India
YouTube

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

మనదేశంలో ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో, ఇప్పటికే పెట్రోల్ ద్విచక్ర వాహనాలను కలిగి ఉన్నవారు తమ రెండవ వాహనంగా సిటీ ప్రయాణాలు మరియు చిన్నపాటి దూరాల కోసం వీటిని ఎంచుకుంటున్నారు. అలాగే, కొత్తగా టూవీలర్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు కూడా ముందుగా ఎలక్ట్రిక్ వాహనాలను విచారించిన తర్వాతనే కొనుగోలుపై ఓ నిర్ణయానికి వస్తున్నారు. ఇలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వెతుకుతున్న వారి కోసం ప్రస్తుతం మార్కెట్‌లో చాలా మంది తయారీదారులు అనేక కొత్త మోడళ్లను అందిస్తున్నారు.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

అయితే, అసలు సమస్య ఏంటంటే, వీటిలో నమ్మకమైన మరియు సురక్షితమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గుర్తించడమే. ఓ మంచి నాణ్యమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేయడం అంత సులభమైన విషయమేమీ కాదు. దీనికి చాలా ఓపిక, సుధీర్ఘ పరిశోధన మరియు అభివృద్ధి ఎంతో అవసరం. ప్రస్తుతం, నాణ్యమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అనగానే మార్కెట్లో అతికొద్ది బ్రాండ్లు మాత్రమే మన దృష్టికి వస్తాయి. అలాంటి స్ట్రాంగ్ ఈవీ బ్రాండ్లలో సింపుల్ ఎనర్జీ (Simple Energy) కూడా ఒకటి.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

బెంగుళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ గతేడాది (2021) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత మార్కెట్లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Simple One Electric Scooter) ను ఆవిష్కరించింది. ఆ సమయంలో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో క్లెయిమ్ చేసిన 200 కిలోమీటర్లకు పైగా రేంజ్ మరియు 105 కిలోమీటర్ల టాప స్పీడ్ వంటి విషయాలతో ఇది ఇప్పటికే చాలా మంది హృదయాలను గెలుచుకుంది. అప్పటికి, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం ఉత్పత్తికి మాత్రమే సిద్ధంగా ఉంది. అయినప్పటికీ, అతి కొద్ది సమయంలో సింపుల్ ఎనర్జీ తమ సింపుల్ వన్ ఈవీ కోసం 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందగలిగింది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

ఇప్పుడు ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలోనే కస్టమర్ల వద్దకు చేరుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క శక్తి సామర్థ్యాలు, పనితీరు మరియు రియల్ టైమ్ రేంజ్ వంటి అనేక అంశాలను పరిశీలించేందుకు మరియు పరీక్షించేందుకు మేము ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇటీవలే టెస్ట్ రైడ్ చేశాము. ఈ సెగ్మెంట్లోని ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో సింపుల్ వన్ కొత్తగా ఏమీ ఆఫర్ చేయబోతోంది? దీనిని నడపం సులంభంగా ఉంటుందా? నిజంగానే పూర్తి చార్జ్ పై 200 కిమీ ప్రయాణిస్తుందా? దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఇది కొత్త బ్రాండ్ కదా, కాబట్టి ఇది నమ్మదగిన స్కూటరేనా? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఈ సమీక్షలో సమాధానాలను వెతికే ప్రయత్నం చేద్దాం రండి.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

సింపుల్ వన్ డిజైన్ మరియు స్టైల్

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మొదటిసారి చూసినప్పుడు ముందుగా గుర్తుకువచ్చే పదాలు ఫ్యూచరిస్టిక్, షార్ప్ మరియు అగ్రెసివ్. ఈ స్కూటర్ మొత్తం కూడా షార్ప్‌గా కనిపించే యాంగ్యులర్ డిజైన్ లైన్లను కలిగి ఉంటుంది. ముందు భాగంలో దాదాపు త్రిభుజాకారంలో ఉండే ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ చాలా స్టైలిష్‌గా మరియు ప్రీమియంగా కనిపిస్తుంది. దీని ఫ్రంట్ ఆప్రాన్ కూడా కోణీయంగా ఉంటుంది మరియు బాడీ అంతటా పదునైన గీతలను కలిగి ఉంటుంది. ఓవరాల్‌గా ఇది మంచి ఏరోడైనమిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ మడ్‌గార్డ్ దాదాపు చదరపు (స్కేర్) డిజైన్‌తో ప్రత్యేకమైన లుక్‌ని కలిగి ఉంటుంది మరియు ఇది భారత మార్కెట్‌లో లభించే ఇతర స్కూటర్‌ల యొక్క వక్ర (కర్వ్) డిజైన్ కన్నా భిన్నంగా ఉంటుంది. ముందు భాగంలో కనుబొమ్మ ఆకారంలో ఉండే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు హ్యాండిల్‌బార్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ హౌసింగ్‌లో విలీనం చేయబడ్డట్లుగా ఉంటాయి. సైడ్ ప్రొఫైల్ నుండి చూసినప్పుడు, ఎవరి దృష్టినైనా ఆకర్షించే మొదటి అంశం ఇందులోని 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్. ఇవి నక్షత్రం ఆకారంలో ఉండే ప్రత్యేకమైన స్టైలింగ్‌ను కలిగి ఉంటాయి.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

సైడ్ ప్రొఫైల్‌లోని బాడీ ప్యానెల్‌లు కూడా షార్ప్ అండ్ యాంగ్యులర్ డిజైన్ లైన్‌లను కలిగి ఉంటాయి. వీటిపై బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఈ బ్లాక్ ఎలిమెంట్స్ మనం స్కూటర్ ను రైడ్ చేస్తున్నప్పుడు బ్రాజెన్ బ్లాక్ కలర్‌లో కనిపిస్తాయి. ఈ స్కూటర్ యొక్క ఫ్లోర్‌బోర్డ్ ఫ్లాట్‌గా మరియు ఎత్తుగా ఉంటుంది. ఇందులోని సింగిల్ పీస్ సీటు దానికదే ప్రత్యేకంగా ఉంటుంది. సీటు వెనుకవైపు కొంచెం ఎత్తుగా ఉండి, ముందు వైపుకు వాలుగా ఉన్నట్లు కనిపిస్తుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

స్కూటర్ దిగువన స్టైలిష్ స్వింగార్మ్ ఉంటుంది, ఇది గొప్పగా కనిపించడమే కాకుండా కాంపాక్ట్ సైజులో కూడా ఉంటుంది. గోల్డ్ కలర్ కాలిపర్‌లతో కూడిన పెటల్ డిస్క్ బ్రేక్‌లు కూడా స్కూటర్ స్టైల్ ను రెట్టింపు చేయడంలో సహకరిస్తాయి. వెనుక వైపున ఉండ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది మరియు దాని గ్రాబ్ రైల్ డిజైన్ కూడా చక్కగా ఉంటుంది. మొత్తం మీద, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి ఓ అద్భుతమైన స్కూటర్‌గా ఉండి, మంచి యూత్‌ఫుల్ మరియు ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మీరు కూడా ఇలాంటి స్టైలిష్ స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే, ఇది ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

సింపుల్ వన్ ఫీచర్లు

సింపుల్ వన్ అషామాషీ ఎలక్ట్రిక్ స్కూటర్ కాదు, ఇందులోని ఫీచర్లను గమనిస్తే మీరు కూడా మాతో ఏకీభవిస్తారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని హెడ్‌ల్యాంప్, డేటైమ్ రన్నింగ్ లైట్లు, టర్న్ ఇండికేటర్లు మరియు టెయిల్ ల్యాంప్ అన్నీ కూడా LED లైట్లే. సింపుల్ వన్ లో చాలా ఆసక్తికరంగా కనిపించే స్విచ్ గేర్‌ ఉంటుంది. డిజైన్ పరంగా ఈ స్విచ్‌లు చక్కగా కనిపిస్తాయి. ఏదేమైనప్పటికీ, వీటి నాణ్యత మరియు ఫిట్ అండ్ ఫినిషింగ్ ఉత్పత్తికి సిద్ధంగా ఉండటానికి ఇంకా కొన్ని మైళ్ల దూరంలో ఉన్నట్లు అనిపిస్తుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

మేము టెస్ట్ రైడ్ చేసింది ప్రీ-ప్రొడక్షన్ వెర్షన్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని మెకానికల్‌లు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి, అయితే ఈ స్కూటర్ తయారీలో ఉపయోగించిన ప్లాస్టిక్‌లు మరియు బాడీ ప్యానెల్‌ల నాణ్యత ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉందని చెప్పాలి. అలాగే, దీని స్విచ్‌లు ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి. బహుశా, తుది ప్రొడక్షన్ మోడల్‌లలో కంపెనీ వీటి నాణ్యతను మరింత రెట్టింపు చేసే అవకాశం ఉంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

ఇక ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే, స్కూటర్ హ్యాండిల్ బార్ పై మధ్యలో అమర్చి పెద్ద 7 ఇంచ్ టచ్‌స్క్రీన్, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అనేక ఫీచర్లను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ యూనిట్ యొక్క టచ్ ఇంటర్ఫేస్ రెస్పాన్స్ చాలా బాగుంది, ఎక్కడా ల్యాగ్ అనిపించలేదు. మేము నడిపిన స్కూటర్‌లు సాఫ్ట్‌వేర్ యొక్క బీటా వెర్షన్‌ను కలిగి ఉన్నాయి, అంటే దీని అర్థం ఇవి పూర్తిస్థాయి ఫీచర్లను కంట్రోల్ చేయడానికి అందుబాటులో లేవు.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

కానీ, కస్టమర్లకు విక్రయించబడే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లలోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అనేక రకాల సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇందులో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్లు, యావరేజ్ స్పీడ్ ఇండికేటర్, రేంజ్ డిస్‌ప్లే మరియు బ్యాటరీ ఛార్జింగ్ స్థితి వంటి చాలా అంశాలు హోమ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల నుండి సింపుల్ వన్ ని వేరు చేసే మరొక ఆసక్తికరమైన ఫీచర్ ఏంటంటే, ఇందులో బ్యాటరీ హెల్త్ ప్రదర్శించబడుతుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

ఈ బ్యాటరీ హెల్త్ మానిటర్ ఫీచర్ స్కూటర్ లో అమర్చిన బ్యాటరీ ప్యాక్ యొక్క ఆరోగ్య స్థితిని ప్రదర్శిస్తుంది మరియు ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్‌గా ఉంటుంది. బ్యాటరీ ప్యాక్‌పై శ్రద్ధ అవసరమా లేదా అని నిర్ణయించడంలో ఈ ఫీచర్ రైడర్‌కు సహాయపడుతుంది. బ్యాటరీ ప్యాక్‌లో థర్మల్ రన్‌అవే ఉన్నట్లయితే ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

సింపుల్ వలన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని టచ్‌స్క్రీన్ రైడ్ మోడ్‌లను కూడా ప్రదర్శిస్తుంది మరియు దీనిని బ్లూటూత్, వై-ఫై టెక్నాలజీతో మీ స్మార్ట్‌ఫోన్‌కి జత చేయవచ్చు. సింపుల్ ఎనర్జీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మ్యాప్‌మైఇండియాతో లోడ్ చేసింది, ఇది నావిగేషన్‌ను సులభంగా యాక్సెస్ చేయడానికి సహకరిస్తుంది. కనెక్ట్ చేయబడిన ఫీచర్‌లలో రిమోట్ యాక్సెస్, జియో-ఫెన్సింగ్, OTA అప్‌డేట్‌లు, సేవ్ మరియు ఫార్వార్డింగ్ మార్గాలు, రైడ్ స్టాటిస్టిక్స్, రిమోట్ లాకింగ్ వంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

ఇందులో మరొక ఉపయోగకరమైన ఫీచర్ ఏమిటంటే, రైడర్ వాహన రిజిస్ట్రేషన్ పేపర్లు, డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ పేపర్లు మొదలైన ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా ఇందులో డిజిటల్ గా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో క్రూయిజ్ కంట్రోల్ మరియు రివర్స్ మోడ్‌ ఫీచర్ కూడా ఉంటుంది. క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ సాయంతో రైడర్ థ్రోటల్ ను ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే నిర్ధిష్ట వేగంతో స్కూటర్ ను నడపవచ్చు. అలాగే, రివర్స్ మోడ్ సాయంతో ఈ స్కూటర్ ను వెనుకకు కూడా రైడ్ చేయవచ్చు.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

ఇలాంటి అధునాతన ఫీచర్లన్నీ మీకు మార్కెట్లో లభించే ఇతర సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అందుబాటులో ఉండవు. కాబట్టి, ఈ జాబితాను చూస్తుంటే, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫీచర్ల కొరత లేదని మీరు గ్రహించవచ్చు. నిజానికి, సింపుల్ ఎనర్జీ ఈ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. మేము కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉత్పత్తికి సిద్ధంగా ఉండే ప్లాస్టిక్‌లు మరియు సాఫ్ట్‌వేర్‌లను పరిశీలించడానికి ఈ స్కూటర్ల డెలివరీ సమయం కోసం వేచి చూస్తున్నాము.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

సింపుల్ వన్ పెర్ఫార్మెన్స్ మరియు స్పెసిఫికేషన్స్

సింపుల్ వన్ రివ్యూలో ఇదే అత్యంత ఆసక్తికరమైన విషయం. సింపుల్ వన్ పెర్ఫార్మెన్స్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, ఇది అద్భుతమైన మరియు ఆహ్లాదకరమైన రైడ్‌ను అందించే బెస్ట్ టార్కీ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో పరిమాణంలో చిన్నగా ఉండి, ఎక్కువ టార్క్ ను ఉత్పత్తి కాంపాక్ట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. సింపుల్ ఎనర్జీ ఈ ఎలక్ట్రిక్ మోటార్ అత్యధిక టార్క్-సైజ్ నిష్పత్తిని కలిగి ఉందని పేర్కొంది. మిగతా స్కూటర్ల మాదిరిగా ఇది హబ్ మౌంటెడ్ మోటార్ కాదు. ఈ మోటర్ స్కూటర్ మధ్యలో అమర్చబడి ఉంటుంది మరియు బెల్ట్ డ్రైవ్ సాయంతో వెనుక చక్రాన్ని నడుపుతుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

గత సంవత్సరం సింపుల్ ఎనర్జీ తమ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చైన్ డ్రైవ్‌తో నడిచే యూనిట్‌గా పరిచయం చేసింది మరియు ఆ సయమంతో ఈ విషయం చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, ఎలక్ట్రిక్ టూవీలర్లలో ఇప్పటి వరకూ చైన్ డ్రైవ్‌తో నడిచే టూవీలర్ రాలేదు. ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు ప్రమాణం అయిన బెల్ట్‌కు బదులుగా చైన్‌తో సింపుల్ వన్‌ను అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే, గత కొన్ని నెలల అభివృద్ధి దశలో, కొనుగోలుదారులు చైన్‌కు బదులుగా తక్కువ-మెయింటెనెన్స్ బెల్ట్ డ్రైవ్‌ను కోరుకుంటున్నారని సింపుల్ ఎనర్జీ గుర్తించి. అందుకే, ఇప్పుడు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బెల్ట్ డ్రైవ్‌ను కలిగి ఉంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అమర్చినన ఎలక్ట్రిక్ మోటారు 4.5kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది, అయితే దీని గరిష్ట శక్తి 8.4kW వద్ద రేట్ చేయబడింది. ఈ మోటర్ 72Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ గణాంకాలతో సింపుల్ వన్ అద్భుతమైన పనితీరును కలిగి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 2.77 సెకండ్లలోనే గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ ఫిగర్‌తో ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

మేము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్సిలరేషన్ టెస్ట్ కూడా చేశాము. దీనిని గంటకు 60, 80 మరియు 100 కిలోమీటర్ల వేగంతో నడిపి చూశాము. సింపుల్ వన్ చాలా సులువుగా ఈ పరీక్షలన్నింటిని అధిగమించింది. మేము సోనిక్ మోడ్‌లో దాని గరిష్ట పనితీరును 30 నిమిషాల పాటు నడిపి చూశాము మరియు ఈ మోడ్‌లో సింపుల్ వన్ ఎక్కడా మందగించే సంకేతాలను చూపించలేదు మరియు తక్కువ పనితీరు మోడ్‌కు మారాలని కోరుకోలేదు.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

సింపుల్ వన్ రైడ్ మోడ్‌ల గురించి చెప్పాలంటే, ఇందులో ఎకో, రైడ్, డాష్ మరియు సోనిక్ అనే నాలుగు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ రైడ్ మోడ్‌లు పనితీరు మరియు బ్యాటరీ రేంజ్‌లో భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తాయి. అదే సమయంలో ఇవి సింపుల్ వన్‌ను అత్యంత ఆచరణాత్మక ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా కూడా చేస్తాయి. ఎకో మోడ్‌లో, సింపుల్ వన్ 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. అయితే, ఈ మోడ్‌‌లో దాని పనితీరు గంటకు 50 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేయబడి ఉంటుంది. ఇది రైడర్ స్కూటర్ నుండి గరిష్ట రేంజ్‌ను కోరుకున్నప్పుడు మాత్రమే ఉపయోగించబడే రైడ్ మోడ్.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

ఇకపోతే, రెండవ మోడ్ 'రైడ్', ఇందులో బ్యాటరీ రేంజ్ 160 కిలోమీటర్లకు పడిపోతుంది, కానీ గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లకు పెరుగుతుంది. సింపుల్ ఎనర్జీ ప్రకారం, ఇది మీ రోజువారీ ప్రయాణాలలో అర్బన్ కమ్యూటింగ్ కోసం ఉపయోగించబడే మోడ్. డాష్ మోడ్‌లో, పనితీరు గణనీయంగా పెరుగుతుంది. కానీ బ్యాటరీ రేంజ్ 120 కిలోమీటర్లకు పడిపోతుంది. అయితే, డాష్ మోడ్ లో గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లకు పెరుగుతుంది. సాధారణంగా, ఇలాంటి మోడ్‌ను మన ప్రతిరోజూ ఉపయోగానికి అనుకూలంగా ఉంటుంది. ఇవి పవర్ మరియు రేంజ్‌ల మధ్య మంచి బ్యాలెన్స్‌ను అందిస్తుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

ఇక చివరి రైడ్ మోడ్, అధిక పనితీరును అందించే సోనిక్ మోడ్‌. ఇందులో గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లుగా ఉంటుంది మరియు బ్యాటరీ రేంజ్ కేవలం 85 కిలోమీటర్లుగా మాత్రమే ఉంటుంది. ఈ మోడ్‌లో యాక్సిలరేషన్ పనితీరుగా ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది మరియు మెరుపు వేగంతో పరుగులు తీస్తున్నట్లు అనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ డిస్‌ప్లేలో టాప్ స్పీడ్ 100 కెఎంపిహెచ్ ఎంత త్వరగా వస్తుందో చూస్తే, మీరు ఖచ్చితంగా వావ్ అని ఫీల్ అవుతారు.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

సింపుల్ వన్ ప్రత్యేకమైన డ్యూయెల్ బ్యాటరీ సెటప్ ను కలిగి ఉంటుంది. ఇది 3.3kWh సామర్థ్యంతో ఉండే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్‌ని మరియు 1.5kWh సామర్థ్యంతో ఉండే తొలగించగల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. అంటే, ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌లను కలిపినట్లయితే, వినియోగదారులు మొత్తంగా 4.8kWh సామర్థ్యాన్ని పొందుతారు. అంతేకాకుండా, తొలగించగల బ్యాటరీని కలిగి ఉండే సౌలభ్యం మరియు స్థిర బ్యాటరీ యొక్క విశ్వసనీయత రెండింటినీ ఒకే సమయంలో పొందుతారు. ఆసక్తికర విషయం ఏంటంటే, తొలగించగల చిన్న బ్యాటరీ ప్యాక్ లేకపోయినప్పటికీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పనిచేయగలదు.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

తొలగించగల బ్యాటరీ ప్యాక్ సీటు క్రింది భాగంలో చక్కగా ఇమిడిపోతుంది మరియు సీటు మూసివేసినప్పుడు బ్యాటరీని లాక్ చేసే సెక్యూరిటీ వ్యవస్థను కూడా కలిగి ఉంటుంది. ఇది ఒక సాధారణ మెకానిజమే అయినప్పటికీ, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సీటు క్రింది భాగంలో ఈ రిమూవబల్ బ్యాటరీ ప్యాక్ ఉన్నప్పటికీ, ఇందులో ఇంకా 30 లీటర్ అండర్‌సీట్ స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. ఇందులో ఫుల్-సైజ్, ఫుల్-ఫేస్ హెల్మెట్‌ని ఉంచడానికి సరిపడేంత స్థలం ఉంటుంది లేదా మీతో పాటు మరొక స్పేర్ బ్యాటరీ ప్యాక్‌ని తీసుకెళ్లడానికి కూడా ఇది సహాయపడుతుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

స్కూటర్‌లో ఉండే ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌లు (3.3kWh ఫిక్స్డ్ బ్యాటరీ మరియు 1.5kWh రిమూవబల్ బ్యాటరీ) కాకుండా మీరు మరొక రిమూవబుల్ బ్యాటరీని కూడా కొనుగోలు చేయాలనుకుంటే, మీరు అదనంగా రూ. 30,000 చెల్లించి మూడవ బ్యాటరీ ప్యాక్‌ని కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ అదనపు బ్యాటరీ ప్యాక్ సాయంతో మొత్తం బ్యాటరీ సామర్థ్యాన్ని 6.4kWh వరకు పెంచుకోవచ్చు. ఇంత పెద్ద బ్యాటరీ సెటప్ మరియు ఎకో రైడ్ మోడ్‌ సాయంతో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై గరిష్టంగా పూర్తి చార్జ్ పై 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

సింపుల్ వన్‌ బ్యాటరీని ఛార్జ్ చేయడం అంత సంక్లిష్టమైన పనేమీ కాదు. స్టాండర్డ్ ఛార్జర్‌ని ఉపయోగించి, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నాలుగు గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, సింపుల్ ఎనర్జీ కొనుగోలుదారులకు కంపెనీ ఆప్షనల్ 1.4kW ఫాస్ట్ ఛార్జర్‌ను రూ. 15,499 ధరకే విక్రయిస్తోంది. ఈ ఫాస్ట్ చార్జర్ సాయంతో రెండు బ్యాటరీ ప్యాక్‌లను కేవలం 2 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం రిమూవబల్ బ్యాటరీని మాత్రమే పూర్తిగా చార్జ్ చేయాలంటే, 75 నిమిషాల సమయం పడుతుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

సింపుల్ వన్ పై రైడింగ్ అనేది మేము ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహనాలతో పొందిన అత్యంత ఆహ్లాదకరమైన అనుభవాలలో ఒకటి. ఇది ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు మోనోషాక్‌ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సస్పెన్షన్ సెటప్ దాదాపుగా పరిపూర్ణంగా ఉందని చెప్పొచ్చు. మేము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తారు రోడ్లపై మాత్రమే నడిపాము. తారు రోడ్డుపై ఈ స్కూటర్ చాలా సున్నితమైన రైడ్ అనుభూతిని అందిస్తుంది. అయితే, గుంతలు కలిగిన రోడ్లపై ఈ సస్పెన్షన్ పనితీరు ఎలా ఉంటుందనే విషయంపై మేము వ్యాఖ్యానించలేము, కానీ ఇది అక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాము.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ నిజంగా స్కూటర్ హ్యాండిల్ చేసే విధానంతో మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. మేము దీనిని రైడ్ చేసిన ప్రాంతంలో చాలా కార్నర్స్ ఉన్నాయి, అలాంటి బలమైన కార్నర్స్‌లో కూడా దీని రైడ్ హ్యాండ్లింగ్ చాలా మృదువుగా అనిపించింది మరియు రైడర్ విశ్వసనీయతను ఇది ఎక్కడా దెబ్బతీయలేదు. ఈ స్కూటర్ బ్రేకింగ్ పనితీరు కూడా చాలా బాగుంది. ముందువైపు 200 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 190 మిమీ డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఈ బ్రేక్ కాలిపర్‌ను బ్రెంబో బ్రాండ్ ప్రత్యేకంగా సింపుల్ వన్ కోసం అభివృద్ధి చేసింది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఏబిఎస్ ఫీచర్ లేదు, అయినప్పటికీ మేము రైడ్ చేసిన స్కూటర్‌లలో ఉత్తమమైన బ్రేక్‌లు కలిగిన వాటిలో సింపుల్ వన్ కూడా ఒకటి. సింపుల్ వన్ కేవలం సీరియర్ రైడ్ కోసం మాత్రమే కాకుండా ఫన్ రైడ్‌ను కోరుకునే వారిని కూడా ఎక్కడా నిరాశపరచదు. ఇందులోని బ్రేక్‌లు థ్రోటల్‌ను పూర్తిగా కట్ చేయవు. చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలలో ఎక్కువగా కోరుకుంటున్న అప్‌గ్రేడ్ కూడా ఇదే. సాధారణగం, ఈవీలో బ్రేక్ వేస్తే, థ్రోటల్ కట్ అయి ఎలక్ట్రిక్ స్కూటర్ స్పీడ్ తిరిగి జీరో నుండి ప్రారంభం అవుతుంది. కానీ, సింపుల్ వన్ విషయంలో అలా జరగదు. కాబట్టి, ఇది ఖచ్చితంగా ఈవీ ప్రియులను ఆకట్టుకుంటుంది. మొత్తం మీద, సింపుల్ వన్ రైడ్ చేయడానికి ఆహ్లాదకరమైన ఓ చక్కటి ఎలక్ట్రిక్ స్కూటర్.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

సింపుల్ వన్ వేరియంట్లు మరియు కలర్ ఆప్షన్లు

సింపుల్ ఎనర్జీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో కస్టమర్లను అనవసరమైన గందరగోళానికి గురిచేయకుండా, దీనిని కేవలం ఒకే ఒక స్టాండర్డ్ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం, మార్కెట్లో దీని ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఒకవేళ, మీరు ఇందులో ఎక్కువ రేంజ్ కోసం అదనపు బ్యాటరీని కూడా కొనుగోలు చేయాలనుకుంటే, మీకు రూ. 30,000 అదనంగా ఖర్చు అవుతుంది మరియు దీని ధర రూ. 1.40 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

సింపుల్ వన్‌ కలర్ ఆప్షన్లు:

- నమ్మ రెడ్

- ఆజూర్ బ్లూ

- బ్రేజెన్ బ్లాక్

- గ్రేస్ వైట్

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ: పేరులోనే సింపుల్.. మిగతా విషయాల్లో కాదు..

చివరిగా ఏం చెబుతారు?

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విషయంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కునే ప్రధాన సమస్య ఏంటంటే వాటి విశ్వసనీయత. అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు కంపెనీ చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఉండవు. కొన్ని నాణ్యతలో తక్కువగా ఉంటే మరికొన్ని రేంజ్ విషయంలో తక్కువగా ఉంటాయి. ఇంకొన్ని రేంజ్ విషయంలో విఫలమైతే, మరికొన్ని రైడ్ మరియు హ్యాండ్లింగ్‌ విషయంలో తక్కువగా అనిపిస్తాయి. అయితే, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం పైన తెలిపిన అన్ని అంశాల్లోనూ ది బెస్ట్ ను అందిస్తుంది. ఈ స్కూటర్‌ని టెస్ట్ రైడ్ చేసిన మీరు కూడా ఇదే విషయం చెబుతారు.

Most Read Articles

English summary
Simple one electric scooter test ride review design specs performance features battery range
Story first published: Friday, July 22, 2022, 17:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X