ఇండియన్ టూ వీలర్ సెగ్మెంట్లో కాషాయ కంపెనీ ఆధిపత్యం

Written By:

ఇండియన్ రేసింగ్ ప్రియుల మదిని దోచుకున్న బైకుల తయారీ సంస్థల్లో కెటిఎమ్ మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. సెగ్మెంట్ వారీగా పోటీని అణచివేయడానికి ప్రతి ఇంజన్ సెగ్మెంట్లో కూడా తమకంటూ ఓ మోడల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోందనడానికి ఈ కథనం నిదర్శనం. స్పోర్టివ్ శైలిలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని పధిలం చేసుకున్న కెటిఎమ్ ఇప్పుడు లైనప్ విస్తరణ మీద దృష్టి పెట్టి 250రేంజ్ ఓ కొత్త మోటార్ సైకిల్‌ను ఇండియాకు పరిచయం చేసింది.

నూతన కెటిఎమ్ డ్యూక్ 250 మోటార్ సైకిల్ గురించి పూర్తి వివరాలు....

గతంలో 199సీసీ సామర్థ్యం గల డ్యూక్ 200 మరియు 373సీసీ సామర్థ్యం గల డ్యూక్ 390 మోటార్ సైకిళ్లు అందుబాటులో ఉండేవి. అయితే ఈ రెండింటి మధ్య గ్యాప్‌ను భర్తీ చేయడానికి 250సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌‌తో డ్యూక్ 250ను విపణిలోకి విడుదల చేసింది. డిజైన్, ఇంజన్, ధర మరియు పోటీ వంటి అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఫీచర్లు

కెటిఎమ్ డ్యూక్ 250 ఇంజన్ మరియు డిజైన్ పరంగా పూర్తిగా కొత్త మోడల్. డ్యూక్ 200 మరియు డ్యూక్ 390 ల నుండి కొన్ని ఫీచర్లను సేకరించి ఇందులో అందివ్వడం జరిగింది. ఆరేంజ్ రంగులో ఉన్న స్వింగ్ ఆర్మ్ కలిగి ఉన్న ఇది 200 నుండి డిజైన్ మరియు 390 నుండి అదే కొలతల్లో ఉన్న ఇంధన ట్యాంక్, అవే బాడీ డీకాల్స్ అయితే కెటిఎమ్ బ్యాడ్జింగ్ పేరును రివైజ్ చేయడం జరిగింది.

డ్యూక్ 390 లోని అతి ముఖ్యమైన టిఎఫ్‌టి కలర్ డిస్ల్పే ఇందులో రాలేకపోయింది. అయితే డ్యూక్ 200లో ఉన్నటువంటి ఆరేంజ్ బ్యాక్ లైట్ ఉన్న ఎస్‌సిడి కన్సోల్ కలదు. డ్యూక్ 390లో ఉన్నటువంటి ఎల్ఇడి హెడ్ ల్యాంప్ కలదు.

సాంకేతిక వివరాలు

కెటిఎమ్ ఇండియా లైనప్‌లో గతంలో 200 మరియు 390 శ్రేణిలో ఉన్న ఇంజన్‌లు మాత్రమే ఉండేవి. వీటి సరసన 250 వచ్చి చేరింది. సరికొత్త డ్యూక్ 250లో 248సీసీ సామర్థ్యం గల లిక్విడ్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

దీనికి అనుసంధానం చేసిన 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే గరిష్ట 31బిహెచ్‌పి పవర్ మరియు 24ఎన్ఎమ్ టార్క్ వెనుక చక్రానికి సరఫరా అవుతుంది.

నూతన సస్పెన్షన్ సిస్టమ్

కెటిఎమ్ తమ డ్యూక్ 250 లో ముందు వైపున ఒపెన్ క్యాడ్రిడ్జ్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ సస్పెనషన్ సిస్టమ్ అందించింది. ఒపెన్ క్యాడ్రిడ్జ్ సస్పెన్షన్ ద్వారా రైడర్లు సులభంగా మెయింటెన్ చేయగలరు. ఎక్కువ కాలం మన్నిక గల నాణ్యమైన ఈ ఫ్రంట్ ఫోర్క్ సరసమైన ధరకు లభిస్తుంది.

బ్రేకులు

సస్పెన్షన్ సిస్టమ్‌ను డ్యూక్ 390 మోడల్ నుండి సేకరించినుప్పటికీ బ్రేకుల విషయంలో ఇది సాధ్యం కాలేదు. డ్యూక్ 390లో ఉన్న 320ఎమ్ఎఎమ్ డిస్క్ బ్రేక్ కాకుండా ఇందులో 300ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ అందివ్వడం జరిగింది. వెనుక చక్రానికి కూడా ఇదే తరహా బ్రేకు కలదు.

యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్

డ్యూక్ 250 లో ఏబిఎస్ విశయంలో డ్యూక్ 250 ఓ మెట్టు క్రిందకు దిగాల్సి వచ్చింది. అయితే కెటిఎమ్ ప్రతినిధులు దీని విడుదల వేదిక మీద మాట్లాడుతూ, శక్తివంతమైన డ్యూక్ 390 లో దీని అవసరం తప్పనిసరి, కాని డ్యూక్ 250 మోడల్‌లో ఏబిఎస్ అవసరం లేదని చెప్పుకొచ్చారు.

ధర

కెటిఎమ్ ఇండియా డ్యూక్ 250 మోడల్‌కు ధరను నిర్ణయించడంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పోటీదారులను ఎదుర్కుంటూనే 200 మరియు 390 మధ్య గల స్థానాన్ని భర్తీ చేయగలిగిలిగే విధంగా కెటిఎమ్ నిర్ణయం తీసుకుంది. కెటిఎమ్ డ్యూక్ 250 ధర రూ. 1.73 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

అద్బుతం: లీటర్ నీటితో 300 మైళ్ల మైలేజ్
నీటితో నడిచి, నీటి ఆవిరిని పొగలా వెదజల్లే మోటార్ సైకిల్‌ గురించి ఎప్పుడైనా విన్నారా...? ఓక్క లీటర్ నీటితో 300 మైళ్ల మైలేజ్ ఇవ్వగిలిగే ఈ బైకు గురించి పూర్తి వివరాలు....

కెటిఎమ్ కు చెందిన అన్ని రకాల మోడళ్ల పోటోల కోసం.... 2017 కెటిఎమ్ ఆర్‍‌‌సి 390 ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.

 

English summary
2017 KTM Duke 250: All You Need To Know About India's New Orange Racer
Please Wait while comments are loading...

Latest Photos