భారత్‌లో 24,500 రూపాయలకే కొత్త ఈ-సైకిల్ విడుదల; పూర్తి వివరాలు

భారతదేశంలో రోజురోజుకి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ కారణంగా ఎక్కువమంది వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. కావున మార్కెట్లో కూడా వాహనదారుల అవసరాలకు అనుకూలంగా చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇటీవల కాలంలో లెక్కకుమించిన ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో విడుదలయ్యాయి.

భారత్‌లో 24,500 రూపాయలకే కొత్త ఈ-సైకిల్ విడుదల; పూర్తి వివరాలు

మార్కెట్లో ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు మరియు కార్లకు మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ సైకిళ్లకు కూడా డిమాండ్ ఉంది. ఈ తరుణంలో ఫెలిడే ఎలక్ట్రిక్ కొత్త ఈ-సైకిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం..

భారత్‌లో 24,500 రూపాయలకే కొత్త ఈ-సైకిల్ విడుదల; పూర్తి వివరాలు

కంపెనీ తన కొత్త ఫెలిడే-అసిస్ట్ ఈ-బైక్‌ను కేవలం రూ. 24,500 ధరకు విడుదల చేసింది. ఈ ఈ-సైకిల్‌కు కంపెనీ ‘మావెన్' అని నామకరణం చేసింది. ఈ ఈ-సైకిల్‌లో, కంపెనీ 250 డబ్ల్యు / 32 ఎన్ఎమ్ BLDC హబ్ మోటారును ఉపయోగించింది. ఈ సైకిల్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు.

MOST READ:కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

భారత్‌లో 24,500 రూపాయలకే కొత్త ఈ-సైకిల్ విడుదల; పూర్తి వివరాలు

ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌లో 5 లెవెల్స్ ఎలక్ట్రిక్ లెవెల్స్ ఇవ్వబడుతుంది. ఈ కొత్త సైకిల్ 36 వి, 7.8 ఎహెచ్ ఎల్ఐ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ 35 నుంచి 50 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ సైకిల్ ఒకసారి పూర్తి ఛార్జింగ్ చేసుకోవడానికి దాదాపు మూడున్నర గంటల సమయం పడుతుంది.

భారత్‌లో 24,500 రూపాయలకే కొత్త ఈ-సైకిల్ విడుదల; పూర్తి వివరాలు

కొత్త ఫీలడే ఈ-బైక్‌లో 19 ఇంచెస్ క్రోమోలీ స్టీల్ ఫ్రేమ్ మరియు 27.5 ఇంచెస్ అల్యూమినియం వీల్ ఉన్నాయి. ఈ సైకిల్ బరువు కేవలం 21 కేజీలు మాత్రమే. కావున ఇది వినియోగదానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది ఎలాంటి రహదారిలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

MOST READ:కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

భారత్‌లో 24,500 రూపాయలకే కొత్త ఈ-సైకిల్ విడుదల; పూర్తి వివరాలు

ఈ కొత్త ఈ-సైకిల్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ కలిగి ఉంది. దీనితో పాటు అదనపు భద్రత కోసం ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు అందించబడ్డాయి. అయితే ఈ సైకిల్ యొక్క వెనుక భాగంలో సస్పెన్షన్ సెటప్ ఇవ్వలేదు.

భారత్‌లో 24,500 రూపాయలకే కొత్త ఈ-సైకిల్ విడుదల; పూర్తి వివరాలు

బ్యాటరీ యొక్క లైఫ్ టైమ్ మరియు అసిస్ట్ లెవెల్స్ గురించి తెలియజేయడానికి ఫెలిడే ఒక ఎల్ఇడి ఇండికేటర్ అందించింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో ఉన్న మోటరుకి 2 సంవత్సరాల వారంటీ ఇవ్వబడింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ సైకిల్స్ కి 1 సంవత్సరం వారంటీ ఉంటుంది.

MOST READ:కరోనా ఎఫెక్ట్; అంబులెన్సులుగా మారిన పోలీస్ వాహనాలు

భారత్‌లో 24,500 రూపాయలకే కొత్త ఈ-సైకిల్ విడుదల; పూర్తి వివరాలు

మారుతున్న ప్రజల జీవనశైలికి అనుకూలంగా ఎక్కువమంది ఆరోగ్యం మీద దృష్టి సారిస్తున్నారు. కావున చాలా మంది ఫిట్‌నెస్ కోసం ఇ-బైక్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇంతే కాకుండా ఇప్పుడు నగరంలో వాహనం మీద వెళ్లాలంటే లైసెన్స్, ఆర్సీ వంటివి అవసరం కానీ ఈ బైకులకు ఇలాంటివి అవసరం లేదు. కావున ఎవరైనా ఈ సైకిల్స్ ఉపయోగించుకోవచ్చు.

భారత్‌లో 24,500 రూపాయలకే కొత్త ఈ-సైకిల్ విడుదల; పూర్తి వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో ఈ సైకిల్స్ అతి తక్కువ ధరల వద్ద కూడా లభ్యమవుతాయి. వీటికి ఇంధనం ఏ మాత్రం అవసరం లేదు. ఇంధనం ఉపయోగించకపోవడం ప్రస్తుతం చాలా అవసరం, కేవలం పెరుగుతున్న ధరల కారణంగా మాత్రమే కాదు, పర్యావరణ అనుకూలంగా ఉండటానికి ఈ ఎలక్ట్రిక్ వాహనాలు చాలా అవసరం.

MOST READ:ట్రక్కు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం ఇదే.. మీకు తెలుసా?

భారత్‌లో 24,500 రూపాయలకే కొత్త ఈ-సైకిల్ విడుదల; పూర్తి వివరాలు

ప్రస్తుతం కేంద్ర ,మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయమని సిఫార్సు చేస్తున్నారు. అంతే కాదు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుచేసి కస్టమర్లకు భారీ డిస్కౌంట్స్ కూడా అందిస్తున్నారు. ఈ కారణంగా ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.

Most Read Articles

English summary
Felidae Maven Electric Cycle Launched At Rs 24,500 Features Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X