Just In
- 8 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 20 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 20 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 23 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- Sports
IPL 2021: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం! ఆడేది అనుమానమే!
- News
కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా
- Finance
పదింటిలో 9 కంపెనీల్లో నియామకాల జోరు, ఐటీలో అదుర్స్
- Movies
మరోసారి నందమూరి హీరోతో బోయపాటి మూవీ: యాక్షన్ స్టోరీని రెడీ చేసిన మాస్ డైరెక్టర్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అప్డేటెడ్ ఫీచర్లతో లాంచ్ అయిన కొత్త బజాజ్ ప్లాటినా 100 కిక్ స్టార్ట్ ; ధర & వివరాలు
భారత మార్కెట్లో ఎక్కువగా అమ్ముడైన బజాజ్ ఆటో బ్రాండ్ యొక్క మోటారుసైకిల్ బజాజ్ ప్లాటిన. ఇప్పడు బజాజ్ కంపెనీ తన ప్లాటినా 100 కిక్ స్టార్ట్ వేరియంట్‌ను కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో తీసుకువచ్చింది. కొత్త ఫీచర్లతో వచ్చిన ఈ ప్లాటినా 100 (కిక్ స్టార్ట్) బైక్ ధర రూ. 51,667 (ఎక్స్-షోరూమ్).

బజాజ్ ప్లాటినా 100 కిక్ స్టార్ట్ బైక్ రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి కాక్టెయిల్ వైన్ రెడ్ మరియు ఎబోనీ బ్లాక్ విత్ సిల్వర్ డెకాల్. ఈ బైక్ కొత్త నవీనీకరణలతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, అంతే కాకుండా ఇది వాహనదారునికి చాలా సౌకర్యవంతంగా కూడా ఉటుంది.

స్ప్రింగ్ ఆన్ స్ప్రింగ్ నైట్రోక్స్ సస్పెన్షన్ ఇప్పుడు కొత్త ప్లాటినా 100 కిక్ స్టార్ట్‌లో అందించబడుతోంది. కొత్త సస్పెన్షన్‌తో రైడ్ ఇప్పుడు 15 శాతం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ సస్పెన్షన్ రోడ్లపై మరింత ప్రభావవంతంగా ఉంటుంది మరియు పాత సస్పెన్షన్ కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఇస్తుంది.
MOST READ:ఎక్స్‌యూవీ 500 ని కాపాడిన మహీంద్రా థార్ ఎస్యూవీ, ఎలాగో చూసారా ?

ఈ బైక్‌లో సస్పెన్షన్ సైజును కూడా మునుపటికంటే 20 శాతం పెంచారు. ఈ కారణంగా కఠినమైన రోడ్లలో నడపడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బైక్ లో రోడ్డుపై పంక్చర్ నివారించడానికి, ట్యూబ్‌లెస్ టైర్లను అందిస్తున్నారు.

ప్లాటినా 100 కిక్ స్టార్ట్ కొత్త మోడల్ సీటును కలిగి ఉంది, ఇది మంచి పట్టును కలిగి ఉంది. ఇది బైక్ నడుపుతున్నప్పుడు డ్రైవర్ కి మరియు వెనుక కూర్చున్న వారికీ చాలా కంపర్ట్ గా ఉంటుంది.
MOST READ:రూ. 30 వేల విలువైన స్కూటర్‌కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?

ఈ కొత్త బైక్ లో బజాజ్ కొత్త ఫీచర్స్ అప్డేట్స్ చేసింది. కంపెనీ దీనికి ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌ను జోడించింది. దీంతో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లైట్‌ను కూడా అందిస్తున్నారు. పాత హెడ్‌లైట్ కంటే ఎల్‌ఈడీ హెడ్‌లైట్ దృశ్యమానత ఎక్కువగా ఉందని కంపెనీ తెలిపింది.

బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ పై మంచి పట్టు కోసం ప్రొటెక్టివ్ ట్యాంక్ ప్యాడ్లను అందిస్తున్నారు. దీనితో పాటు మిర్రర్స్ మరియు ఇండికేటర్స్ కూడా పునఃరూపకల్పన చేశారు. ఈ బైక్‌లో ఇప్పటికే మంచి గ్రిప్ కోసం రబ్బర్ ఫుట్‌ప్యాడ్‌లు ఉన్నాయి.
MOST READ:ఒకే కారుని 14 సార్లు అమ్మిన ఘరానా మోసగాడు.. ఇంతకీ ఇది ఎలా జరిగిందో తెలుసా

బజాజ్ కంపెనీ ఈ బైక్ గురించి మాట్లాడుతూ, బజాజ్ ప్లాటినా మోడల్ 15 సంవత్సరాలుగా అమ్మకానికి ఉంది, ఇప్పటివరకు ఈ బైక్ 72 లక్షలకు పైగా విక్రయించిందని పేర్కొంది. ఈ బైక్‌ను దేశీయ మార్కెట్లో చాలామంది వాహనదారులు ఇష్టపడుతున్నారు.

బజాజ్ 100 కిక్ స్టార్ట్ మోడల్‌ను అక్టోబర్‌లో రూ. 46,832 (ఎక్స్‌షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ బైక్‌ను కేవలం ఒక నెల సమయంలోనే మళ్ళీ అప్‌డేట్ చేసింది. బజాజ్ ప్లాటినా సరసమైన ధర వద్ద లభించే నాణ్యమైన మైలేజీని అందించే బైక్. కంపెనీ మొదట ప్లాటినాతో కంఫర్టెక్ టెక్నాలజీని ప్రారంభించింది.

బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో 1,88,196 యూనిట్ల వాహనాలను విక్రయించినాట్లు నివేదిక ద్వారా తెలిసింది. గత నెలలో ఇది దాదాపు 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే నవంబర్ నెలలో కంపెనీ 1,76,337 యూనిట్ల వాహనాలను విక్రయించింది.

బజాజ్ వాణిజ్య వాహన అమ్మకాలు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 38 శాతం తగ్గాయి. ద్విచక్ర వాహన, వాణిజ్య వాహనాలతో సహా కంపెనీ మొత్తం 4,22,240 యూనిట్ల వాహనాలను విక్రయించింది. కరోనా లాక్ డౌన్ తర్వాత కంపెనీ అమ్మకాల పరంగా ముందుకు దూసుకెళ్తోంది. ఇపుడు ఈ కొత్త బైక్ లాంచ్ చేయడం వల్ల ద్విచక్ర వాహన విభాగంలో మంచి అమ్మకను సాధిస్తుంది భావించవచ్చు.
MOST READ:ఇండియన్ రైల్వే విడుదల చేసిన వీడియో.. ఇది చూస్తే మీరు తప్పకుండా ట్రైన్లోనే వెళ్తారు