హీరో మోటోకార్ప్ సర్వీస్ అండ్ ఎక్సేంజ్ కార్నివాల్ - డిస్కౌంట్స్

భారతదేశపు అగ్రగామి టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, తమ కస్టమర్ల కోసం నాలుగు రోజుల పాటు ప్రత్యేకమైన సర్వీస్ మరియు ఎక్సేంజ్ కార్నివాల్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

హీరో మోటోకార్ప్ సర్వీస్ అండ్ ఎక్సేంజ్ కార్నివాల్ - డిస్కౌంట్స్

ఈ ఏడాది ప్రారంభంలో హీరో మోటోకార్ప్ 100 మిలియన్ల అమ్మకాల మైలురాయిని సాధించింది. ఈ అమ్మకాల మైలురాయి వేడుకల్లో భాగంగా, కంపెనీ తమ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఎక్సేంజ్ మరియు మరియు సర్వీస్ ప్రయోజనాలను ప్రకటించింది.

హీరో మోటోకార్ప్ సర్వీస్ అండ్ ఎక్సేంజ్ కార్నివాల్ - డిస్కౌంట్స్

హీరో మోటోకార్ప్ సర్వీస్ మరియు ఎక్సేంజ్ కార్నివాల్ మార్చి 5 నుండి ప్రారంభమై మార్చి 8 వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

MOST READ:ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరూ చూడండి

హీరో మోటోకార్ప్ సర్వీస్ అండ్ ఎక్సేంజ్ కార్నివాల్ - డిస్కౌంట్స్

ఈ కార్నివాల్‌లో భాగంగా, హీరో మోటోకార్ప్ అందిస్తున్న ఆఫర్లు మరియు ప్రయోజనాలలో రూ.100 ప్లస్ జిఎస్‌టికే పెయిడ్ సర్వీస్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ కొనుగోలుపై రూ.100 తగ్గింపు మరియు జాయ్‌రైడ్ (యాన్యువల్ మెయింటినెన్స్ కాంట్రాక్ట్) కొనుగోలుపై రూ.100 తగ్గింపులను అందిస్తోంది.

హీరో మోటోకార్ప్ సర్వీస్ అండ్ ఎక్సేంజ్ కార్నివాల్ - డిస్కౌంట్స్

అంతేకాకుండా, ఈ సర్వీస్ క్యాంప్‌కు తీసుకువచ్చే హీరో మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్లన్నంటికీ కంపెనీ ఉచిత వాషింగ్, పాలిషింగ్ మరియు నైట్రోజెన్ ఫిల్లింగ్ సేవలను కూడా అందిస్తోంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ సర్వీస్ అండ్ ఎక్సేంజ్ కార్నివాల్‌లో కంపెనీ తమ వినియోగదారులకు వివిధ రకాల ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నట్లు పేర్కొంది.

MOST READ:మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

హీరో మోటోకార్ప్ సర్వీస్ అండ్ ఎక్సేంజ్ కార్నివాల్ - డిస్కౌంట్స్

ఈ కార్నివాల్ యొక్క చివరి రోజున (మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం), హీరో మోటోకార్ప్ తమ స్కూటర్ లైనప్‌పై ప్రత్యేకమైన ఎక్సేంజ్ బోనస్ మరియు పర్చేస్ బోనస్‌లను కూడా ఆఫర్ చేయనున్నట్లు ప్రకటించింది.

హీరో మోటోకార్ప్ సర్వీస్ అండ్ ఎక్సేంజ్ కార్నివాల్ - డిస్కౌంట్స్

ఇదిలా ఉంటే, హీరో మోటోకార్ప్ తమ స్ప్లెండర్ బైక్ లైనప్‌పై డిస్కౌంట్స్ మరియు ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ విక్రయిస్తున్న స్ప్లెండర్ ప్లస్, సూపర్ స్ప్లెండర్ మరియు స్ప్లెండర్ ఐ స్మార్ట్ మోడళ్లపై రూ.14,000 తగ్గింపును అందిస్తోంది.

MOST READ:విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

హీరో మోటోకార్ప్ సర్వీస్ అండ్ ఎక్సేంజ్ కార్నివాల్ - డిస్కౌంట్స్

మార్కెట్ సమాచారం ప్రకారం, ఎంపిక చేసిన బ్యాంకుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ఈఎమ్ఐ స్కీమ్ క్రింద కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.12,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తున్నట్లు సమాచారం.

హీరో మోటోకార్ప్ సర్వీస్ అండ్ ఎక్సేంజ్ కార్నివాల్ - డిస్కౌంట్స్

ఇవే కాకుండా, పాత బైకుల మార్పిడిపై ఎక్స్ఛేంజ్ మరియు లాయల్టీ బోనస్‌గా కంపెనీ అదనంగా రూ.2,000 తగ్గింపును కూడా అందిస్తోంది. హీరో స్ప్లెండర్, స్ప్లెండర్ ప్లస్ మరియు స్ప్లెండర్ ఐస్‌మార్ట్‌లోని అన్ని వేరియంట్లపై ఈ డిస్కౌంట్లు మరియు ఆఫర్‌లు వర్తిస్తాయి. ఈ ఆఫర్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం మీ సమీపంలోని హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు.

MOST READ:ట్రాఫిక్ ఫైన్ అడిగితే మంగళ సూత్రం ఇచ్చిన మహిళ.. ఇది ఎక్కడో కాదు, మన బెంగళూరులోనే

హీరో మోటోకార్ప్ సర్వీస్ అండ్ ఎక్సేంజ్ కార్నివాల్ - డిస్కౌంట్స్

హీరో మోటోకార్ప్ గడచిన ఫిబ్రవరి 2021 నెలలో తన అమ్మకాల గణాంకాలను వెల్లడించింది. గత నెలలో కంపెనీ మొత్తం 505,467 యూనిట్ల మోటార్‌సైకిళ్ళు మరియు స్కూటర్లను విక్రయించింది. హీరో మోటోకార్ప్ తన భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి కూడా ప్రవేశించాలని ప్లాన్ చేస్తోంది.

Most Read Articles

English summary
Hero MotoCorp Announces A Four Day Service And Exchange Carnival, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X