టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?

దేశంలో పర్యావరణ సాన్నిహిత్యమైన రవాణా వ్యవస్థను రూపొందించేందుకు భారత ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఫేమ్ పథకాలను ప్రవేశపెట్టడం, బిఎస్6 ఉద్గార నిబంధనలను అమలు చేయటం వంటి ప్రణాళికలను విజయవంతంగా చేపట్టిన భారత ప్రభుత్వం ఇప్పుడు ద్విచక్ర వాహనాలకు గ్రీన్ వెహికల్ రేటింగ్ (జివిఆర్)ను ప్రవేశపెట్టింది.

టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?

రానున్న కొన్ని నెలల్లో భారత ఆటో పరిశ్రమ బిఎస్6 ఉద్గార నిబంధనల కన్నా కఠినమైన కెఫే (CAFE - కార్పోరేట్ యావరేజ్ ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ/ఎకోనమీ) నిబంధలకు మారబోతోంది. దీనికి సంబంధించి, అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ (AEEE) వినియోగదారుల సమాచార సాధనాన్ని రూపొందించింది మరియు ఇది వాహనానికి దాని పర్యావరణ పనితీరు ఆధారంగా రేటింగ్‌ను ఇస్తుంది.

టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?

ఎనర్జీ ఎఫీషియెన్సీ అనేది ఒక వనరుగా, దానికి సంబంధించిన అవగాహనను కల్పించడంలో పనిచేసే ప్రమఖ సంస్థే ఈ ఏఈఈఈ. అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ (ఏఈఈఈ) ఇచ్చే ఈ రేటింగ్‌నే గ్రీన్ వెహికల్ రేటింగ్ (గ్రీన్ వెహికల్ రేటింగ్) అంటారు.

MOST READ:చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?

గ్రీన్‌హౌస్ వాయువులు మరియు కాలుష్య కారకాల ఉద్గారాల ద్వారా సృష్టించబడిన ప్రతికూల ప్రభావాల పరంగా తక్కువ పనితీరు గల వాహనాలను గుర్తించే భారతదేశం యొక్క మొదటి మరియు ప్రస్తుతం ఉన్న ఏకైక సాధనమే ఈ గ్రీన్ వెహికల్ రేటింగ్ (జివిఆర్).

టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?

ఈ జివిఆర్ సాధనం వినియోగదారులకు వాహనాల యొక్క కాలుష్య స్థాయిల గురించి అవగాహన కల్పించడం లోనూ మరియు సదరు వాహనాలు సమాజం, పర్యావరణ ఆరోగ్యంపై ఎంత మేర దుష్పప్రభావాన్ని చూపుతాయో లెక్కించడం లోనూ కొనుగోలుదారులకు సహాయపడుతుంది.

MOST READ:కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి

టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?

ప్రస్తుతం, ఈ జివిఆర్ సాధనం ద్విచక్ర మరియు మూడు చక్రాల వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది భారతదేశంలో వినియోగదారులను పెద్ద సంఖ్యలో గ్రీనర్ మొబిలిటీ (స్వచ్ఛమైన వాహనాల) వైపుకు మార్చడంలో సహాయపడుతుంది.

టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?

కొనుగోలుదారులు అధిక పనితీరు గల వాహనాలను గుర్తించడానికి మరియు వెబ్ ఆధారిత రేటింగ్ సిస్టమ్ ఆధారంగా సమాచారం తెలుసుకోవటానికి మరియు తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ జివిఆర్ సాధనం సహాయపడుతుంది.

MOST READ:కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?

అమెరికన్ కౌన్సిల్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ సహకారంతో శక్తి ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి నిధులు సమకూరుస్తుంది. వాహనం యొక్క పర్యావరణ పనితీరును లెక్కించడానికి, జివిఆర్ 2017లో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సూచించిన ఫామ్ 22 లేదా రోడ్ వర్తీనెస్ సర్టిఫికేట్‌ను ఉపయోగిస్తుంది.

టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?

ఫామ్ 22 లో లభించే డేటా ఆధారంగా, ఆటో డీలర్లు మరియు ఆన్‌లైన్ ఆటో మార్కెట్ ప్రదేశాల ద్వారా నివేదించబడిన కాలుష్య ఉద్గార డేటా మరియు ఇంధన సామర్థ్య డేటాకు జివిఆర్ మిశ్రమ విధానాన్ని తీసుకుంటుంది.

MOST READ:భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?

ఈ విషయం గురించి ఏఈఈఈ ప్రెసిడెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. గ్రీన్ వెహికల్ రేటింగ్ (జివిఆర్) ఫామ్ 22 లోని స్వయంగా నివేదించహడిన వాహనాల ఉద్గారాల డేటాను తీసుకుని, రోడ్డుపై సదరు వాహనం యొక్క నిజమైన ప్రభావాన్ని అర్థం చేసుకోవడం సులభతరం చేస్తుంది.

టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?

జివిఆర్ వెబ్‌సైట్ (www.aeee.in) కొనుగోలుదారులను వేర్వేరు మోడళ్లను పోల్చడానికి, యాజమాన్యం యొక్క నిజమైన ధర, ఉద్గార స్థాయిలు, నష్టం యొక్క వ్యయాన్ని అంచనా వేయడానికి, ఖర్చు, ఇంజన్ సామర్థ్యం, పవర్ అవుట్‌పుట్, మైలేజ్ మొదలైన అంశాలను అంచనా వేయడానికి అనుమతిస్తుంది. ఈ ఖర్చులు వినియోగదారులకు ప్రభావాన్ని కాన్ఫిగర్ చేయడంలో సహాయపడటానికి కిలోమీటరుకు రూపాయిలలో సూచించబడతాయి.

Most Read Articles

English summary
Green Vehicle Rating Announced For Two Wheelers And Three Wheelers Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X