అతి త్వరలోనే ఓలా నుండి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల!

ప్రస్తుతం భారతదేశంలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో, మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు నిత్యం కొత్తగా అనేక ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.

అతి త్వరలోనే ఓలా నుండి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల!

తాజాగా, టాక్సీ సేవల రంగం ద్వారా ప్రాచుర్యం పొందిన ఓలా క్యాబ్స్, ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ పేరుతో భారత మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ ఉత్పత్తులను తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే, తమిళనాడులోని హోసూర్‌లో ఓ ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ఓలా, అతి త్వరలోనే తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత్‌లో విడుదల చేయనుంది.

అతి త్వరలోనే ఓలా నుండి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సంబంధించిన మొట్టమొదటి స్పై చిత్రాలు కూడా ఇటీవలే ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఓలా తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఓలా ఈ స్కూటర్‌ను కేవలం భారత మార్కెట్ కోసం మాత్రమే కాకుండా పలు అంతర్జాతీయ మార్కెట్ల కోసం కూడా తయారు చేస్తోంది.

MOST READ:ఇదేం సిత్రం.. ట్రక్కులో కట్టేసి తీసుకెళ్తున్న జావా 42 బైక్‌కి ఓవర్‌స్పీడింగ్ ఛలాన్!?

అతి త్వరలోనే ఓలా నుండి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల!

నెథర్లాండ్స్‌కి చెందిన ఎటెర్గో అనే సంస్థను ఓలా గడచిన మే 2020లో కొనుగోలు చేసింది. ఎటెర్గో గతంలో అంతర్జాతీయ మార్కెట్ల కోసం తయారు చేసిన 'యాప్‌స్కూటర్' ఆధారంగానే ఓలా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత్ కోసం తయారు చేస్తోంది.

అతి త్వరలోనే ఓలా నుండి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ముందు వైపు సింగిల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీల సాయంతో ఇది గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీస్తుందని సమాచారం.

MOST READ:సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

అతి త్వరలోనే ఓలా నుండి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల!

ఈ స్కూటర్‌లో లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగించారు. ఇవి పూర్తి ఛార్జీపై 240 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తాయని అంచనా. ఈ స్కూటర్ కేవలం 3.9 సెకన్లలోనే గంకు 0-45 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుందని సమాచారం.

అతి త్వరలోనే ఓలా నుండి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల!

ఎటెర్గో యాప్‌స్కూటర్‌ను ఓలా భారత మార్కెట్‌కు అనుగుణంగా మోడిఫై చేసినట్లుగా తెలుస్తోంది. మార్కెట్ అంచనా ప్రకారం, ఓలా నుండి రాబోయే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు రూ.1 లక్ష వరకూ ఉండొచ్చని అంచనా.

MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

అతి త్వరలోనే ఓలా నుండి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మాస్ ప్రొడక్షన్ కోసం కంపెనీ తమిళనాడులోని హోసూర్ వద్ద సుమారు 500 ఎకరాల స్థలంలో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద స్కూటర్ల తయారీ కర్మాగారాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొంది.

అతి త్వరలోనే ఓలా నుండి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల!

ఈ ప్లాంట్‌ను ప్రతి ఏటా 2 మిలియన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యతో నిర్మిస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్‌తో పాటుగా యుఎస్ఏ, యూరప్, యుకె, ఆసియా పసిఫిక్ దేశాలు, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ సహా ప్రపంచంలోని వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.

MOST READ:ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ర్యాలీ చేపట్టిన కలకత్తా సీఎం.. ఎందుకో తెలుసా!

Most Read Articles

English summary
OLA To Launch It's First Electric Scooter In India Very Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X