2016 పండుగ సీజన్ కోసం ఫియట్ మోటార్స్ ఆఫర్ల వెల్లువ

Written By:

ఫియట్ ఇండియాకు దేశీయంగా ఆఫర్లు కల్పించడానికి మరో అవకాశం వచ్చింది. అదేనండి 2016 పండుగ సీజన్. ఇప్పటికే ప్రారంభమైన పండుగ సీజన్ కోసం వివిధ సంస్థలు తమ ఉత్పత్తుల మీద ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించారు. అందులో భాగంగా ఆఫర్లను ప్రకటించడంలో ఎల్లప్పుడూ ముందుండే ఫియట్ ఈ సారి ఉత్తమ డిస్కౌంట్లను మరియు తగ్గింపును ప్రకటించింది.

ఇటాలియన్ ఆధారిత కార్ల తయారీ సంస్థ ఫియట్ దేశీయ మార్కెట్లో నాలుగు ఉత్పత్తుల మీద 2016 ఏడాదికి సంభందించిన ఆఫర్లను ప్రకటించింది.

ఈ ఆఫర్ల సందర్బంగా వినియోగదారులు గరిష్టంగా 85,000 రుపాయల వరకు లాభాలను పొందే అవకాశం ఉంది.

ఫియట్ పుంటో ఎవో హ్యాచ్‌బ్యాక్ ను 5.86 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా అందిస్తున్నారు. దీని మీద గరిష్టంగా 60,000 రుపాయల ఆఫర్లను అందిస్తున్నారు.

ఫియట్ పుంటో హ్యాచ్‌బ్యాక్‌లోని పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్ల మీద ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఫియట్ లీనియా సెడాన్ మీద గరిష్టంగా 60,000 రుపాయల విలువైన ఆఫర్లను ప్రకటించింది ఫియట్. మరియు లీనియా ప్రారంభ వేరియంట్‌ను 7.82 లక్షలు ఎక్స్ షోరూమ్‌ ధరతో అందిస్తోంది.

ఫియట్ లీనియా లోని క్లాసిక్ సెడాన్‌ మీద గరిష్టంగా 65,000 రుపాయల ఆఫర్లను అందిస్తోంది.

ఫియట్ లైనప్‌లో ఉన్న అవెంచురా క్రాసోవర్ మోడల్ మీద గరిష్టంగా 85,000 రుపాయల ఆర్లను ప్రకటించింది. మరియు దీనిని 7.78 లక్షలు ప్రారంభ ధర ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా అందుబాటులో ఉంచింది.

అయితే ఫియట్ ఇండియా తమ అబర్త్ శ్రేణి ఉత్పత్తుల మీద ఏ విధమైన ఆఫర్లను ప్రకటించలేదు. మరియు తాజాగా అందుబాటులో ఉంచిన అర్బన్ క్రాస్ మీద కూడా ఏ విధమైన ఆఫర్లు లేవు అయితే 6.85 లక్షలు ప్రారంభ ధరతో అందుబాటులో ఉంచారు.

  

Read more on: #ఫియట్ #fiat
English summary
Read In Telugu: Fiat India Offering Huge Benefits During 2016 Festive Season
Please Wait while comments are loading...

Latest Photos