కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు

భారత మార్కెట్లో బజాజ్ ఆటో ఎబిఎస్ టెక్నాలజీతో కూడిన తన కొత్త ప్లాటినా 110 ను విడుదల చేసింది. కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ మోడల్ ధర ఇప్పుడు 65,920 రూపాయలతో (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) లభిస్తుంది. కొత్త ప్లాటినా 110 ఇప్పుడు ఎబిఎస్‌తో స్టాండర్డ్ గా అందించే ఏకైక మోడల్.

కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు

కొత్త బజాజ్ ప్లాటినా 110 ప్యాసింజెర్ మోటార్ సైకిల్ ఇప్పుడు దాని ముందు భాగంలో 240 మిమీ డిస్క్‌తో వస్తుంది. దీనికి సింగిల్-ఛానల్ ఎబిఎస్ సపోర్ట్ ఇస్తుంది. ఎబిఎస్ టెక్నాలజీతో పాటు, మోటారుసైకిల్ ఇప్పుడు కంఫర్టెక్ ప్యాకేజీతో కూడా వచ్చింది. ఇందులో క్విల్టెడ్ సీట్లు, స్ప్రింగ్-ఆన్-స్ప్రింగ్ సస్పెన్షన్ సెటప్, ట్యూబ్‌లెస్ టైర్లు, డిఆర్‌ఎల్‌లతో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, న్యూ మిర్రర్స్ మరియు హ్యాండ్‌గార్డ్‌ ఉన్నాయి.

కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు

2021 బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ అదే 115 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8.4 బిహెచ్‌పి మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 9.81 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ మూడు కలర్ ఆప్సన్స్ తో లభిస్తుంది. అవి చార్‌కోల్ బ్లాక్, వోల్కనిక్ రెడ్ మరియు బీచ్ బ్లూ కలర్స్.

MOST READ:కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్

కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు

ఈ మోటార్ సైకిల్ విభాగంలో ఎబిఎస్ టెక్నాలజీని అందుకున్న మొట్ట మొదటి బైక్ ఈ బజాజ్ ప్లాటినా 110. భారతదేశం యొక్క వాహన భద్రతా నిబంధనలలో భాగంగా, 125 సిసి లేదా అంతకంటే ఎక్కువ ఇంజిన్ కలిగిన అన్ని ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా ఎబిఎస్‌ను కలిగి ఉండాలి. అయితే 110 సిసి మోటార్‌సైకిల్‌పై ఈ సేఫ్టీ టెక్‌ను చేర్చడం అనే కొత్త మార్పు.

కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు

బజాజ్ ఇటీవలే తన ప్లాటినా 100 మోడల్‌ను ఎలక్ట్రిక్-స్టార్ట్ తో పాటు అప్‌డేట్ చేసింది. కొత్త బజాజ్ ప్లాటినా 100 ఇఎస్ ధర రూ. 53,920, (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ). ఇది దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ప్లాటినా 100 కూడా ఎలక్ట్రిక్-స్టార్ట్ టెక్నాలజీని కలిగి ఉన్న ఏకైక మోటారుసైకిల్. ఈ విభాగంలో దాని ప్రత్యర్థులందరూ ఇప్పటికీ కిక్ స్టార్ట్‌ ఆప్సన్ మాత్రమే అందిస్తున్నారు.

MOST READ:మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!

కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు

భారత మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ కంపెనీ యొక్క అమ్మకాలను మెరుగుపరచడానికి చాలా సహాయపడే అవకాశం ఉంది. ఇది మంచి డిజైన్ కలిగి ఉండటంతో పాటు వాహనదారునికి మంచి రైడింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది.

కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు

బజాజ్ ప్లాటినా 110 ఇప్పుడు ఎబిఎస్‌ను ప్రామాణికంగా అందించబడుతున్న భారతదేశంలో అత్యంత సరసమైన ద్విచక్ర వాహనాల్లో ఒకటి. ప్లాటినా 110 ఎబిఎస్ ఈ విభాగంలో హీరో స్ప్లెండర్ మరియు టివిఎస్ రేడియన్ వంటి వాటికి ప్రత్యర్థిగా కొనసాగుతోంది. ఏది ఏమైనా ఈ కొత్త ఫీచర్స్ ఈ విభాగంలో చాలా ఉపయోగపడుతుంది.

MOST READ:బుల్లెట్ ప్రూఫ్ కార్లకు రూ. 6.75 కోట్లు మంజూరు చేసిన జగన్ సర్కార్.. ఈ కార్లు వారికి మాత్రమే

Most Read Articles

English summary
New Bajaj Platina 110 ABS Model Launched In India. Read in Telugu.
Story first published: Friday, March 5, 2021, 15:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X