2021 బిఎస్ 6 హీరో ఎక్స్‌ప్లస్ 200టి బైక్ వచ్చేసింది.. చూసారా!

ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన 2021 ఎక్స్‌ప్లస్ 200టి బైక్ ని ఇప్పుడు దేశీయ మార్కెట్లో అప్‌డేట్ చేసిన ఇంజిన్‌తో విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ఇప్పుడు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తయారైంది. కొత్త బిఎస్ 6 కంప్లైంట్ హీరో ఎక్స్‌ప్లస్ 200టి ధర ఇప్పుడు రూ.1.13 లక్షలు(ఎక్స్‌షోరూమ్,ఢిల్లీ). ఈ కొత్త బిఎస్ 6 బైక్ దాని మునుపటి బిఎస్ 4 మోడల్ కంటే రూ. 19,000 ఎక్కువ ధరను కలిగి ఉంటుంది.

2021 బిఎస్ 6 హీరో ఎక్స్‌ప్లస్ 200టి బైక్ వచ్చేసింది.. చూసారా!

ఈ కొత్త హీరో మోటోకార్ప్ యొక్క మోటారుసైకిల్ అప్డేట్ చేసిన ఇంజిన్ కాకుండా, మిగిలిన మొత్తం దాదాపు దాని మునుపటి మోడల్ కి సమానంగా ఉంటుంది. హీరో ఎక్స్‌ప్లస్ 200టి ఇది వరకు చెప్పినట్లుగానే అదే 200 సిసి సింగిల్ సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్ యొక్క అప్డేటెడ్ వెర్షన్.

2021 బిఎస్ 6 హీరో ఎక్స్‌ప్లస్ 200టి బైక్ వచ్చేసింది.. చూసారా!

ఈ 2021 ఎక్స్‌ప్లస్ 200టి 8500 ఆర్‌పిఎమ్ వద్ద 18.1 బిహెచ్‌పి మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 16.15 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇది తన మునుపటి బిఎస్ 4 మోడల్‌లో కార్బ్యురేటర్ స్థానంలో ఫ్యూయెల్-ఇంజెక్షన్ టెక్నాలజీతో వస్తుంది.

MOST READ:ఔరా.. ఇదేమి సిత్రం.. ట్రక్ డ్రైవర్‌కి హెల్మెట్ లేదని ఫైన్.. ఎక్కడో తెలుసా

2021 బిఎస్ 6 హీరో ఎక్స్‌ప్లస్ 200టి బైక్ వచ్చేసింది.. చూసారా!

బిఎస్ 6 కంప్లైంట్ ఎన్ఎమ్ 200 టి ఇప్పుడు దాని మునుపటి కంటే ఎక్కువ ఇంధన సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. కొత్త బిఎస్ 6 హీరో ఎన్ఎమ్ 200 టి బైక్ కి మరియు దాని పాత బిఎస్ 4 మోడల్‌కు ఉన్న ప్రధాన తేడా దాని బరువు. కొత్త మోటారుసైకిల్ ఇప్పుడు 154 కేజీల బరువును కలిగి ఉంది. అంటే దీని బరువు దాని మునుపటి మోడల్ కంటే 4 కేజీలు ఎక్కువ.

2021 బిఎస్ 6 హీరో ఎక్స్‌ప్లస్ 200టి బైక్ వచ్చేసింది.. చూసారా!

ఈ మార్పులు కాకుండా కొత్త బిఎస్6 హీరో ఎక్స్‌ప్లస్ 200 టి లో ఇతర మార్పులు లేదు. ఈ బైక్ అదే డిజైన్, ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ బైక్ లో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటివి ఉన్నాయి.

MOST READ:కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు

2021 బిఎస్ 6 హీరో ఎక్స్‌ప్లస్ 200టి బైక్ వచ్చేసింది.. చూసారా!

బిఎస్ 6 హీరో ఎక్స్‌ప్లస్ 200 టి ముందు భాగంలో స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్క్‌లను మరియు వెనుక భాగంలో 7 టైప్స్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే దీని ముందు భాగంలో 276 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్స్ కలిగి ఉంటుంది. దీనికి సింగిల్-ఛానల్ ఎబిఎస్ సపోర్ట్ కూడా ఉంటుంది.

2021 బిఎస్ 6 హీరో ఎక్స్‌ప్లస్ 200టి బైక్ వచ్చేసింది.. చూసారా!

ఈ బైక్ యొక్క రెండు చివర్లలో 17 ఇంచెస్ చక్రాలపై వరుసగా 100/80 మరియు 130/70 ముందు మరియు వెనుక టైర్ ప్రొఫైల్‌లతో నడుస్తుంది. ఎక్స్‌ప్లస్ 200 టి 799 మిమీ ఎత్తు కలిగిన సీటు మరియు 13 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కొత్త హీరో ఎక్స్‌ప్లస్ 200 టి భారతమార్కెట్లో బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 200, టివిఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి, కెటిఎం డ్యూక్ 200 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:ఒకరిపై ఒకరు కూర్చుని ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేసిన యువతులు [వీడియో]

Most Read Articles

English summary
BS6 Hero Xpulse 200T Launched In India. Read in Telugu.
Story first published: Saturday, March 20, 2021, 9:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X