భారత్‌లో విడుదలైన వైట్ కార్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్; పూర్తి వివరాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజు రోజుకి డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ తరుణంలో వాహన తయారీ కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి అన్ని సన్నాహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైట్ కార్బన్ మోటార్స్ దేశీయ మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన వైట్ కార్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్; పూర్తి వివరాలు

వైట్ కార్బన్ మోటార్స్ లిమిటెడ్ యొక్క ప్రధాన కార్యాలయం 2020 జనవరిలో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో స్థాపించబడింది. దీని వ్యవస్థాపకుడు ప్రతీక్ సింగ్ శంకర్ మరియు అతని టీమ్ నాయకత్వంలో కంపెనీ జిటి 5 మరియు ఓ 3 అనే రెండు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టింది.

భారత్‌లో విడుదలైన వైట్ కార్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్; పూర్తి వివరాలు

ఈ స్కూటర్స్ కొనుగోలుపై ప్రభుత్వం రాయితీలను కూడా అందిస్తుంది. ఈ స్కూటర్ విద్యార్థులు మరియు యువకుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ స్కూటర్ ఇప్పుడు చిన్న విభాగంలో ప్రవేశపెట్టబడింది. వైట్ కార్బన్ మోటార్స్ లిమిటెడ్ యొక్క జిటి 5 అనేది ప్రధాన మోడల్, ఇది ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్‌లైన హీరో ఎలక్ట్రిక్, ఒకినావా వంటి స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:భారత్‌లో ప్రారంభం కానున్న నార్టన్ మోటార్ సైకిల్స్; పూర్తి వివరాలు

భారత్‌లో విడుదలైన వైట్ కార్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్; పూర్తి వివరాలు

కంపెనీ ఈ రెండు ఈ స్కూటర్ల తయారీతో పాటు, బ్రేక్, గేర్ బాక్స్‌లు, రోడ్ వీల్స్, సస్పెన్షన్ షాక్ అబ్జార్బర్స్, రేడియేటర్లు, సైలెన్సర్లు, ఎగ్జాస్ట్ పైప్స్, స్టీరింగ్ వీల్స్, స్టీరింగ్‌తో సహా విడిభాగాలు మరియు యాక్ససరీస్ వంటివి తయారుచేస్తుంది.

భారత్‌లో విడుదలైన వైట్ కార్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్; పూర్తి వివరాలు

కంపెనీ వైట్ కార్బన్ జిటి 5 ను రూ. 1,15,000 ధరకు విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో డిజిటల్ స్పీడోమీటర్ మరియు ఓడోమీటర్, ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్లతో బ్యాటరీ ఇండికేటర్స్ వంటివి ఉంటాయి.

MOST READ:కొత్త 2021 మోడల్ ఎక్స్‌ఎస్‌ఆర్125 బైక్‌ ఆవిష్కరించిన యమహా

భారత్‌లో విడుదలైన వైట్ కార్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్; పూర్తి వివరాలు

ఈ స్కూటర్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో అల్లాయ్ వీల్స్ తో పాటు 120/70 ఆర్ 12 ట్యూబ్ లెస్ టైర్స్ ఉంటాయి. దీనితో పాటు, ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రైడ్ బ్యాక్ సపోర్ట్, యుఎస్‌బి ఛార్జింగ్ మరియు సైడ్ స్టాండ్ ఇండికేటర్లతో కూడిన సౌకర్యవంతమైన సీటు కూడా ఉంది.

భారత్‌లో విడుదలైన వైట్ కార్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్; పూర్తి వివరాలు

వైట్ కార్బన్ జిటి 5 స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 1,850 మిమీ, వెడల్పు 675 మిమీ మరియు ఎత్తు 1,370 మిమీ, దాని వీల్‌బేస్ 1,140 మిమీ. అంతే కాకుండా కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ స్కూటర్ యొక్క లోడింగ్ సామర్థ్యం 245 కేజీల వరకు ఉంటుంది. కానీ ఈ స్కూటర్ యొక్క మొత్తం బరువు 170 కేజీలు.

MOST READ:కరోనా కాటుకి బలైపోయిన బుల్లెట్ బైక్‌పై లాంగ్ డ్రైవ్స్ చేసే వృద్ధ జంట; వివరాలు

భారత్‌లో విడుదలైన వైట్ కార్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్; పూర్తి వివరాలు

వైట్ కార్బన్ మోటార్స్ లిమిటెడ్ జిటి 5 బిఎల్‌డిసి ఇంజిన్‌తో 3 కిలోవాట్ల బాష్ ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 50 కిమీ కాగా, ఇది మొత్తం 58 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ, వాహనదారునికి మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన వైట్ కార్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్; పూర్తి వివరాలు

ఇక వైట్ కార్బన్ యొక్క ఓ3 ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, దీని ధర 55,900 రూపాయల వరకు ఉంటుంది. ఇది డిజిటల్ స్పీడోమీటర్ మరియు ఓడోమీటర్, ఎల్‌ఇడి హెడ్‌లైట్ మరియు ఎల్‌ఇడి టర్న్ ఇండికేటర్స్ మరియు అల్లాయ్ వీల్స్‌తో ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్‌ను కూడా ఉపయోగిస్తుంది.

MOST READ:నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

భారత్‌లో విడుదలైన వైట్ కార్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్; పూర్తి వివరాలు

ఈ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 1,740 మిమీ, వెడల్పు 700 మిమీ మరియు ఎత్తు 1,040 మిమీ. ఈ స్కూటర్ యొక్క లోడింగ్ సామర్థ్యం 120 కేజీల వరకు ఉంటుంది. ఓ3 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక BLDC ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇది 1.15 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 70 కిలోమీటర్ల పరిధిని మరియు గంటకు 25 కిమీ వేగంతో అందిస్తుంది.

Most Read Articles

English summary
White Carbon Launches Two Electric Scooters. Read in Telugu.
Story first published: Thursday, May 13, 2021, 9:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X