యులులో 57 కోట్లు పెట్టుబడి పెట్టిన బజాజ్, ఎందుకో తెలుసా.. !

భారతదేశపు అతిపెద్ద మోటార్ సైకిల్స్ ఎగుమతిదారు అయిన బజాజ్ ఆటో లిమిటెడ్ కంపెనీ బెంగుళూరుకి చెందిన ఎలిక్ట్రికల్ మొబిలిటీ షేరింగ్ ప్లాట్‌ఫామ్ అయిన యులు లో 8 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది, అంటే సుమారు రూ. 57.27 కోట్లు. బజాజ్ ఆటో కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి ఎందుకు పెట్టింది అనే దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

యులులో 57 కోట్లు పెట్టుబడి పెట్టిన బజాజ్, ఎందుకో తెలుసా.. !

సాధారణంగా యులు అద్దెకు ఎలక్ట్రిక్ సైకిల్స్ అందిస్తుంది. షేర్డ్ మైక్రో-మొబిలిటీ కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ బజాజ్ ఆటో యులు కి అందిస్తుంది. దాదాపు ఇప్పుడు చాల మందికి అద్దేవాహనాలు సరఫరా చేస్తున్న యులు కి ఆర్థికస అవసరాలను సులభతరం చేయడానికి బజాజ్ కూడా తన వంతు కృషి చేస్తుంది. పట్టాన ప్రయాణానికి సులభంగా ఉపయోగపడే సమర్థవంతమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందించడానికి బజాజ్ భాగస్వామిగా మారింది.

యులులో 57 కోట్లు పెట్టుబడి పెట్టిన బజాజ్, ఎందుకో తెలుసా.. !

భవిష్యత్ లో ఈ షేర్డ్ మైక్రో-మొబిలిటీ యొక్క విభాగాన్ని నడపడం వల్ల రెడ్డే తగ్గింపునే కాకుండా కాలుష్య నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. పెద్ద నగరాల్లో మరియు మెట్రో వంటి మాస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ విస్తరణతో పాటు వీటి డిమాండ్ మరింత పెరుగుతుంది.

యులులో 57 కోట్లు పెట్టుబడి పెట్టిన బజాజ్, ఎందుకో తెలుసా.. !

బజాజ్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మాటాడుతూ యులు ప్రారంభించిన చాల తక్కువ సమయంలోనే గొప్ప విజయాన్ని సాధించిందన్నారు. చాలా ప్రాంతాలకు ఈ ఎలక్ట్రిక్ వాహనాల యొక్క సేవలను అందించడానికి నిబద్దత గల యులు తో భాగస్వామ్యం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి అందిస్తామని తెలిపారు.

యులులో 57 కోట్లు పెట్టుబడి పెట్టిన బజాజ్, ఎందుకో తెలుసా.. !

యులు సహా వ్యవస్థాపకుడు మరియు సిఇఓ అమిత్ గుప్తా మాటాడుతూ అధిక సంఖ్యలో అధిక-నాణ్యత గల ఎలక్ట్రిక్ వాహనాల సరఫరాను నిర్ధారించడానికి విజయవంతమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం ద్వారా షేర్డ్ మైక్రో-మొబిలిటీ వ్యాపారంలో విజయం సాధించడం జరుగుతుందని, బజాజ్ ఆటో భారతదేశంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ మరియు ప్రపంచవ్యాప్తంగా దాని నాణ్యత మరియు ఉత్పాదక సామర్థ్యాలకు గౌరవం పొందిందని చెప్పారు.

యులులో 57 కోట్లు పెట్టుబడి పెట్టిన బజాజ్, ఎందుకో తెలుసా.. !

అంతే కాకుండా బజాజ్ ఆటో భాగస్వామ్యం వల్ల మన్నికైన మరియు సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందించగలుగుతాము మరియు వినియోగదారులకు బాగా ఉపయోగపడే విధంగా నమ్మకమైన వాహనాలను తాయారు చేయడం జరుగుతుందన్నారు.

యులులో 57 కోట్లు పెట్టుబడి పెట్టిన బజాజ్, ఎందుకో తెలుసా.. !

మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌ను మరింత బలోపేతం చేయడానికి మరియు వేగంగా విస్తరించడానికి సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి యులులో తాజా రౌండ్ పెట్టుబడి ఉపయోగించబడుతుంది. 2020 డిసెంబర్ నాటికల్ల 100,000 ఎలక్ట్రిక్ వాహనాలకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది.

యులులో 57 కోట్లు పెట్టుబడి పెట్టిన బజాజ్, ఎందుకో తెలుసా.. !

యులు తన సేవలను ఎనిమిది మెగా సిటీలకు విస్తరించడం మరియు స్మార్ట్ సిటీస్ మిషన్ కింద స్మార్ట్ సిటీలను ఎంచుకోవడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి భారతదేశంలో బెంగుళూరు, ఢిల్లీ, పూణే, ముంబై, మరియు భువనేశ్వర వంటి ప్రాంతాలలో యులు సేవలు అందిస్తోంది.

Most Read Articles

English summary
Bajaj Auto Invests ₹ 57 Crore In Electric Mobility Start-Up Yulu. Read in Telugu.
Story first published: Monday, March 9, 2020, 12:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X