Just In
Don't Miss
- News
ఢిల్లీ ఘర్షణ: 86 మంది పోలీసులకు గాయాలు, చిక్కుకున్న 300 మంది కళాకారులు..
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కరోనా బాధితుల కోసం బైక్ అంబులెన్సులు విరాళంగా ఇచ్చిన హీరో మోటోకార్ప్
భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా బాధితుల వల్ల హాస్పిటల్స్ మరియు అత్యవసర సదుపాయాలైన అంబులెన్సులు సరిపోవడం లేదు. ఈ కారణంగా కరోనా బాధితుల సహాయార్థం హీరో మోటోకార్ప్ దేశ వ్యాప్తంగా దాదాపు 60 మొబైల్ అంబులెన్సులను విరాళంగా ఇచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

హీరో మోటోకార్ప్ భారతదేశం అంతటా 60 ఫస్ట్ రెస్పాండర్ మొబైల్ అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చింది. ఈ అంబులెన్స్‌లు హీరో మోటార్‌సైకిళ్లలో 150 సిసి ఇంజిన్ కి అనుబంధంగా నిర్మించబడ్డాయి. ఇవి దేశవ్యాప్తంగా సంబంధిత అధికారులకు పంపిణీ చేయబడతాయి.

హీరో మోటోకార్ప్ యొక్క యుటిలిటేరియన్ మొబైల్ అంబులెన్సులు గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లోని రోగులను చేరుకోవడానికి మరియు సమీప ఆసుపత్రులకు తరలించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
MOST READ: అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించబడిన హోండా మోటార్ సైకిల్స్, ఎందుకంటే..?

ఈ హీరో మోటోకార్ప్ అంబులెన్సులలో ప్రథమ చికిత్స చేయడానికి అవసరమైన వస్తువులు, ఆక్సిజన్ సిలిండర్, సైరన్ వంటి అవసరమైన వైద్య పరికరాలతో చాలా అనుకూలంగా తయారు చేయబడి ఉంటుంది.

హీరో మోటోకార్ప్‌తో కరోనా సహాయార్థం రూ. 100 కోట్లు వెచ్చించడానికి ముందుకు వచ్చింది. ఇందులో రూ. 50 కోట్లు ఇటీవల పిఎమ్-కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వడం జరిగింది, మిగిలిన 50 కోట్ల రూపాయలు ఇతర సహాయక చర్యల కోసం వెచ్చించబడతాయి.
MOST READ: అంబానీ యొక్క రోల్స్ రాయిస్ కార్స్ చూసారా..!

మార్పు చేసిన మోటార్‌సైకిళ్లను గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహన అంబులెన్స్‌లుగా ఉపయీగించడానికి ఉపయోగిస్తారు. అంతే కాకుండా కంపెనీ వైద్య సహాయం కోసం మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్ గ్లౌజులు మరియు 100 వెంటిలేటర్లను పంపిణీ చేస్తుంది.
ఇది మాత్రమే కాకుండా రోజువారీ వేతన కార్మికులు, ఒంటరిగా ఉన్న కార్మికులు మరియు నిరాశ్రయులైన కుటుంబాలకు చాల వరకు సహాయం చేస్తుంది. భారతదేశం మొత్తం మీద ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా , ఉత్తరాఖండ్, గుజరాత్ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాలలో వీరి సహాయక చర్యలు చేపడతారు.

భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని ధారుహెరాలో హీరో గ్రూప్ నిర్వహిస్తున్న బిఎమ్‌ఎల్ ముంజల్ విశ్వవిద్యాలయం స్థానిక ఆరోగ్య శాఖకు కూడా ఐసోలేషన్ మరియు ట్రీట్మెంట్ వార్డ్‌గా ఉపయోగించడానికి 2 వేల పడకల హాస్టల్‌ను అందించింది.
MOST READ: భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 10 కార్లు ఇవే