అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

భారతదేశపు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించేందుకు ఓలా ఎలక్ట్రిక్ సంస్థ సిద్ధమవుతోంది. ఆటోమోటిక్ క్యాబ్ సేవల రంగం ద్వారా యావత్ భారతదేశపు ఉనికిని చాటుకున్న ఓలా ఇప్పుడు తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌తో దేశంలో సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది.

అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఓలా తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కోసం తమిళనాడులో ఓ స్కూటర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో తయారు కానున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ అని కంపెనీ చెబుతోంది.

అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

మరికొద్ది నెలల్లోనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. తక్కువ ధర, క్లాసిక్ డిజైన్, లాంగ్ రేంజ్, లేటెస్ట్ టెక్నాలజీ మరియు భారీ ఉత్పాదక సామర్థ్యం వంటి అనేక విశిష్టమైన ఫీచర్లతో ఓలా విడుదల చేయబోయే ఈ ఉత్పత్తి భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో భారీ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

MOST READ:కొచ్చిలో కొత్త డీలర్‌షిప్‌ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ; వివరాలు

అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఓలా తమ కొత్త ప్లాంట్ గురించి, ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి విడుజల చేస్తున్న వీడియోలు ఒత్సాహికుల్లో కొత్త ఆసక్తిని మరియు ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై అంచనాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి.

అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

గడచిన సంవత్సరంలో నెథర్లాండ్స్‌కి చెందిన ఎటెర్గో అనే సంస్థను ఓలా కొనుగోలు చేసింది. ఎటెర్గో గతంలో అంతర్జాతీయ మార్కెట్ల కోసం తయారు చేసిన 'యాప్‌స్కూటర్' ఆధారంగానే ఓలా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత్ కోసం తయారు చేస్తోంది.

MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?

అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

అయితే, ఓలా ఈ ఎటెర్గో యాప్ స్కూటర్‌ను భారత వాతావరణం మరియు రహదారి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసింది. ఓలా బ్యాడ్జ్‌తో రానున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కంపెనీ వ్యవస్థాపకుడు పవిష్ అగర్వాల్ కొన్ని ముఖ్యమైన విషయాలను మనీకంట్రోల్ సైట్‌తో పంచుకున్నారు.

అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఆయన తెలిపిన వివరాల ప్రకారం, హోసూర్‌లోని ఓలా ఎలక్ట్రిక్ ప్లాంట్ సంవత్సరానికి 10 మిలియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, అక్కడ ఏర్పాటు చేయబోయే 10 ప్రొడక్షన్ లైన్స్ నుండి ప్రతి 2 సెకన్లకు 1 స్కూటర్ చొప్పున ఉత్పత్తి చేయవచ్చు.

MOST READ:బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఈ ప్లాంట్ కోసం ఓలా సంస్థ రూ.2,400 కోట్ల పెట్టుబడిని వెచ్చిస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా 10,000 మందికి ఉపాధి లభించనుంది. వచ్చే ఏడాది నాటికి ఈ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి చేసి, ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించాలని ఓలా ప్లాన్ చేస్తోంది. ప్రపంచంలో మొత్తంలో ఉత్పత్తయ్యే ఎలక్ట్రిక్ టూవీలర్లతో పోల్చుకుంటే, 15 శాతం ఉత్పత్తి తమ ప్లాంట్ నుండే వస్తుందని ఆయన చెప్పారు.

అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

భారతదేశంలో ప్రస్తుతం ప్రతి 1,000 మందిలో 160 మందికి మాత్రమే ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, కానీ వియత్నాం వంటి ఇతర దేశాల్లో సగటున ప్రతి 1,000 మందికి 600 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని అగర్వాల్ చెప్పుకొచ్చారు. మనదేశంలో కూడా సరైన ఉత్పత్తిని సరసమైన ధరతో అందిస్తే, ఇది సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.

MOST READ:చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ఎంజి సెంటర్ సభ్యులు చేయూత

అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఓలా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని పూర్తిగా 100 శాతం స్థానికీకరించడం (లోకలైజ్) ద్వారా దీని ధరను అందరికీ అందుబాటులో ఉంచాలని భావిస్తోంది. ఇందుకోసం కంపెనీ బ్యాటరీలను మరియు ఎలక్ట్రిక్ మోటార్లను స్వతహాగా తయారు చేయనుంది. ఈ స్కూటర్ తయారీలో అవసరమయ్యే సాంకేతికతలు మరియు సాఫ్ట్‌వేర్‌లను కూడా కంపెనీయే స్వయంగా అభివృద్ధి చేయాలనుకుంటోంది.

అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

తమ ఎలక్ట్రిక్ ఉత్పత్తుల విషయంలో ఇతరులపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించాలని కంపెనీ భావిస్తోంది. ఇలా చేయటం వలన ఉత్తమమైన ఉత్పత్తులను, సరసమైన ధరలకే అందించే అవకాశం ఉంటుంది. ఇదివరకు చెప్పుకున్నట్లుగా, ఓలా ఈ ఎటెర్గో యాప్‌స్కూటర్‌ను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా కస్టమైజ్ చేసింది.

అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఇందులోని ప్రతి స్కూటర్‌లో రెండు బ్యాటరీలు ఉంటాయని సమాచారం. ఒక్కొక్క బ్యాటరీ బరువు సుమారు 10.5 కేజీల నుండి 11 కేజీల మధ్యలో ఉంటుంది. ఈ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయటానికి కేవలం గంట వ్యవధి మాత్రమే పడుతుందని సమాచారం. ఇంట్లో ఉండే సాధారణ పవర్ సాకెట్ ద్వారా దీనిని ఛార్జ్ చేసుకోవచ్చు.

అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఒక్క బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు సుమారు 100 కిలోలు ఉంటుంది. ఈ స్కూటర్ సీటు క్రింది భాగంలో ఉండే బూట్ స్పేస్‌లో రెండు హెల్మెట్లను భద్రపరచుకోవచ్చు. ఈ స్కూటర్‌లోని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అనేక అధునాతన టెక్నాలజీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఇందులో బిల్ట్ ఇన్ సిమ్‌కార్డ్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీని సాయంతో రైడర్ స్కూటర్ నుండే ఫోన్ కాల్స్ చేయటం, జిపిఎస్ మరియు ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయటం చేయవచ్చు. ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ సాయంతోయ సంగీతాన్ని కంట్రోల్ చేయవచ్చు మరియు సేఫ్టీ ఫీచర్లను కూడా యాక్టివేట్ చేయవచ్చు.

అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సంబంధించిన గణాంకాలపై ఇంకా పూర్తి స్పష్టత లేనప్పటికీ, ఇందులోని పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీపై సుమారు 100 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుందని అంచనా. దీని గరిష్ట వేగం గంటకు 100 కి.మీ వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దీని ధర కూడా లక్ష రూపాయల కన్నా తక్కువగానే ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Few Important Things To Note About Ola Electric Scooter, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X