Just In
Don't Miss
- News
Lady: హోటల్ లో క్వారంటైన్, లేడీ అదిరిందని ఏం చేశాడంటే ?, కరోనా అంటే భయం లేదు సైకోకి !
- Sports
SRH vs RCB: చివరి ఓవర్లో ఉత్కంఠత.. ఆ బౌలర్‌ని తప్పించాలని వార్నర్ డిమాండ్!!
- Lifestyle
చాణక్య నీతి ప్రకారం, మగవారి జీవితంలో మహిళలు ఎప్పుడు విషపూరితంగా మారతారో తెలుసా...!
- Finance
15 రోజుల తర్వాత మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఢిల్లీలో ఎంత ఉందంటే
- Movies
ఫెయిల్యూర్స్ వచ్చినా శర్వానంద్ రేంజ్ తగ్గట్లేదుగా.. మళ్ళీ పవర్ఫుల్ పాత్రలో
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ స్కూటర్లకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు; ధర కూడా తక్కువే
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొత్త తయారీదారులు కూడా పుట్టుకొస్తున్నారు. తాజాగా, అహ్మదాబాద్‌కి చెందిన 'ఒడిస్ ఎలక్ట్రిక్ వెహికల్స్' అనే స్టార్టప్ కంపెనీ రెండు కొత్త స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసింది.

లో-స్పీడ్ స్కూటర్ ఇ2గో అనే మోడల్‌ను ఒడిస్ ఎలక్ట్రిక్ కంపెనీ విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో లీడ్-యాసిడ్ మరియు లిథియం-అయాన్ బ్యాటరీలతో పనిచేసే వేరియంట్లు ఉన్నాయి.

మార్కెట్లో ఈ2గో స్టాండర్డ్ ధర రూ.52,999గా ఉంటే, ఈ2గో లైట్ ధర రూ.63,999గా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ అహ్మదాబాద్) ఉంది. ఈ రెండు మోడళ్లు మోడల్స్ అజూర్ బ్లూ, స్కార్లెట్ రెడ్, టీల్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్, మ్యాట్ బ్లాక్ అనే ఐదు రంగులో లభిస్తాయి.
MOST READ:టెస్లా ప్రియులకు శుభవార్త.. టెస్లా ఇప్పుడు భారత్‌కి వచ్చేస్తుందోచ్

కొత్త ఒడిస్ ఇ2గో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో వాటర్‌ప్రూఫ్ 250వాట్ బిఎల్‌డిసి (బ్రష్‌లెస్ డిసి) మోటార్ ఉంటుంది. ఇది వేరియంట్‌ను బట్టి 28 ఆంపియర్ లీడ్-యాసిడ్ బ్యాటరీ లేదా 1.26 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జ్‌పై 60 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది మరియు దీని బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయడానికి కేవలం 3.5 గంటల నుండి 4 గంటల సమయం మాత్రమే పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు.
MOST READ:డోనాల్డ్ ట్రంప్ వాడిన కారు వేలంలో పాల్గొంటున్న ఇండియన్, ఎవరో తెలుసా ?

ఒడిస్ అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను రైడ్ చేయడానికి రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ అవసరం లేదు. ఒడిస్ ఇ2గో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో డ్యూయల్ స్ప్రింగ్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్లు ఉంటాయి. అలాగే ముందు మరియు వెనుక భాగంలో ట్యూబ్ లెస్ టైర్లు అమర్చబడి ఉంటాయి.

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇంకా ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, యాంటీ-తెఫ్ట్ మోటార్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ, యుఎస్‌బి ఛార్జింగ్, రివర్స్ గేర్ ఫంక్షన్, మూడు రైడింగ్ మోడ్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:పేస్ మాస్క్ విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ

ఒడిస్ ఇ2గో ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ మూడు సంవత్సరాల వారంటీతో లభిస్తుంది. ఈ బ్యాటరీలు ఒడిస్ అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలలో అందుబాటులో ఉంటాయి.

ఒడిస్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల యాజమాన్యాన్ని సులభతరం చేసేందుకు కంపెనీ తమ వినియోగదారుల కోసం స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్స్‌ను కూడా అందించనుంది. కంపెనీ ఇందుకోసం ఐడిఎఫ్‌సి బ్యాంక్ మరియు ఇతర ప్రాంతీయ భాగస్వాముల నుండి ఆర్థిక భాగస్వాములను కలిగి ఉంది.
MOST READ:నిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్.. ఎలా అనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

ప్రస్తుతం ఒడిస్ ఎలక్ట్రిక్ కంపెనీది దేశవ్యాప్తంగా తొమ్మిది డీలర్‌షిప్‌లు కేంద్రాలు ఉన్నాయి. మార్చ్ 2021 నాటికి, వీటికి అదనంగా మరో 10 కొత్త అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 25కి పైగా నగరాల్లో తమ ఉనికిని కలిగి ఉండాలని ఒడిస్ యోచిస్తోంది.

ఈ సందర్భంగా ఓడిస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సీఈఓ నేమిన్ వోరా మాట్లాడుతూ.. ఇ2గో ఎలక్ట్రిక్ స్కూటర్లను పట్టణ మహిళలు మరియు యువతను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టామని, వీటి సాయంతో కస్టమర్లు సరసమైన ధరకే ఎలక్ట్రిక్ వాహనాలను పొంది, రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ అవసరం లేని సౌకర్యవంతమైన రైడ్‌ను ఆస్వాధించవచ్చని అన్నారు.