వొళ్లంతా లైట్లు ఒక్క కారులో 41,999 ల ఎల్ఇడి లైట్లు

Written By:

కారును కొనుగోలు చేసే ముందు ప్రతి ఒక్కరూ ఏ కలర్ కారును ఎంచుకుందాం అనే డైలమాలో ఉంటారు. అయితే సందర్భాన్ని బట్టి కారు కలర్ ను మార్చుకునే అవకాశాన్ని లెక్సస్ కల్పిస్తోంది. సరికొత్త లెక్సస్ లిట్ ఈస్ (LIT IS)సెడాన్ కారులో ఈ అవకాశాన్ని కల్పించింది. కలర్, డిజైన్ మరియు యానిమేషన్ పరంగా మీకు నచ్చిన రూపంలో ఈ కారు బాడీ కలర్‌ను మార్చుకోవచ్చు.

సందర్భాన్ని బట్టి కారు బాడీ కలర్ మార్చుకోవడం చాలా కష్టం అలాంటి వారికి సులభంగా ఉండేందుకు బాడీ నిండా 41,999 ఎల్ఇడి లైట్ల అలంకరణ ఆటోమేటిక్‌గా కారు బాడీ కలర్ మార్చుకునే అవకాశం కలిగింది.

ఈ కారును ఇంగ్లాడ్ ఆర్టిస్ట్ డ్యువా లిప్సా మ్యూజిక్ వారి వీడియో సాంగ్ అయినటువంటి బి ద వన్ అనే వీడియోలో ఉపయోగించారు. వొంటి నిండా ఎల్ఇడి లైట్లతో నిండిన లిట్ ఈస్ కారును ఇక్కడ గల వీడియో సాంగ్ లో గుర్తించవచ్చు.

లెక్సస్ మరియు వెవో భాగస్వామ్యంతో రూపొందించడం జరిగింది. టెక్నాలజీ మరియు డిజైన్‌కు సంభందించిన వర్క్ ఆఫ్ ఆర్ట్ వేదిక మీద లెక్సస్ ఈ లిట్ ఈస్ (LIT IS) కారును ప్రదర్శించింది.

లెక్సస్ కారు బాడీ మీద అమర్చిన అన్ని ఎల్ఇడి లైట్లను స్క్రీన్ రూపంలో అమర్చడం జరిగింది. తద్వారా విభిన్నమైన యానిమేషన్‌ల ఆధారంగా మానవ నడవడిక మరియు మ్యూజిక్ ఆధారంగా రంగులను దానంతట అదే మార్చుకుంటుంది.

కారు బాడీ మీద అమర్చిన మొత్తం 41,999 ఎల్ఇడి లైట్లు ప్రకాశించినపుడు 175,000 లుమెన్స్ విడుదలవుతుంది. వీటి కాంతి సుమారుగా సగ మైళు వరకు స్పష్టంగా కనిపిస్తుంది.

బాడీ మొత్తం ఎల్ఇడి లైట్లు గల ఈ కారులో మరో మూడు మోడ్స్ ఉన్నాయి. ఇందులో మొదటిది వ్యక్తులు ఈ కారుకు సమీపంగా వచ్చినపుడు విభిన్నమైన రంగుల్లో ఈ లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతాయి.

ఇందులోని అట్రాక్టివ్ మోడ్ ద్వారా రంగులమయమైన గ్రాఫిక్స్‌ ఏర్పడటానికి మరియు మ్యూజిక్ విజ్ మోడ్ ద్వారా సంగీతానికి తగిన విధంగా ఎల్ఇడి యానిమేషన్‌ బాడీ స్క్రీన్ మీద ప్లే అవుతుంది.

ఒంటి నిండా ఎల్ఇడి లైట్లు గల కారు

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Meet The New Lexus LIT IS Covered In 41,999 LEDs
Please Wait while comments are loading...

Latest Photos