Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో ప్లెజర్+ ప్లాటినం స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు
భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కమ్యూటర్ స్కూటర్ 'హీరో ప్లెజర్'లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. 'హీరో ప్లెజర్+ ప్లాటినం' పేరిట కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను విడుదల చేసింది.

కొత్త హీరో ప్లెజర్+ ప్లాటినం స్కూటర్ అనేక కాస్మెటిక్ అప్‌డేట్స్‌తో పాటుగా కొన్ని అదనపు ఫీచర్లను మరియు పరికరాలను కూడా కలిగి ఉంటుంది. ప్లెజర్+ ప్లాటినం ఇప్పుడు బ్రౌన్ ఇన్నర్ ప్యానెల్స్‌తో కొత్త 'మ్యాట్ బ్లాక్' పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంటుంది. ఇది స్కూటర్‌కు మరింత విలాసవంతమైన రూపాన్ని ఇస్తుంది.

ఈ కొత్త స్కూటర్‌లోని అద్దాలు, మఫ్లర్ ప్రొటెక్టర్ మరియు హ్యాండిల్ బార్ చివరలపై క్రోమ్ గార్నిష్ ఉంటుంది. ఈ క్రోమ్ గార్నిష్ స్కూటర్‌కు మరింత ప్రీమియం లుక్‌ని తెచ్చిపెడుతుంది. దీనిపై ఫెండర్ స్ట్రైప్స్ కూడా ఉంటాయి, ఇవి స్కూటర్ స్టైలింగ్‌ను మరింత పెంచడంలో సహకరిస్తాయి. మొత్తమ్మీద ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ మునుపటి కంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
కొత్త హీరో ప్లెజర్+ ప్లాటినం స్కూటర్‌లో కాస్మెటిక్ అప్‌డేట్స్‌తో పాటుగా కొన్ని అదనపు ఫీచర్లు కూడా ఉంటాయి. ఇందులో, ఇప్పుడు లో ఫ్యూయెల్ ఇండికేటర్, వెనుక ప్రయాణీకుల కోసం బ్యాక్‌రెస్ట్, డ్యూయెల్-టోన్ సీట్ అప్‌హోలెస్ట్రీ, వైట్ రిమ్ టేప్ మరియు 3డి లోగో బ్యాడ్జింగ్ వంటి ఫీచర్లు అదనంగా లభిస్తాయి.
MOST READ:తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల భీభత్సం ; భారీ సంఖ్యలో కొట్టుకుపోయిన వాహనాలు

ఇంజన్ పరంగా, కొత్త హీరో ప్లెజర్+ ప్లాటినంలో ఎలాంటి మార్పు లేదు. స్టాండర్డ్ స్కూటర్‌లో ఉపయోగించిన అదే 110సిసి బిఎస్6 కంప్లైంట్ ఫ్యూయెల్ ఇంజెక్ట్ ఇంజన్‌ను ఇందులోనూ ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8 బిహెచ్‌పి పవర్‌ను మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త హీరో ప్లెజర్+ ప్లాటినం స్కూటర్ వేగవంతమైన యాక్సిలరేషన్‌తో పాటుగా 10 శాతం మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ స్కూటర్‌లోని సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ వంటి ఇతర యాంత్రిక భాగాల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు, ఇవి స్టాండర్డ్ మోడళ్ల మాదిరిగానే ఉంటాయి.

ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా హీరో మోటోకార్ప్ సేల్స్ అండ్ ఆఫ్టర్‌సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ మాట్లాడుతూ, "ఐకానిక్ ప్లెజర్ బ్రాండ్ కస్టమర్లతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంది. కొత్త ప్లెజర్+ ప్లాటినం దాని మెరుగైన డిజైన్ అంశాలతో తప్పనిసరిగా మా స్కూటర్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేస్తుంది ఇది స్టైల్ మరియు కంఫర్ట్‌ల సంపూర్ణ కలయికను అందిస్తుందని" అన్నారు.
MOST READ:ఇది చూసారా.. మొబైల్ లైబ్రరీగా మహీంద్రా బొలెరో పిక్-అప్ ట్రక్

ప్రస్తుత పండుగ సీజన్‌లో మరింత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు హీరో మోటోకార్ప్ తమ ఉత్పత్తులలో లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను అందిస్తోంది. ఇటీవలే మాస్ట్రో ఎడ్జ్125 స్టీల్త్ మోడల్‌ను విడుదల చేసిన హీరో మోటోకార్ప్, ఇప్పుడు తాజాగా కొత్త హీరో ప్లెజర్+ ప్లాటినం ఎడిషన్‌ను విడుదల చేసింది. మార్కెట్లో ఈ కొత్త ప్లెజర్+ ప్లాటినం స్కూటర్ ధర రూ.60,950, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.
హీరో ప్లెజర్+ ప్లాటినం స్కూటర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
హీరో మోటోకార్ప్ నుండి లభిస్తున్న ప్లెజర్ స్కూట్ ఈ విభాగంలో చాలా ప్రసిద్ధి చెందిన మోడల్. ఇది భారత మార్కెట్లో 110సిసి స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా 6జి, టివిఎస్ జూపిటర్ వంటి స్కూటర్లకు పోటీగా నిలుస్తుంది. కొత్తగా విడుదలైన ప్లెజర్+ ప్లాటినం మోడల్ స్టాండర్డ్ మోడల్ కన్నా భిన్నంగా ఉంటుంది మరియు ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.