హీరో డెస్టినీ, మ్యాస్ట్రో ఎడ్జ్ స్కూటర్లలో స్పెషల్ ఎడిషన్స్ విడుదల; వివరాలు

భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్, తమ సంస్థను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ 100 మిలియన్లకు పైగా ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కంపెనీ తమ టూవీలర్లలో 100 మిలియన్ ఎడిషన్ పేరిట స్పెషల్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేస్తోంది.

హీరో డెస్టినీ, మ్యాస్ట్రో ఎడ్జ్ స్కూటర్లలో స్పెషల్ ఎడిషన్స్ విడుదల; వివరాలు

తాజాగా, కంపెనీ విక్రయిస్తున్న హీరో డెస్టినీ 125 మరియు హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 110 స్కూటర్లలో కంపెనీ 100 మిలియన్ ఎడిషన్లను ప్రవేశపెట్టింది. స్టాండర్డ్ మోడళ్లతో పోల్చుకుంటే, ఈ స్పెషల్ ఎడిషన్లు ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్‌ను కలిగి ఉంటాయి. హీరో మోటోకార్ప్ అందిస్తున్న మాస్ట్రో ఎడ్జ్ 125సిసి వేరియంట్‌లో మాత్రం కంపెనీ 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టలేదు.

హీరో డెస్టినీ, మ్యాస్ట్రో ఎడ్జ్ స్కూటర్లలో స్పెషల్ ఎడిషన్స్ విడుదల; వివరాలు

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 స్కూటర్ యొక్క 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్‌‌ను వైట్ అండ్ రెడ్ బాడీ గ్రాఫిక్స్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇది స్టాండర్డ్ మోడల్ కన్నా మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.65,250గా ఉంటుంది.

MOST READ:బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

హీరో డెస్టినీ, మ్యాస్ట్రో ఎడ్జ్ స్కూటర్లలో స్పెషల్ ఎడిషన్స్ విడుదల; వివరాలు

హీరో డెస్టీని 125 స్కూటర్ యొక్క 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్‌ను రూ.72,250 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేశారు. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్‌లో కొత్త పెయింట్ స్కీమ్ మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు.

హీరో డెస్టినీ, మ్యాస్ట్రో ఎడ్జ్ స్కూటర్లలో స్పెషల్ ఎడిషన్స్ విడుదల; వివరాలు

ఈ రెండు స్పెషల్ ఎడిషన్లలో చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా పెద్దగా చెప్పుకోదగిన మార్పులు లేవు. ఇవి రెండు స్టాండర్డ్ మోడళ్ల మాదిరిగానే ఉంటాయి. ఇంజన్ మరియు ఫీచర్ల పరంగా కూడా ఈ రెండు స్కూటర్లలో ఎలాంటి మార్పులు లేవు.

MOST READ:పార్కింగ్ సమయంలో కంట్రోల్ తప్పిన పోర్స్చే మాకాన్ ; తృటిలో తప్పిన ప్రమాదం

హీరో డెస్టినీ, మ్యాస్ట్రో ఎడ్జ్ స్కూటర్లలో స్పెషల్ ఎడిషన్స్ విడుదల; వివరాలు

హీరో డెస్టిని 125 స్కూటర్‌లో 124.6సిసి ఇంజన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పి శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హీరో డెస్టినీ, మ్యాస్ట్రో ఎడ్జ్ స్కూటర్లలో స్పెషల్ ఎడిషన్స్ విడుదల; వివరాలు

ఇకపోతే, హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 స్కూటర్‌లో 110.9సిసి, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 8.04 బిహెచ్‌పి శక్తిని, 5,750 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:ఇకపై ఈ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ నిషేధం.. అవి ఏవో చూడండి

హీరో డెస్టినీ, మ్యాస్ట్రో ఎడ్జ్ స్కూటర్లలో స్పెషల్ ఎడిషన్స్ విడుదల; వివరాలు

డెస్టినీ 125 మరియు మాస్ట్రో ఎడ్జ్ 110 లతో పాటు, హీరో మోటోకార్ప్ తమ స్ప్లెండర్ ప్లస్ మరియు ప్యాషన్ ప్రో మోడళ్లలో కూడా 100 మిలియన్ ఎడిషన్లను విడుదల చేసింది. మార్కెట్లో హీరో స్ప్లెండర్ ప్లస్ మరియు ప్యాషన్ ప్రో 100 మిలియన్ ఎడిషన్ల ధరలు వరుసగా రూ.67,095 మరియు రూ.69,200 (ఎక్స్-షోరూమ్)లుగా ఉన్నాయి.

హీరో డెస్టినీ, మ్యాస్ట్రో ఎడ్జ్ స్కూటర్లలో స్పెషల్ ఎడిషన్స్ విడుదల; వివరాలు

హీరో మోటోకార్ప్ ఈ ఏడాది జనవరి నెలలో మాస్ట్రో, డెస్టినీ, ఎక్స్‌ట్రీమ్, స్ప్లెండర్, గ్లామర్ మరియు ప్యాషన్ ప్రో మోడళ్లతో పాటుగా 6 మోడళ్లలో సెలబ్రిటీ ఎడిషన్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. ఇటీవలే కంపెనీ ఎక్స్‌ట్రీమ్ 160ఆర్‌ను కూడా విడుదల చేసింది.

MOST READ:పుష్ పుల్ టెక్నాలజీ వల్ల ట్రైన్ వేగం మరింత పెరిగే అవకాశం ; ఈ పుష్ పుల్ టెక్నాలజీ ఏంటనుకుంటున్నారా..!

హీరో డెస్టినీ, మ్యాస్ట్రో ఎడ్జ్ స్కూటర్లలో స్పెషల్ ఎడిషన్స్ విడుదల; వివరాలు

హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకే వేరియంట్‌లో మాత్రమే లభిస్తుండగా, ప్యాషన్ ప్రో డ్రమ్ మరియు డిస్క్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది దీని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.71,400 (ఎక్స్-షోరూమ్). హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మాదిరిగా, ఈ మోడళ్లను డ్యూయల్ టోన్ రెడ్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్‌లలో విక్రయిస్తున్నారు.

Most Read Articles

English summary
Hero Motocorp Launches Destini 125 And Maestro Edge 110 100 Million Special Editions, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X