హోండా యాక్టివా 6జి మోడల్‌కి పోటీగా హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 మోడల్

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ విపణిలో విక్రయించిన మాస్ట్రో ఎడ్జ్ 110 మోడల్‌లో కంపెనీ కొత్తగా బిఎస్6 వెర్షన్‌ను ఆవిష్కరించింది. కొత్త బిఎస్6 హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 ఈ నెలలోనే భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ కొత్త స్కూటర్‌లో ఫీచర్లను కూడా కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది.

హోండా యాక్టివా 6జి మోడల్‌కి పోటీగా హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 మోడల్

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 ఎక్స్‌టీరియర్ డిజైన్ ఇదివరకటిలానే ఉంటుంది. అయితే, ఈ స్కూటర్ ఇప్పుడు ఆరు కొత్త రంగులలో అప్‌గ్రేడెడ్ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది. ఇందులో పెరల్ ఫేడ్‌లెస్ వైట్, మిడ్‌నైట్ బ్లూ, కాండీ బ్లేజింగ్ రెడ్, టెక్నో బ్లూ, పాంథర్ బ్లాక్ మరియు సీల్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లభిస్తున్నాయి.

హోండా యాక్టివా 6జి మోడల్‌కి పోటీగా హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 మోడల్

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 స్కూటర్ ఇదివరకటి బిఎస్4 ఇంజన్‌నే కొత్తగా బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించారు. ఇందులోని 110.9 సిసి ఇంజన్ ఇప్పుడు ఇంధన-ఇంజెక్ట్ చేయబడింది మరియు మెరుగైన ఇంధన సామర్థ్యం మరియు పనితీరు కోసం బ్రాండ్ యొక్క ఎక్స్‌సెన్స్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

MOST READ:పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసిన కవాసకి నింజా బైక్ రేసర్లు.. చివరికి ఏమైందంటే ?

హోండా యాక్టివా 6జి మోడల్‌కి పోటీగా హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 మోడల్

ఈ ఇంజన్ ఇప్పుడు గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.75 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ బిఎస్6 అప్‌గ్రేడ్‌ను పొందినప్పటికీ, ఇది దాని పవర్ మరియు టార్క్ విషయంలో ఎలాంటి మార్పును పొందలేదు.

హోండా యాక్టివా 6జి మోడల్‌కి పోటీగా హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 మోడల్

ఈ స్కూటర్‌లో హాలోజన్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్, డ్యూయెల్-టోన్ రియర్ వ్యూ మిర్రర్స్, కాంబినేషన్ లాక్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్-ఫిల్లర్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు సర్వీస్ రిమైండర్‌ మరియు సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:మళ్ళీ కొత్తగా మారిన రాజ్‌దూత్ 175 బైక్.. చూసారా ?

హోండా యాక్టివా 6జి మోడల్‌కి పోటీగా హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 మోడల్

కొత్త హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6లో అండర్ సీట్ స్టోరేజ్‌లో ఉంచిన యుఎస్‌బి ఛార్జింగ్ స్లాట్‌తో పాటుగా బూట్-లైట్, స్టబ్బీగా కనిపించే ఎగ్జాస్ట్, రియర్ గ్రాబ్ రైల్స్ మరియు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

హోండా యాక్టివా 6జి మోడల్‌కి పోటీగా హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 మోడల్

హీరో మాస్ట్రో స్కూటర్ కొలతలను గమనిస్తే, ఇది 1843 మిమీ పొడవు, 715 మిమీ వెడల్పు, 1188 మిమీ ఎత్తు మరియు 1261 మిమీ వీల్ బేస్‌ను కలిగి ఉంటుంది. దీని రైడర్ సీటు ఎత్తు 775 మి.మీ మరియు స్కూటర్ భూమిపై నుండి 155 మి.మీలతో మంచి గ్రైండ్ క్లియరెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 మొత్తం 112 కిలోల బరువును మరియు 5-లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

MOST READ:ఆగస్ట్ నెలలో ఆగని హీరో మోటోకార్ప్ జోరు

హోండా యాక్టివా 6జి మోడల్‌కి పోటీగా హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 మోడల్

ఇక స్కూటర్‌ సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు సింగిల్ సైడ్ షాక్ అబ్జార్బర్ ఉంటాయి. ఇందులో ఇరువైపులా డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది, ఇది బ్రాండ్ యొక్క ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తుంది.

హోండా యాక్టివా 6జి మోడల్‌కి పోటీగా హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 మోడల్

ఇలాగే, ఇందులో ముందు భాగంలో 90/90 సెక్షన్ ట్యూబ్‌లెస్ టైర్‌తో కూడిన 12 ఇంచ్ అల్లాయ్ వీల్ ఉంటుంది మరియు వెనుక వైపు 90 ఇంచ్ ట్యూబ్‌లెస్ టైర్‌తో కూడిన 10 ఇంచ్ అల్లాయ్ వీల్ ఉంటుంది. హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 కిక్ లేదా సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్‌తో లభిస్తుంది.

MOST READ:ఇకపై వారికి మాస్క్ అవసరం లేదు ; ఎవరికో తెలుసా ?

హోండా యాక్టివా 6జి మోడల్‌కి పోటీగా హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 మోడల్

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 స్కూటర్ ఆవిష్కరణపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 స్కూటర్ ఇప్పుడు ఉత్తేజకరమైన కొత్త గ్రాఫిక్స్‌తో పాటుగా మరిన్ని అధునాతన ఫీచర్లను కలిగి ఉండనుంది. ఇజి ఈ విభాగంలో హోండా యాక్టివా 6జి మరియు టివిఎస్ జూపిటర్ బిఎస్6 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ బిఎస్6 స్కూటర్ దాని బిఎస్4 ధర కంటే సుమారు రూ.6,000 అధిక ధరను కలిగి ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Hero MotoCrop has unveiled the new Maestro Edge 110 BS6 scooter in the Indian market. The Maestro Edge 110 is expected to be launch in the country sometime this month. The company is offering the scooter with a host of new features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X