చివరకు పట్టుబడ్డ దేశంలోనే అతిపెద్ద దొంగల ముఠా

ఆంపియర్ నుంచి బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, ఆటోవెర్ట్‌తో ఒప్పందం

ఇదే విషయంపై ఆటోవర్ట్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ వినయ్ శర్మ మాట్లాడుతూ, "ఈవి యొక్క మాడ్యులర్ స్వభావాన్ని బట్టి బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ సాధ్యమే, ఇది వాహనం నుండి బ్యాటరీని విడదీయడానికి మరియు దాని జీవితచక్రం చుట్టూ అందించే నిర్దిష్ట సేవలను అందిచడానికి సహకరిస్తుంద"ని చెప్పారు.

ఆంపియర్ నుంచి బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, ఆటోవెర్ట్‌తో ఒప్పందం

ఆంపియర్-ఆటోవెర్ట్ ఒప్పందంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ కొత్త బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్రణాళికతో ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తాయని మేము భావిస్తున్నాము. ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ మోడల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కంపెనీ మరిన్ని అమ్మకాల గణాంకాలను నమోదు చేసుకోగలదని ఆశిస్తున్నాము.

MOST READ:240 ఇంచ్ చక్రాలతో కొత్త రికార్డ్ సృష్టించిన కార్ [వీడియో]

Most Read Articles

English summary
Ampere Vehicles has announced a partnership with financial-tech company Autovert Technologies to offer subscription-based products in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X