ఇప్పుడు హీరో స్ప్లెండర్ ప్లస్‌ను మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి..

భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ 'స్ప్లెండర్ ప్లస్'లో కంపెనీ ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది. హీరో స్ప్లెండర్ ప్లస్ బ్లాక్ అండ్ యాక్సెంట్ ఎడిషన్ పేరిట కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది.

ఇప్పుడు హీరో స్ప్లెండర్ ప్లస్‌ను మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి..

దేశీయ విపణిలో కొత్త స్పెషల్ ఎడిషన్ హీరో స్ప్లెండర్ ప్లస్ బ్లాక్ అండ్ యాక్సెంట్ ప్రారంభ ధర రూ.64,470 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ కొత్త వేరియంట్ బ్లాక్ టైర్లు, బ్లాక్ ఇంజన్ మరియు బ్లాక్ చైన్ కవర్లతో కూడిన ‘ఆల్-బ్లాక్' థీమ్‌తో లభిస్తుంది. వీటికి అదనంగా మోటార్‌సైకిల్ స్టైలిష్ అప్పీల్‌ను మరింత పెంచడానికి దీనిపై 3డి హీరో లోగో కూడా ఉంటుంది.

ఇప్పుడు హీరో స్ప్లెండర్ ప్లస్‌ను మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి..

ఈ విభాగంలో సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌గా, కంపెనీ కస్టమైజేషన్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది, ఇందులో భాగంగా, వినియోగదారులు అందుబాటులో ఉన్న అనేక యాక్ససరీస్‌ను ఎంచుకొని తమ హీరో స్ప్లెండర్ మోటార్‌సైకిల్‌ను తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అయితే, ప్రస్తుతానికి ఈ కస్టమైజేషన్ ఆప్షన్ కేవలం హీరో స్ప్లెండర్ ప్లస్ బ్లాక్ అండ్ యాక్సెంట్ ఎడిషన్‌కు మాత్రమే అందుబాటులో ఉంది.

MOST READ:కొత్తగా డ్రైవింగ్ చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

ఇప్పుడు హీరో స్ప్లెండర్ ప్లస్‌ను మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి..

ఈ కస్టమైజేషన్ ఆప్షన్లలో బీటెల్ రెడ్, ఫైర్‌ఫ్లై గోల్డెన్ మరియు బంబుల్ బీ ఎల్లో అనే మూడు విభిన్న డిజైన్ థీమ్‌లు ఉంటాయి. కస్టమర్లు వీటి నుండి వారికి నచ్చిన డిజైన్ థీమ్‌ను ఎంచుకోవచ్చు. అయితే, ఇందుకు కస్టమర్లు అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ గ్రాఫిక్ థీమ్స్‌ను రూ.899ల ఆకర్షణీయమైన ధరకు అందిస్తున్నారు. కస్టమర్లు గ్రాఫిక్ థీమ్‌తో పాటుగా 3డి హీరో లోగో, రిమ్ టేప్‌తో కూడిన పూర్తి కిట్‌ను రూ.1,399లకు కొనుగోలు చేయవచ్చు.

ఇప్పుడు హీరో స్ప్లెండర్ ప్లస్‌ను మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి..

హీరో మోటోకార్ప్ యొక్క వినూత్నమైన ‘హీరో కోలాబ్స్' కాంపిటీషన్ ఫలితంగా ఈ ప్రత్యేకమైన కస్టమైజేషన్ కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. ఈ కాంపిటీషన్‌లో భాగంగా, దేశవ్యాప్తంగా పాల్గొన్న ఔత్సాహికులు స్ప్లెండర్ ప్లస్ మోటార్‌సైకిల్ కోసం గ్రాఫిక్ డిజైన్ థీమ్‌లను రూపొందించారు. ఇలా వచ్చిన వేలాది ఎంట్రీల నుంచి టాప్ 3 డిజైన్లను ఎంచుకొన్నారు.

MOST READ:మహీంద్రా థార్ బుకింగ్స్ అదుర్స్.. కేవలం 17 రోజుల్లోనే 15,000 యూనిట్లు బుక్..

ఇప్పుడు హీరో స్ప్లెండర్ ప్లస్‌ను మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి..

ప్రస్తుతం ఈ మూడు డిజైన్ థీమ్‌లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి, వీటిలో దేన్నైనా ఒకదానిని తమ కొత్త మోటార్‌సైకిల్ కోసం ఎంచుకోవచ్చు. అలాకాకుండా, కస్టమర్లు తమ స్పెషల్ ఎడిషన్ హీరో స్ప్లెండర్ ప్లస్ బ్లాక్ అండ్ యాక్సెంట్ మోటార్‌సైకిల్‌ను ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా కూడా కొనుగోలు చేయవచ్చు.

ఇప్పుడు హీరో స్ప్లెండర్ ప్లస్‌ను మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి..

గడచిన ఏప్రిల్ 7, 2020న ప్రారంభించిన హీరో కోలాబ్స్ కాంపిటీషన్ ఔత్సాహికులు, బ్రాండ్ అభిమానులు, విద్యార్థులు మరియు నిపుణులకు వారి సృజనాత్మకతను మరియు డిజైన్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి అనువైన వేదికను అందించింది. ఈ ఛాలెంజ్ కోసం 10,000కు పైగా రిజిస్ట్రేషన్లను వచ్చాయి.

MOST READ:మీరు ఎప్పుడూ చూడని మోడిఫైడ్ సూరజ్ 325 సిసి బైక్

ఇప్పుడు హీరో స్ప్లెండర్ ప్లస్‌ను మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి..

హీరో స్ప్లెండర్ ప్లస్ బ్లాక్ అండ్ యాక్సెంట్ ఎడిషన్‌లో పైన పేర్కొన్న కాస్మెటిక్ మార్పులు మినహా యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో అదే 97.2సిసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7.9 బిహెచ్‌పి పవర్‌ను మరియు 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఇప్పుడు హీరో స్ప్లెండర్ ప్లస్‌ను మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి..

హీరో స్ప్లెండర్ ప్లస్ బ్లాక్ అండ్ యాక్సెంట్ ఎడిషన్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హీరో మోటోకార్ప్ తమ పాపులర్ స్ప్లెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌లో ఈ విభాగంలోనే మొట్టమొదటి సారిగా కస్టమైజేషన్ ఆప్షన్లను పరిచయం చేసింది. స్ప్లెండర్ ప్లస్ బ్లాక్ అండ్ యాక్సెంట్ వేరియంట్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్న మూడు పర్సనలైజేషన్ ఆప్షన్ల నుండి ఒక దానిని ఎంచుకోవచ్చు.

MOST READ:మతిపోగొడుతున్న మోడిఫైడ్ హిందూస్తాన్ అంబాసిడర్

Most Read Articles

English summary
Hero MotoCorp has launched a new special edition variant of its popular Splendor+ motorcycle called Black & Accent edition in the Indian market. Prices for the new special edition Splendor+ Black & Accent starts at Rs 64,470 (ex-showroom, Delhi). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X