బెంగుళూరులో ట్రైయంప్ తొలి షోరూమ్ ప్రారంభం
ఇటీవలే భారత మార్కెట్లోకి ప్రవేశించిన ప్రముఖ బ్రిటీష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్, దేశీయ విపణిలో తమ తొలి డీలర్‌షిప్ కేంద్రాన్ని కర్ణాటక రాజధాని బెంగుళూరులో ప్రారంభించింది. బెంగుళూరుకు చెందిన కీర్తి మోటార్స్ ఈ డీలర్‌షిప్‌ను నిర్వహిస్తోంది. బెంగుళూరులో ఈ డీలర్‍షిప్ సెయింట్ మార్క్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేశారు. కీర్తి మోటార్స్ ట్రైయంప్ డీలర్‌షిప్ సేల్స్‌తో పాటుగా సర్వీస్ మరియు స్పేర్ పార్ట్‌లను అలాగే ట్రైయంప్ బ్రాండెడ్ యాక్ససరీలు, రైడ్ గేర్‌లను కూడా ఆఫర్ చేస్తుంది.
ఇది కూడా చదవండి: ట్రైయంప్ మోటార్‌సైకిళ్ల కొనుగోలుకు హెచ్‌డిఎఫ్‌సి లోన్స్
ట్రైయంప్ గడచిన నవంబర్ నెలాఖరులో భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించి, 10 కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. ఇందులో ఆరు మోడళ్లను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలను దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేయనున్నారు. అవి - ట్రైయంప్ బోన్నెవిల్లె, ట్రైయంప్ బోన్నెవిల్లే టి100, ట్రైయంప్ డేటోనా 675ఆర్, ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్, ట్రైయంప్ స్పీడ్ ట్రిపుల్, ట్రైయంప్ త్రక్స్టన్. మార్కెట్లో వీటి ధరలు రూ.5.7 లక్షల నుంచి రూ.11.4 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ట్రైయంప్ మోటార్‌సైకిళ్ల మోడళ్లు, ధరలు మరియు ఇతర వివరాలు
మిగిలిన నాలుగు మోడళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన బైక్‌లను ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. అవి - ట్రైయంప్ రాకెట్ 3 రోడ్‌స్టర్, ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్, ట్రైయంప్ టైగర్ 800 ఎక్స్‌సి, ట్రైయంప్ థండర్‌బర్డ్ స్ట్రోమ్. వీటి ధరలు రూ.20 లక్షల వరకు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








