పర్పుల్ పెయింట్ స్కీమ్‌లో బుసలు కొడుతున్న బిఎమ్‌డబ్ల్యూ

By Anil

పర్పుల్ ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన పేరు ఇది, ఇక మన తెలుగు వాళ్లకు దీనిని పరిచయం చేయాలంటే సింపుల్‌గా వంగపువ్వు రంగు లేదా ఊదా అంటే చాలు. ఈ మధ్య పర్పుల్ రంగు కూడా మంచి ప్రాచుర్యం పొందుతోంది. ఎంతలా అంటే సౌకర్యవంతమైన కార్లను తయారు చేసే ప్రపంచ దిగ్గజ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను ఈ రంగుల్లో తయారుచేస్తున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్

పర్పుల్ రంగులో హొయలొలుకుతున్న ఈ మోడల్ పేరు ఐ8 హైబ్రిడ్. బిమ్‌డబ్ల్యూ దీనిని ఉత్పత్తి చేస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్

బిఎమ్‌డబ్ల్యూ తమ పర్పుల్ రంగులో ఉన్న మొదటి ఐ8 హైబ్రిడ్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబు ధాబిలో బిమ్‌డబ్ల్యూ డీలర్‌కు డెలివరీ ఇచ్చింది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్

అత్యంత ప్రకాశవంతమైన ఊదా రంగుతో పెయింట్ చేయబడిన ఈ స్పోర్ట్స్ కారు ఎంతో అందంగా ఉంది. దీని మీద బిఎమ్‌డబ్ల్యూ డిజైనింగ్ గీతలున్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్

దీనిని చూస్తే ప్రతి వ్యక్తి ఎయిర్ ఇంటేకర్ నుండి హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, క్రేజీ డోర్ల మీదుగా కస్టమైజ్ చేసిన స్పాయిలర్ వరకు పూర్తి దృష్టిని సారిస్తాడు.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్

వెనుక వైపున ఉన్న చిన్న స్పాయిలర్ విషయానికి వస్తే విమానాలకు చివర్లో అందించే చిన్న రెక్క తరహాలో మనం ఈ ఫోటోలో గమనించవచ్చు. ఈ స్పాయిలర్‌ను జర్మనీ కస్టమైజేషన్ సంస్థ AC Scnitzer డిజైన్ చేసి అందించింది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్

జర్మనీకి చెందిన కస్టమైజేషన్ కంపెనీ AC Scnitzer స్పాయిలర్‌తో పాటుగా ముందు వైపున బంపర్ క్రింది వైపున ఉన్న కార్బన్ ఫైబర్ ప్లాస్టిక్ కవర్లను అందించింది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్

చక్రాల పరంగా 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను అందించింది. ప్రస్తుతం ఉన్న బాడీ కలర్‌కు వీటి జోడింపు మరింత ఆకర్షణను తీసుకువచ్చింది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్

ఇంటీరియర్ పరంగా బిఎమ్‌డబ్ల్యూ అందించిన ఫీచర్లు మరియు బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో ఏ మార్పు చోటు చేసుకోలేదు.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్

సాంకేతికంగా కూడా ఇందులో ఏ విధమైన మార్పులు చోటు చోసుకోలేదు. అయితే 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న 3-సిలిండర్ల ఇంజన్‌ను అందించారు.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారులోని ఇంజన్‌కు ఎలక్ట్రిక్ మోటార్‌ను అనుసంధానం చేశారు. ఇందులోని ఇంజన్‌ వ్యవస్థకు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ సంయుక్తంగా 5,800ఆర్‌పిఎమ్ వేగం వద్ద 357బిహచ్‌పి పవర్ మరియు 3,700ఆర్‌పిఎమ్ వద్ద 570ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్

  • ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్
  • అక్కినేని నాగార్జున 57 వ పుట్టిన రోజు కానుకగా బిఎమ్‌డబ్ల్యూ
  • నాన్నకు ప్రేమతో డైరెక్టర్‌కు బిఎమ్‌డబ్ల్యూఎక్స్3 గిఫ్ట్

Most Read Articles

English summary
Read In Telugu: Bespoke Twilight Purple BMW i8 Is Absolutely Bonkers
Story first published: Wednesday, October 5, 2016, 17:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X