Just In
- 50 min ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 2 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
- 17 hrs ago
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
Don't Miss
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Sports
ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ 2021పై బీసీసీఐ పునరాలోచన! తెరపైకి ప్లాన్-బి!
- Movies
టాలీవుడ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో కబీరా పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు రేంజ్
గోవాకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కబీరా మొబిలిటీ కెఎమ్ 3000, కెఎమ్ 4000 అనే రెండు సరికొత్త పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.1.26 లక్షలు, రూ.1.36 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించామని, త్వరలోనే వీటి భారతదేశ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఈ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్‌లలో ఆఫర్ చేస్తున్న కాంబి బ్రేక్‌లు బెస్ట్ ఇన్ క్లాస్ పనితీరును కనబరుస్తాయని కంపెనీ తెలిపింది.

కెఎమ్ 3000 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ కాగా, కెఎమ్ 4000 ఇ-స్ట్రీట్ బైక్‌గా ఉంటుంది. కెఎమ్ 3000 లో 6 కిలోవాట్ డెల్టివ్ బిఎల్‌డిసి మోటార్ ఉంటుంది మరియు ఇది 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది ఎకో మోడ్‌లో 120 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. అలాగే, స్పోర్ట్ మోడ్‌లో గరిష్టంగా గంటకు 100 కి.మీ వేగంతో పరుగులు తీస్తూ, పూర్తి చార్జ్‌పై 60 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.
MOST READ:ఈ అంబాసిడర్ కారును చూశారా.. అబ్బా ఎంత అందంగా ఉందో..

ఇకపోతే, కెఎమ్ 4000 లో 8 కిలోవాట్ డెల్టివ్ బిఎల్‌డిసి మోటార్ ఉంటుంది, ఇది 4.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది ఎకో మోడ్‌లో 150 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. స్పోర్ట్ మోడ్‌లో గరిష్టంగా గంటకు 120 కి.మీ వేగంతో పరుగులు తీస్తూ, పూర్తి చార్జ్‌పై 90 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ వివరించింది.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కెఎమ్ 3000 కేవలం 3.3 సెకన్లలో 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, కెఎమ్ 4000 కేవలం 3.1 సెకన్లలోనే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్‌లు ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.
MOST READ:విదేశీ మోడళ్లకు సవాల్ విసరనున్న మేడ్ ఇన్ ఇండియా 'ఈట్రస్ట్' ఎలక్ట్రిక్ బైక్

కెఎమ్ 3000 మరియు కెఎమ్ 4000 బ్యాటరీ ప్యాక్‌లను ఎకో ఛార్జ్ ద్వారా 2 గంటల 50 నిమిషాల్లో 80 శాతం చార్జ్ చేసుకోవచ్చు. అదే బూస్ట్ చార్జ్ ద్వారా అయితే కేవలం 50 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జ్ చేయవచ్చు. ఈ బ్యాటరీలను పూర్తిగా 100 శాతం చార్జ్ చేయటానికి ఎకో ఛార్జ్ ద్వారా 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది.

రెండు మోడళ్లలో సిబిఎస్ (కాంబి బ్రేకింగ్ సిస్టమ్)తో కూడిన సింగిల్ రియర్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. కబీరా కెఎమ్ 3000 బైక్‌లో ముందు వైపు ఒకే ఒక డిస్క్ బ్రేక్ ఉంటుంది. అయితే, కబీరా కెఎమ్ 4000లో మాత్రం ముందు వైపు రెండు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.
MOST READ:ఈ టైర్లు పంక్చర్ కావు.. ఇదేంటనుకుంటున్నారా.. వీడియో చూడండి

కబీరా కెఎమ్ 3000 మొత్తం 2100 మిమీ పొడవును, 760 వెడల్పును మరియు 1200 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది మరియు దీని వీల్ బేస్ 1430 మిమీగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో 830 మి.మీ సీటు హైట్‌ను కలిగి ఉంటుంది. దీని మొత్తం బరువు 138 కిలోలుగా ఉంటుంది.

కబీరా కెఎమ్ 4000 మొత్తం 2050 మిమీ పొడవును, 740 వెడల్పును మరియు 1280 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది మరియు దీని వీల్ బేస్ 1280 మిమీగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో 800 మి.మీ సీటు హైట్‌ను కలిగి ఉంటుంది. దీని మొత్తం బరువు 147 కిలోలుగా ఉంటుంది.
MOST READ:ప్రమాదానికి గురైన శిల్పా శెట్టి భర్త కార్, కానీ కార్లో ఉన్నది మాత్రం అతడు కాదు.. ఇంకెవరు

కబీరా మొబిలిటీ 2018 నుండి ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేస్తోంది. ఈ బైక్‌ల కోసం రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఫైర్‌ప్రూఫ్ బ్యాటరీ ప్యాక్‌లు, పార్క్ అసిస్ట్ మరియు ఇతర స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ ఏడాది అనేక కొత్త మోడళ్లను తమ వినియోగదారులకు పరిచయం చేయాలని కబీరా మొబిలిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో కబీరా మొబిలిటీ తమ పరిధిని పెంచుకునేందుకు ఇ-కామర్స్ మరియు డీలర్షిప్ మోడళ్లపై ఆధారపడుతుంది.