కబీరా హెర్మెస్ 75 హై-స్పీడ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, వివరాలు

గోవాకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కబీరా మొబిలిటీ మార్కెట్లో ఓ కొత్త మోడల్‌ను విడుదల చేసింది. కబీరా 'హెర్మెస్ 75' అనే హైస్పీడ్ కమర్షియల్ డెలివరీ ఈ-స్కూటర్ కంపెనీ విడుదల చేసింది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.89,600 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కబీరా హెర్మెస్ 75 హై-స్పీడ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, వివరాలు

కబీరా మొబిలిటీ కొత్తగా విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తి అని, లాస్ట్ మైల్ డెలివరీ కోసం పర్యావరణ సాన్నిహిత్యమైన రవాణా పరిష్కారాలను అందించే లక్ష్యంలో భాగంగా హెర్మెస్ 75 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించామని కంపెనీ తెలిపింది.

కబీరా హెర్మెస్ 75 హై-స్పీడ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, వివరాలు

కబీరై హెర్మెస్ 75 హై-స్పీడ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ జూన్ 2021లో అమ్మకానికి వస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ స్కూటర్‌ను దేశవ్యాప్తంగా ఉన్న తమ షోరూమ్‌లలో ప్రదర్శించబడుతుందని కంపెనీ వివరించింది.

కబీరా హెర్మెస్ 75 హై-స్పీడ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, వివరాలు

ఈ స్కూటర్‌లో కస్టమర్లు తమ అవసరాన్ని బట్టి స్థిరమైన మరియు మార్పిడి చేయగల బ్యాటరీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. స్థిరమైన (ఫిక్స్డ్) బ్యాటరీ కలిగిన హెర్మెస్ 75 ఎలక్ట్రిక్ స్కూటర్లు వరుసగా 100 కిలోమీటర్లు మరియు 120 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తాయి.

కబీరా హెర్మెస్ 75 హై-స్పీడ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, వివరాలు

అలాగే, మార్పిడి (స్వాపబుల్) చేయగల బ్యాటరీలు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు సాధారణ పరిస్థితులలో 80 కిలోమీటర్ల రేంజ్‌ను కవర్ చేస్తాయని కబీరా మొబిలిటీ పేర్కొంది. కబీరా హెర్మిస్ 75 ఎలక్ట్రిక్ స్కూటర్ 60వి 40ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది.

కబీరా హెర్మెస్ 75 హై-స్పీడ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, వివరాలు

ఈ బ్యాటరీని చార్జ్ చేయటానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై ఇది 120 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ స్కూటర్‌లో 2500 వాట్ డెల్టా-ఈవి హబ్ మౌంటెడ్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్ గరిష్టంగా 4000 వాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

కబీరా హెర్మెస్ 75 హై-స్పీడ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, వివరాలు

కబీరా హెర్మెస్ 75 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఇది భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కమర్షియల్ టూవీలర్ అని కంపెనీ పేర్కొంది. ఇందులో 12 ఇంచ్ వీల్స్, డ్యూయల్ డిస్క్ సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, ఆల్-డిజిటల్ డాష్‌బోర్డ్, మొబైల్ యాప్ విత్ ఐఓటి వంటి ఫీచర్లు ఉన్నాయి.

కబీరా హెర్మెస్ 75 హై-స్పీడ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, వివరాలు

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్ II పథకం క్రిందకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందని, దీని కొనుగోలుపై కస్టమర్లు సబ్సిడీని కూడా పొందవచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, ఫేమ్ II క్రింద ఆమోదించబడిన మొదటి వాణిజ్య డెలివరీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కూడా హెర్మెస్ 75 అని కంపెనీ పేర్కొంది.

కబీరా హెర్మెస్ 75 హై-స్పీడ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, వివరాలు

కబీరా మొబిలిటీ ఇటీవలే తమ ఎలక్ట్రిక్ టూవీలర్ పోర్ట్‌ఫోలియోలో కెఎమ్3000 మరియు కెఎమ్4000 అనే రెండు ఎలక్ట్రిక్ బైక్‌లను కూడా అందిస్తున్న సంగతి తెలిసినదే. కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్‌లకు కొనుగోలుదారుల నుండి మంచి స్పందన లభించింది. - ఈ బైక్‌లకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

కబీరా హెర్మెస్ 75 హై-స్పీడ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, వివరాలు

ఈ బైక్‌ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం 96 గంటల్లో 6,000 యూనిట్ల బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ మోడళ్లకు సంబంధించిన మొదటి బ్యాచ్ అమ్మకాలు కూడా పూర్తయిపోయాయని కంపెనీ తెలిపింది. మార్కెట్లో వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ.1.26 లక్షలు (కెఎమ్3000), రూ.1.36 లక్షలు (కెఎమ్4000)గా ఉన్నాయి.

Most Read Articles

English summary
Kabira Hermes 75 High-Speed Commercial Delivery E-Scooter Launched In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X