రెండవసారి పెరిగిన హీరో డెస్టిని స్కూటర్ ధర, ఈసారి ఎంతంటే?

భారతదేశపు నెంబర్ వన్ టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన కొత్త 2020 బిఎస్6 డెస్టిని 125 స్కూటర్ ధరను రెండవసారి పెంచింది. విడుదల సమయంలో దీని ప్రారంభ ధర రూ.64,310గా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ఉండేది. అయితే, మే నెలలో, హీరో రెండు వేరియంట్ల డెస్టిని బిఎస్6 స్కూటర్ ధరలను రూ.1,300 మేర పెంచింది.

రెండవసారి పెరిగిన హీరో డెస్టిని స్కూటర్ ధర, ఈసారి ఎంతంటే?

ప్రస్తుతం హీరో డెస్టిని 125 బిఎస్6 స్కూటర్ భారత మార్కెట్లో ఎల్ఎక్స్ మరియు విఎక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. మొదటి పెంపు తర్వాత ఎంట్రీ లెవల్ ఎల్ఎక్స్ వేరియంట్ ధరలు రూ.65,310, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ .68,100గా మారాయి.

రెండవసారి పెరిగిన హీరో డెస్టిని స్కూటర్ ధర, ఈసారి ఎంతంటే?

కాగా తాజాగా, హీరో మోటోకార్ప్ ఎల్ఎక్స్, విఎక్స్ వేరియంట్ల ధరలను మరోసారి వరుసగా రూ.1,890, రూ.1,950 మేర పెంచింది. ఈ కొత్త ధరల పెంపు తర్వాత ఇప్పుడు బేస్ వేరియంట్ ధర రూ.67,200 గానూ, టాప్-ఎండ్ ధర రూ.70,050 గానూ (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

MOST READ:హోండా లివో బిఎస్6 డిస్క్ బ్రేక్ వేరియంట్ ధరెంతో తెలుసా?

రెండవసారి పెరిగిన హీరో డెస్టిని స్కూటర్ ధర, ఈసారి ఎంతంటే?

హీరో డెస్టిని 125 స్కూటర్‌లో స్టార్ట్ / స్టాప్ టెక్నాలజీ, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయెల్-టెక్చర్ సీట్స్, అల్లాయ్ వీల్స్, చుట్టూ క్రోమ్ యాక్సెంట్స్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, బూట్ ల్యాంప్ మొదలైన విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి.

రెండవసారి పెరిగిన హీరో డెస్టిని స్కూటర్ ధర, ఈసారి ఎంతంటే?

ఇంజన్ విషయానికి వస్తే, హీరో డెస్టిని 125లో బిఎస్6 కంప్లైంట్ 124సిసి సింగిల్ సిలిండర్ ఫ్యూయెల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పి శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డెస్టిని 125 దాని బిఎస్4 వేరియంట్‌తో పోలిస్తే 11 శాతం మెరుగైన మైలేజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

MOST READ:గుడ్ న్యూస్.. ఆగస్టు 22 న ప్రారంభం కానున్న టయోటా అర్బన్ క్రూయిజర్

రెండవసారి పెరిగిన హీరో డెస్టిని స్కూటర్ ధర, ఈసారి ఎంతంటే?

ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో హైడ్రాలిక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, స్కూటర్ రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండు ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. అంటే, ఏ బ్రేక్ ప్రెస్ చేసినా రెండూ బ్రేక్స్ యాక్టివేట్ అవుతాయన్నమాట.

రెండవసారి పెరిగిన హీరో డెస్టిని స్కూటర్ ధర, ఈసారి ఎంతంటే?

హీరో మోటోకార్ప్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ తమ ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మరియు ఎక్స్‌పుల్స్ 200టి మోటార్‌సైకిళ్లలో బిఎస్6 కంప్లైంట్ వెర్షన్లను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రెండు మోడళ్లకు సంబంధించిన టీజర్లను కూడా విడుదల చేసింది.

MOST READ:ల్యాండ్ రోవర్ ని కాపాడిన మహీంద్రా థార్, ఎలాగో వీడియో చూడండి

రెండవసారి పెరిగిన హీరో డెస్టిని స్కూటర్ ధర, ఈసారి ఎంతంటే?

ఈ రెండు మోటార్‌సైకిళ్లలో ఒకేరకమైన 200సిసి ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 17.7 బిహెచ్‌పి శక్తిని మరియు 6400 ఆర్‌పిఎమ్ వద్ద 16.45 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

రెండవసారి పెరిగిన హీరో డెస్టిని స్కూటర్ ధర, ఈసారి ఎంతంటే?

హీరో డెస్టిని 125 బిఎస్6 ధర పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హీరో డెస్టిని 125 బిఎస్6 మోడల్‌లో అప్‌డేటెడ్ ఇంజన్ మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఈ కొత్త ఇంజన్ ఇప్పుడు మెరుగైన పనితీరు, మైలేజ్ మరియు శుద్ధీకరణను కలిగి ఉంటుంది. ఇది ఈ విభాగంలో సుజుకి యాక్సెస్ 125, హోండా యాక్టివా 125, టివిఎస్ ఎన్‌టార్క్ 125 మరియు భారత మార్కెట్లో కొత్తగా వచ్చిన యమహా ఫ్యాసినో 125 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:మహీంద్రా థార్‌కి పోటీగా వస్తున్న ఫోర్స్ గుర్ఖా ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ

Most Read Articles

English summary
Hero MotoCorp launched the Destini 125 BS6 earlier this year in the Indian market at a starting price of Rs 64,310, ex-showroom (Delhi). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X