Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో గ్లామర్ 'బ్లేజ్' స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ హీరో గ్లామర్‌లో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. హీరో గ్లామర్ 'బ్లేజ్' పేరుతో విడుదలైన ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్ ధర రూ.72,200 ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

కొత్త హీరో గ్లామర్ ‘బ్లేజ్' స్పెషల్ ఎడిషన్‌లో అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. ఇది స్టాండర్డ్ వెర్షన్ గ్లామర్ కన్నా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్‌లో బ్రాండ్ అమ్మకాలను మెరుగుపరచడానికి, ఎక్కువ మంది వినియోగదారులను ఈ కొత్త ఉత్పత్తితో ఆకర్షించేందుకు హీరో మోటోకార్ప్ ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.

హీరో గ్లామర్ ‘బ్లేజ్' ఎడిషన్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ ‘మేటర్ వెర్నియర్ గ్రే' కలర్‌లో లభిస్తుంది. కొత్త కలర్ ఆప్షన్‌తో పాటుగా, గ్లామర్ బ్లేజ్ ఎడిషన్‌లో హ్యాండిల్‌బార్‌లో యుఎస్‌బి ఛార్జర్ జోడించారు. దీనిపై ‘ఫంక్-లైమ్' కలర్‌లో కొత్త బాడీ గ్రాఫిక్స్ ఉంటాయి.
MOST READ:ఇల్లుగా మారిన ఇన్నోవా కారు.. చూసారా..!

ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్‌లో పైన పేర్కొన్న అప్‌డేట్స్ మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఇంజన్ విషయానికి వస్తే, హీరో గ్లామర్ ‘బ్లేజ్' ఎడిషన్‌లో అదే 124సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.7బిహెచ్‌పి శక్తిని మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ మోటార్‌సైకిల్ బ్రాండ్ యొక్క ఐ3ఎస్ (ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్)ను కలిగి ఉండి, మైలేజ్‌ను పెంచడంలో సహకరిస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 240 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఇది 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉండి సిటీ మరియు గ్రామీణ రోడ్లకు సైతం అనువుగా ఉంటుంది.
MOST READ:ఈ స్టార్ కపుల్స్ పెళ్లి రోజు కొన్న కారు ధర రూ. 2.65 కోట్లు.. ఇంతకీ వారు ఎవరో తెలుసా ?

ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, హీరో మోటోకార్ప్ సేల్స్ అండ్ ఆఫ్టర్‌సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ మాట్లాడుతూ, "హీరో గ్లామర్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మోడల్. ఇది స్టైల్ మరియు పెర్ఫార్మెన్స్ కలయికతో రూపుదిద్దుకుంది. ఇటీవల ప్రారంభించిన కొత్త బిఎస్6 గ్లామర్‌కు మార్కెట్ నుండి మంచి సానుకల స్పందన లభించింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్లేజ్ దేశంలోని యవతను ఆకర్షించగలదని ఆశిస్తున్నామని" అన్నారు.

ఇదే విషయంపై హీరో మోటోకార్ప్ స్ట్రాటజీ హెడ్ మాలో లే మాసన్ మాట్లాడుతూ, "రానున్న పండుగ సీజన్ కోసం మేము మరిన్ని కొత్త ఉత్పత్తులతో సిద్ధంగా ఉన్నాయి. ఈ జాబితాలో విడుదలైన కొత్త గ్లామర్ బ్లేజ్ ఒక హై-ఆన్-ఎనర్జీ ఎడిషన్, యువ రైడర్లను ఇది ఆకర్షిస్తుందని ఆశిస్తున్నామని" చెప్పారు.
MOST READ:కెమెరాకు చిక్కిన రెడ్ కలర్ ఫోర్స్ గూర్ఖా.. ఇది నిజంగా సూపర్ లుక్ గురూ..!

హీరో గ్లామర్ బ్లేజ్ స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిల్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
హీరో మోటోకార్ప్ నుండి అత్యంత ప్రాచుర్యం పొందిన కమ్యూటర్ (ప్రయాణీకుల) మోటార్‌సైకిళ్లలో హీరో గ్లామర్ ఒకటి. ఈ పాపులర్ మోటార్‌సైకిల్ ఇప్పుడు బ్లేజ్ అనే స్పెషల్ ఎడిషన్ రూపంలో కొత్త అప్‌డేట్స్‌తో అందుబాటులోకి వచ్చింది. స్టాండర్డ్ గ్లామర్ కన్నా కాస్తంత విభిన్నంగా కోరుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది.