Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్, హీరో ఎక్స్‌పల్స్ 200టి బిఎస్6 టీజర్స్ విడుదల
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లో రెండు ప్రీమియం బిఎస్6 మోటార్‌సైకిళ్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ ఇప్పటికే తమ కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్, హీరో ఎక్స్‌పల్స్ 200టి బిఎస్6 మోడళ్లకు సంబంధించి కంపెనీ టీజర్‌లను తమ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్, హీరో ఎక్స్‌పల్స్ 200టి మోటార్‌సైకిళ్లు రెండూ కేవలం బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ అప్‌డేట్‌ను మాత్రమే పొందనున్నాయి. వీటిలో ఇంజన్ మార్పులు మినహా వేరే ఏ ఇతర మార్పులు లేదా అదనపు ఫీచర్లను జోడించబోరని తెలుస్తోంది.
హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ పూర్తిస్థాయి మోటార్‌సైకిల్ కాగా, హీరో ఎక్స్‌పల్స్ 200టి టూరర్ మోటార్‌సైకిల్‌గా ఉంటుంది. ఇవి రెండు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ వంటి ఇతర పరికరాలు, ఫీచర్లతో లభ్యం కానుంది.

ఇకపోతే, హీరో ఎక్స్‌పల్స్ 200టి టూరర్ మోటార్‌సైకిల్‌లో దాని ఆఫ్-రోడ్-ఓరియంటెడ్ వెర్షన్ అయిన 'ఎక్స్‌పల్స్ 200' మోటార్‌సైకిల్ నుండి గ్రహించిన అనేక విడిభాగాలను, పరికరాలను కలిగి ఉంటుంది. ఈ ఆఫ్-రోడ్ వెర్షన్ ఎక్స్‌పల్స్ 200ను కూడా ఇప్పటికే కొత్త కాలుష్య ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేయబడినది.
MOST READ:వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్

త్వరలో విడుదల కానున్న ఈ రెండు బిఎస్6 మోటార్‌సైకిళ్ళు కూడా హీరో మోటోకార్ప్ యొక్క ‘ఎక్స్' రేంజ్‌లో భాగంగా ఉంటాయి. వీటి రాకతో ఈ లైనప్‌లో మొత్తం ఐదు మోడళ్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఈ సిరీస్‌లో హీరో మోటోకార్ప్ ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200టి, ఎక్స్‌ట్రీమ్ 200ఆర్, ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మరియు కొత్తగా ప్రవేశపెట్టిన ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోడళ్లు ఉన్నాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మరియు హీరో ఎక్స్‌పల్స్ 200 మోటార్‌సైకిళ్లు రెండూ ఇప్పటికే బిఎస్6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. ఇకపోతే హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మరియు హీరో ఎక్స్‌పల్స్ 200టి మరికొద్ది రోజుల్లోనే విడుదల కానున్నాయి. ఇక చివరగా ఈ లైనప్‌లో హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఇంకా బిఎస్6 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావల్సి ఉంటుంది.
MOST READ:కొత్త వాహనాలు కొనాలనుకుంటే ఆగస్ట్ 1 నుంచి కొనండి, ఎందుకంటే

ఈ శ్రేణిలో హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మినహా మిగిలిన అన్ని మోటార్‌సైకిళ్ళు ఒకే రకమైన 200 సిసి ఇంజన్‌తో లభిస్తాయి. ఇందులోని 199 సిసి సింగిల్ సిలిండర్ బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 17.7 బిహెచ్‌పి శక్తిని మరియు 6400 ఆర్‌పిఎమ్ వద్ద 16.45 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఇప్పటి వరకూ మార్కెట్లో లభించిన హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మరియు హీరో ఎక్స్‌పల్స్ 200టి బిఎస్4 వెర్షన్ ధరలు వరుసగా రూ.1.02 లక్షలు మరియు రూ.96,500 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండేవి. అయితే, బిఎస్ 6 అప్‌డేట్ కారణంగా, త్వరలో విడుదల కాబోయే కొత్త మోడళ్ల ధరలు మునపటి ధరల కన్నా సుమారు రూ.5,000 నుండి రూ.10,000 మేర పెరగవచ్చని అంచనా.
MOST READ:భారత్ నుంచి బంగ్లాదేశ్‌కి చేరనున్న 51 టాటా ఏస్ ట్రక్కులు

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మరియు ఎక్స్‌పల్స్ 200టి టీజర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
హీరో మోటోకార్ప్ నుండి భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మరియు ఎక్స్‌పల్స్ 200టి బిఎస్6 మోడళ్లు కూడా ఒకటి. దేశీయ విపణిలో ఈ రెండు మోడళ్లు ఈ విభాగంలోని టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి, బజాజ్ పల్సర్ ఎన్ఎస్200, బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తాయి.