లేటుగా అయినా లేటెస్ట్‌గా జరగనున్న 'Simple One' డెలివరీలు.. అప్పుడే 65,000 దాటిన బుకింగ్స్
2021 ఆగష్టు 15 న భారతీయ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు అడుగుపెట్టిన 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) యొక్క 'సింపుల్ వన్' (Simple One) ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 65,000 బుకింగ్స్ దాటినట్లు కంపెనీ తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

సింపుల్ ఎనర్జీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి 2022 జనవరి నాటికి 30,000 బుకింగ్స్ వచ్చాయి. అయితే జనవరి నుంచి ఇప్పటికి ఆ సంఖ్య కాస్త రెట్టింపు అయ్యింది. దీన్ని బట్టి చూస్తే దేశీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. డెలివరీలు అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఇంతకు ముందు జులై నెలలో డెలివరీలు ప్రారంభించాలని చెప్పినప్పటికీ ఇప్పడు డెలివరీలు కొంత ఆలస్యంగా జరగనున్నాయి.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క వెబ్‌సైట్‌లో రూ. 1947 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర దేశీయ మార్కెట్లో రూ. 1.09 లక్షలు. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లోని 75 నగరాల్లో డెలివరీ కోసం డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ కృషి చేస్తోంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కావున దేశంలో ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, ముంబై, పూణే మరియు పనాజీ వంటి నగరాల్లో టెస్ట్ రైడ్ నిర్వహించబడుతోంది. కంపెనీ 2022 జూన్ లో టెస్ట్ రైడ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ ప్రారభించిన కేవలం 24 గంటల్లో 20,000 టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్‌లు వచ్చాయి.

కంపెనీ ఇప్పటికే బెంగళూరులో టెస్ట్ రైడ్ పూర్తి చేసింది, బెంగళూరులో దాదాపు 1000 మంది కస్టమర్‌లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టెస్ట్ రైడ్ చేశారు. ఇప్పుడు టెస్ట్ రైడ్ చెన్నైలో ప్రారంభమయింది. రాబోయే రోజుల్లో ఈ టెస్ట్ రైడ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

సింపుల్ ఎనర్జీ అందిస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో మోడ్‌లో 236 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. సింపుల్ లూప్ ఛార్జర్ సహాయంతో, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 60 సెకన్లలోనే 2.5 కిమీ పరిధికి సరిపడా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని బ్యాటరీని 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి 2.75 గంటల సమయం పడుతుందని, అయితే ఇందులోని రిమూవబుల్ బ్యాటరీని విడిగా తీసి ఛార్జ్ చేయడానికి అదనంగా మరో 75 నిమిషాల సమయం పడుతుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ సందర్భంలో, రెండు బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి మొత్తంగా 4 గంటల సమయం పడుతుంది. హోమ్ ఏసి చార్జర్ సాయంతో చార్జ్ చేస్తే దాదాపు 2.75 గంటల్లో సుమారు 0 నుండి 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు.

సింపుల్ ఎనర్జీ రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా 300 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. ఇది వినియోగదారులకు ఫాస్ట్ ఛార్జింగ్ ప్రయోజనాలను అందించనుంది. ఈ స్కూటర్ కేవలం 2.95 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని బూడిద రంగు బ్యాటరీ ప్యాక్ 6 కిలోల కంటే ఎక్కువ బరువును కలిగి టుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ప్రత్యేకంగా భారతీయ ఉపయోగం కోసం రూపొందించబడింది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ప్రధానంగా లభించే ఫీచర్లు మరియు టెక్నాలజీలను గమనిస్తే, ఇందులో.. 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, నావిగేషన్ డిస్‌ప్లే, బ్లూటూత్, జియో ఫెన్సింగ్, 4G LTE, ఓటిఏ అప్‌డేట్స్, ఫాస్ట్ ఛార్జర్ గుర్తింపు, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, కాల్స్ మరియు మ్యూజిక్ కంట్రోల్, వెహికల్ ట్రాకిం0గ్, డాక్యుమంట్ స్టోరేజ్, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు మోనో షాక్ సస్పెన్షన్ సెటప్, ముందు మరియు వెనుక 90 మిమీ డ్రమ్ బ్రేక్‌లు, 12 ఇంచ్ టైర్లు, 30 లీటర్ల బూట్ స్పేస్ మరియు 110 కిలోల బరువును కలిగి ఉంటుంది. మొత్తం మీద సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా అనుకూలంగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో రోజురోజుకి మంచి బుకింగ్స్ పొందుతున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇక డెలివరీలు మాత్రమే జరగవలసి ఉంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎంతోమంది కస్టమర్లు ఎహురు చూస్తున్నారు. ఇటీవల మేము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని టెస్ట్ రైడ్ చేసాము.. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








