టెస్టింగ్ చేస్తూ కెమెరాకి చిక్కిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; స్పై చిత్రాలు

టాక్సీ సేవల రంగంలో ప్రాచుర్యం పొందిన ఓలా క్యాబ్స్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం, ఓలా ఎలక్ట్రిక్ భారత మార్కెట్ కోసం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేస్తోంది. కాగా, ఈ స్కూటర్‌కి సంబంధించి తొలిసారిగా స్పై చిత్రాలు బయటకు వచ్చాయి.

టెస్టింగ్ చేస్తూ కెమెరాకి చిక్కిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; స్పై చిత్రాలు

ఓలా గడచిన మే 2020లో నెథర్లాండ్స్‌కి చెందిన ఎటెర్గో అనే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థను కొనుగోలు చేసింది. తమిళనాడులో ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సీమెన్స్ సంస్థతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఈ ప్లాంట్‌లోనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేయనున్నారు.

టెస్టింగ్ చేస్తూ కెమెరాకి చిక్కిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; స్పై చిత్రాలు

ఎటెర్గో గతంలో అంతర్జాతీయ మార్కెట్ల కోసం తయారు చేసిన 'యాప్‌స్కూటర్' ఆధారంగానే ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేశారు. హెడ్‌లైడ్ మరియు బేసిక్ డిజైన్ లేఅవుట్‌ని చూస్తే ఇది స్పష్టమవుతుంది.

MOST READ:బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

టెస్టింగ్ చేస్తూ కెమెరాకి చిక్కిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; స్పై చిత్రాలు

బ్లాక్ అండ్ వైట్ చెక్స్‌తో క్యామోఫ్లేజ్ చేసిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత రోడ్లపై కంపెనీ పరీక్షిస్తోంది. ఎటర్గో యాప్‌స్కూటర్‌ను కాస్తంత అప్‌గ్రేడ్ చేసి, ఇండియన్ మార్కెట్‌కి అనువుగా దీనిని స్వల్పంగా రీడిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో ముందు వైపు ఒకే సింగిల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది.

టెస్టింగ్ చేస్తూ కెమెరాకి చిక్కిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; స్పై చిత్రాలు

ఈ స్కూటర్‌లో ఉపయోగించబోయే ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ గురించి ప్రస్తుతానికి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, ఇది యాప్‌స్కూటర్ మాదిరిగానే రిమూవబుల్ బ్యాటరీని మరియు ఇతర ఫీచర్లను అలానే కలిగి ఉంటుందని తెలుసితోంది.

MOST READ:వామ్మో.. పెట్రోల్ బంకులో ఇంత మోసమా.. మీరే చూడండి

టెస్టింగ్ చేస్తూ కెమెరాకి చిక్కిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; స్పై చిత్రాలు

ఈ స్కూటర్‌లో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీల సాయంతో ఇది గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీస్తుందని సమాచారం. అలాగే, ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీలు పూర్తి ఛార్జీపై 240 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తాయని తెలుస్తోంది.

టెస్టింగ్ చేస్తూ కెమెరాకి చిక్కిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; స్పై చిత్రాలు

ఈ స్కూటర్‌లో బ్యాటరీ ప్యాక్ 3 విభాగాలుగా ఉంటుంది. ప్రతి విభాగాన్ని బయటకుతీసి విడిగా చార్జ్ చేసుకోవచ్చు. ఇందులోని ప్రతి బ్యాటరీ వ్యక్తిగతంగా 80 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. మొత్తంగా ఈ మూడు బ్యాటరీలు కలిపి 240 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి.

MOST READ:వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

టెస్టింగ్ చేస్తూ కెమెరాకి చిక్కిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; స్పై చిత్రాలు

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.9 సెకన్లలోనే గంకు 0-45 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. ఎటెర్గో యాప్‌స్కూటర్‌ను భారత మార్కెట్‌కు అనుగుణంగా కంపెనీ మోడిఫై చేయనుంది. మార్కెట్ అంచనా ప్రకారం, దీని ధర రూ.1 లక్ష వరకూ ఉండొచ్చని తెలుస్తోంది.

టెస్టింగ్ చేస్తూ కెమెరాకి చిక్కిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; స్పై చిత్రాలు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో విడుదల కానుంది. ఇది ఈ విభాగంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, టీవీఎస్ ఐక్యూబ్ మరియు ఏథర్ 450ఎక్స్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:రైల్వే ట్రాక్ వద్ద సహనం లేకుంటే ఏమవుతుందో తెలుసా.. అయితే వీడియో చూడండి

టెస్టింగ్ చేస్తూ కెమెరాకి చిక్కిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; స్పై చిత్రాలు

ఈ ప్రీమియం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ డిస్ప్లే, ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ యాప్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉండొచ్చని ఆశిస్తున్నారు.

Source: Autocar India

Most Read Articles

English summary
Ola's First Electric Scooter Spied Testing In India For The First Time. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X