Ola ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా తయారు చేయబడుతుందో తెలుసా.. వీడియో చూడండి

అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారులలో ఒకటి Ola. Ola కంపెనీ ఎస్ 1 మరియు ఎస్ 1 ప్రో స్కూటర్‌లు రెండింటిని 2021 ఆగస్టు 15 న దేశీయ మార్కెట్లో విడుదల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో Ola S1 ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) కాగా Ola S1 Pro ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా తయారు చేయబడుతుందో తెలుసా.. వీడియో చూడండి

కంపెనీ దీని బుకింగ్స్ కూడా చాలా రోజుల క్రితమే ప్రారభించి, ఊహించని ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ కూడా పొందింది. ఇటీవల కంపెనీ అందించిన సమాచారం ప్రకారం Ola ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ 2021 నవంబర్ 10 న ప్రారంభించనున్నట్లు తెలిపింది. అయితే దీనికంటే ముందు, కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ కంపెనీ యొక్క ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఉత్పత్తి ప్రక్రియను చూపించే వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా తయారు చేయబడుతుందో తెలుసా.. వీడియో చూడండి

ఈ వీడియోలో Ola ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా మహిళలచే తయారు చేయబడుతుంది. ఓలా ఎలక్ట్రిక్ డెలివరీలు నవంబర్ నెల నుండి ప్రారంభం కానుంది, కాబట్టి స్కూటర్ ఉత్పత్తి వేగంగా జరుగుతోందని కంపెనీ తెలిపింది. 1 లక్షకు పైగా బుకింగ్‌లు వచ్చినప్పటికీ, కంపెనీ 2 రోజుల్లో రూ. 1,100 కోట్ల విలువైన 5,500 స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ ఇదివరకే అధికారికంగా తెలిపింది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా తయారు చేయబడుతుందో తెలుసా.. వీడియో చూడండి

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ కి డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా, బుక్ చేసుకున్న వినియోగదారులకు డెలివరీలు చేయడం నిజంగా ఒక సవాలుగా ఉంటుంది. చాలామంది కస్టమర్లు ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ కోసం ఎదురుచూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే, నవంబర్ తరువాత కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి మంచి ఆదరణ ఉంటుంది అని భావిస్తున్నాము.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా తయారు చేయబడుతుందో తెలుసా.. వీడియో చూడండి

కంపెనీ తన కష్టమర్లకు ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరగా డెలివరీ చేయడానికి, ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. కంపెనీ మొదటి దశలో కస్టమర్లకు డెలివరీ చేయనుంది. అయితే మొదటి నెలలో ఎంత మంది కస్టమర్లు తమ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లను పొందుతారో వేచి చూడాలి.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా తయారు చేయబడుతుందో తెలుసా.. వీడియో చూడండి

దీనికి సంబంధించి వెలువడిన ఈ వీడియోలో, స్కూటర్‌లోని భాగాలను అసెంబ్లింగ్ చేయడం నుండి బాడీని సిద్ధం చేయడం వరకు మహిళలు ఎలా తయారు చేస్తున్నారో చూడచ్చు. ఆ తర్వాత స్కూటర్‌ను పూర్తిగా అసెంబ్లింగ్ చేసి సిద్ధం చేయడం కూడా మొత్తం మహిళలే నిర్వహించడం ఇక్కడ చూడవచ్చు.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా తయారు చేయబడుతుందో తెలుసా.. వీడియో చూడండి

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని, గ్రీన్ పవర్ కోసం గర్ల్ పవర్‌ను వినియోగిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారం మాత్రమే కాదు, ఇది పూర్తిగా మహిళా కార్మికులతో నడిచే ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ. ఓలా ఎలక్ట్రిక్‌ ఫ్యాక్టరీలో 10,000 మంది మహిళా కార్మికులను నియమించారు. ఇక్కడ పని మొత్తం కేవలం మహిళల చేతుల మీదుగానే జరుగుతుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా తయారు చేయబడుతుందో తెలుసా.. వీడియో చూడండి

ఇప్పటికే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, తొలిదశలో ఓలా ఫ్యాక్టరీలో ఏటా 20 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనున్నారు. అదే సమయంలో, పూర్తి కమీషన్ తర్వాత, ప్లాంట్ ప్రతి సంవత్సరం 1 కోటి వాహనాలను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా తయారు చేయబడుతుందో తెలుసా.. వీడియో చూడండి

అంతే కాకుండా ఈ ప్లాంట్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం రోజుకు 25,000 బ్యాటరీలను కూడా తయారు చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రక్రియలో కంపెనీ పూర్తిగా సొంతంగా తయారు చేసే ప్రక్రియలో ఉండాలని కోరుకుంటుంది. ఈ కారణంగానే కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లకు కావాల్సిన బ్యాటరీ మరియు దాని రీసైక్లింగ్ అంటి వాటిని కూడా నిర్వహిస్తుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా తయారు చేయబడుతుందో తెలుసా.. వీడియో చూడండి

Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది 10 కలర్ ఆప్షన్‌లతో లభిస్తుంది మరియు 3.97 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడిన 8.5 kW ఎలక్ట్రిక్ మోటార్‌ని ప్యాక్ చేస్తుంది. ఇక Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే ఛార్జ్‌పై 180 కిమీల కంటే ఎక్కువ ప్రయాణాన్ని అందిస్తుంది.

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా తయారు చేయబడుతుందో తెలుసా.. వీడియో చూడండి

Ola Electric స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. Ola కంపెనీ ఇటీవల తన హైపర్‌చార్జర్ స్టేషన్ ని కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 27, 2021, 17:42 [IST]
English summary
Ola electric scooter production by women video details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+