రాణిపేట్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ కొత్త ప్లాంట్ కోసం రూ.700 కోట్ల పెట్టుబడులు

గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉన్న ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఆంపియర్ ఎలక్ట్రిక్, తమ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి విస్తృతంగా పెట్టుబడులను వెచ్చింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం రానున్న పదేళ్లలో 700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

రాణిపేట్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ కొత్త ప్లాంట్ కోసం రూ.700 కోట్ల పెట్టుబడులు

తమ భవిష్యత్ ప్రణాళికలలో భాగంగా, తమిళనాడులోని రాణిపేటలో ఓ ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్న ఆంపియర్ ఎలక్ట్రిక్ ఒక నివేదికలో తెలిపింది. సుమారు 10.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఆంపియర్ ఎలక్ట్రిక్ తయారీ యూనిట్ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కర్మాగార జాబితాలో చేరనుంది.

రాణిపేట్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ కొత్త ప్లాంట్ కోసం రూ.700 కోట్ల పెట్టుబడులు

ఈ కొత్త ప్లాంట్‌ను 2021 లోనే ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. ప్రారంభంలో ఈ ప్లాంటులో 1,00,000 ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉంటుంది, అవసరమైన ఈ సామర్థ్యాన్ని సంవత్సరానికి 10 లక్షల యూనిట్లకు పెంచవచ్చని కంపెనీ పేర్కొంది.

MOST READ:శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే

రాణిపేట్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ కొత్త ప్లాంట్ కోసం రూ.700 కోట్ల పెట్టుబడులు

అత్యాధునిక సాంకేతికతతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని ఆంపియర్ వివరించింది. ఈ ప్రకటనతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చాలని కంపెనీ తెలిపింది.

రాణిపేట్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ కొత్త ప్లాంట్ కోసం రూ.700 కోట్ల పెట్టుబడులు

దేశవాసులకు పునరుత్పాదక శక్తితో పనిచేసే వాహనాలను అందించడానికి తమ కంపెనీ కట్టుబడి ఉందని ఆంపియర్ ఎలక్ట్రిక్ తెలిపింది. కంపెనీ ఇటీవలే దేశంలో తమ 300వ డీలర్‌షిప్‌ను మహారాష్ట్రలో ప్రారంభించింది.

MOST READ:రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

రాణిపేట్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ కొత్త ప్లాంట్ కోసం రూ.700 కోట్ల పెట్టుబడులు

ఆంపియర్ ఎలక్ట్రిక్ తమ బిజినెస్ టు బిజినెస్ మోడల్ క్రింద డెలివరీ భాగస్వాములు మరియు రైడ్-షేరింగ్ కంపెనీలకు పెర్ఫార్మెన్స్ స్కూటర్లను అందిస్తోంది. అలాగే వ్యక్తిగత కస్టమర్ల నుండి కూడా ఆంపియర్ స్కూటర్లకు మంచి డిమాండ్ లభిస్తోంది.

రాణిపేట్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ కొత్త ప్లాంట్ కోసం రూ.700 కోట్ల పెట్టుబడులు

ప్రస్తుతం, వ్యక్తిగత వాహనాల విభాగంలో కూడా ఎలక్ట్రిక్ టూవీలర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇంధనంతో నడిచే వాహనాలకు మంచి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆఫీసు లేదా కాలేజీకి వెళ్లేవారు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు.

MOST READ:భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

రాణిపేట్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ కొత్త ప్లాంట్ కోసం రూ.700 కోట్ల పెట్టుబడులు

మరోవైపు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేమ్ -2 విధానం అమ్మకాలను పెంచడానికి కంపెనీలకు సహాయపడుతోంది.

రాణిపేట్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ కొత్త ప్లాంట్ కోసం రూ.700 కోట్ల పెట్టుబడులు

ఆంపియర్ ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో 20 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ సంస్థ ఇప్పటివరకు 75,000 మందికి పైగా కొత్త కస్టమర్లను దక్కించుకుంది. ఈ బ్రాండ్ నుండి రియో, మాగ్నస్, జిల్, వి48తో పాటుగా మరికొన్ని ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.

MOST READ:ఇకపై వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఏమవుతుందో తెలుసా ?

రాణిపేట్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ కొత్త ప్లాంట్ కోసం రూ.700 కోట్ల పెట్టుబడులు

ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో పెర్ఫార్మెన్స్ స్కూటర్లు అలాగే సరసమైన ధరకే లభించే బడ్జెట్ స్కూటర్లు కూడా ఉన్నాయి. స్లో-స్పీడ్ స్కూటర్ అయిన ఆంపియర్ మాగ్నస్ 60ని కంపెనీ కేవలం రూ.49,999 (ఎక్స్-షోరూమ్) ధరకే అందుబాటులోకి తెచ్చింది. ఆంపియర్ జెల్ ఎక్స్ మరియు రియో ​​ప్లస్ స్కూటర్ పెర్ఫార్మెన్స్ రేంజ్‌లో లభిస్తాయి.

రాణిపేట్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ కొత్త ప్లాంట్ కోసం రూ.700 కోట్ల పెట్టుబడులు

ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో యూఎస్‌బి మొబైల్ ఛార్జింగ్, ఇగ్నిషన్ స్టార్ట్ బటన్, ట్యూబ్ లెస్ టైర్లు, ఎల్‌ఈడి లైట్లు అధునాతన ఫీచర్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల కోసం కంపెనీ మరింత మెరుగైన ఫీచర్లతో కూడిన వి8 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా అందిస్తోంది.

Most Read Articles

English summary
Ampere Electric Plans To Invest Rs 700 Cr To Setup A Manufacturing Plant In Ranipet. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X