టెకో ఎలక్ట్రా సాథి ఎలక్ట్రిక్ మోపెడ్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

పూణేకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టెకో ఎలక్ట్రా భారత మార్కెట్లో 'సాథి' అనే ఎలక్ట్రిక్ మోపెడ్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. పూణేలో దీని ఆన్-రోడ్ ధర రూ.57,697 లుగా ఉంది.

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం, ఈ కంపెనీ వచ్చే సెప్టెంబర్ నాటికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ముందుగా కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు టెకో ఎలక్ట్రా వెబ్‌సైట్‌లో స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.

లాస్ట్-మైల్ కనెక్టివిటీని లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేసిన లో రెంజ్ స్కూటర్ ఇది. దీని వెనుక భాగంలో లగేజ్ రాక్, ముందు భాగంలో లగేజ్ బాస్కెట్ ఉంటుంది. ప్రోడక్ట్ డెలివరీ సర్వీస్‌కు ఈ స్కూటర్ అనువుగా ఉంటుంది.

టెకో ఎలక్ట్రా సాథి ఎలక్ట్రిక్ మోపెడ్ విడుదల

మెరుగైన ప్రాక్టికాలిటీని అందించే ఈ స్కూటర్‌లో ఫ్లాట్-సీటు ఉంటుంది, అది ఒక వ్యక్తికి మాత్రేమ సరిపోతుంది. హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ అన్ని ఎల్‌ఈడి లైట్లతో వస్తాయి. దీనిలో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, స్మార్ట్ రిపేర్ ఫంక్షన్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఛార్జింగ్ విషయానికి వస్తే, సాథి ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే ఛార్జీపై గరిష్టంగా 60 కిలోమీటర్ల రేంజ్‌ని ఆఫర్ చేస్తుంది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లో (బిఎల్‌డిసి) బ్రష్‌లెస్ డిసి హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది, ఇది 48వి 26 ఆంప్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కి.మీ.

ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో ఈ స్కూటర్‌ను సున్నా నుండి 100 శాతం చార్జ్ చేయటానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్‌లో బ్రేక్ రీజనరేషన్ కూడా ఉంటుందని సమాచారం. ఈ ఫీచర్ వలన రైడింగ్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మోపెడ్‌ను చార్జ్ చేయటానికి కేవలం 1.5 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగం అవుతుంది. అంటే 60 కిలోమీటర్ల రైడింగ్‌కు అయ్యే ఖర్చు రూ.12గా ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ 1720 మిమీ పొడవు, 620 మిమీ వెడల్పు మరియు 1050 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. ధృడ నిర్మాణం కోసం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రీన్ఫోర్స్డ్ ఉక్కుతో తయారు చేశారు. బ్యాటరీ లేకుండా ఈ స్కూటర్ బరువు 50 కిలోల కన్నా తక్కువగానే ఉంటుంది.

స్కూటర్‌లోని ఇతర మెకానికల్ పరికరాలను గమనిస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో డ్యూయల్ షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి, ఇవి సిబిఎస్ కాంబి బ్రేక్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా లభించవచ్చని అంచనా. ఇంకా ఇందులో ట్యూబ్ లెస్ టైర్లతో కూడిన 10 ఇంచ్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి

టెకో ఎలక్ట్రా సాథి ఎలక్ట్రిక్ మోపెడ్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టెకో ఎలెక్ట్రా సాథి లో రెంజ్ మోటార్‌సైకిల్ కాబట్టి, ఇది లాస్ట్ మైల్ కెనెక్టివిటికీ, సరదాగా తక్కువ దూరం ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. దీని మెరుగైన ప్రాక్టికాలిటీ కారణంగా ఇది ఫ్లీట్ ఆపరేటర్లకు మరియు డెలివరీ సంస్థలకు సరిపోతుంది. టెకో ఎలెక్ట్రా సాథి ఇటీవలే భారత మార్కెట్లో విడుదలైన జెమోపాయ్ మిసో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా నిలుస్తుంది.

Source: Express Drives

Most Read Articles

English summary
Pune-based electric two-wheeler manufacturer, Techo Electra, launched the Saathi electric moped in the Indian market. The scooter is only available in a single variant and retails for Rs 57,697, on-road, Pune. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X