ఎకోస్పోర్ట్ మరియు ఎండీవర్ మద్య మరో ఎస్‌యువిని ప్రవేశపెట్టనున్న ఫోర్డ్

Written By:

ఫోర్డ్ ఇండియాలోని ఎస్‌యువిల విషయానికి వస్తే వ్యూహాత్మకమైన ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ఫోర్డ్‌కి మరే సంస్థ కూడా సాటి రాదు. అత్యంత విజయవంతమైన ఎకోస్పోర్ట్ మరియు ఊహించని ధరలకు భారీ ప్యాకేజితో విడుదల చేసిన ఎండీవర్ ఎస్‌యువిలే ఇందుకు నిదర్శనం. అయితే ఈ రెండింటి మధ్య దూరాన్ని తగ్గించడానికి కుగా కాంపాక్ట్ ఎస్‌యువిని విడుదల చేయడానికి ఫోర్డ్ ఇండియా ప్లాన్ చేస్తోంది.

ఫోర్డ్ ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో కుగా కాంపాక్ట్ ఎస్‌యువిని దేశీయంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం దిగుమతి చేసుకుంది. మరియు ఇప్పటికే పలుమార్లు రహస్యంగా పరీక్షించింది కూడా.

కుగా కాంపాక్ట్ ఎస్‌యువిలో ప్రీమియమ్ ఫీల్‌ను పొందేందుకు గాను సరికొత్త బ్లాక్ థీమ్ ఇంటీరియర్‌ను అందించారు. అదునాతన డిజైన్ భాషలో డ్యాష్ బోర్డు‌ని అందించారు.

కుగా కాంపాక్ట్ ఎస్‌యువి పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‍‌లలో రానుంది. ఇందులోని 2-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ గరిష్టంగా 147బిహెచ్‌పి పవర్ మరియు 370ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

అదే విధంగా కుగా కాంపాక్ట్ ఎస్‌యువిలోని 1.5-లీటర్ ఎకో బూస్ట్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 179బిహెచ్‌పి పవర్ మరియు 177ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

కుగా కాంపాక్ట్ ఎస్‌యువిలోని పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లకు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అదే విధంగా పెట్రోల్ వేరియంట్ కుగా అదనంగా 6-స్పీడ్ సెలెక్ట్ షిఫ్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో రానున్నాయి.

ప్రస్తుతం ఫోర్డ్ లైనప్‌లో ఉన్న ఎకో స్పోర్ట్ మరియు ఎండీవర్ ఎస్‌యువిల మధ్య ఉన్న స్థానాన్ని భర్తీ చేయనున్న కుగా కాంపాక్ట్ ఎస్‌యువిలో పుష్-బటన్ స్టార్ట్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు రియర్ ఏ/సి వెంట్‌లతో రానుంది.

ఫోర్డ్ మోటార్స్ భద్రత పరంగా ఈ కుగా కాంపాక్ట్ ఎస్‌యువిలో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ పోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా, మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి అత్యాధునిక ఫీచర్లు రానున్నాయి.

ప్రస్తుతం ఫోర్డ్ ఇండియా ఇంజనీర్లు దీనిని టెస్టింగ్ చేస్తున్నారు. ఇండియన్ ఎస్‌యువి మార్కెట్లోకి 2017 చివరి నాటికి లేదా 2018 ప్రారంభానికి విడుదలయ్యే అవకాశం ఉంది.

ఫోర్డ్ వారి సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యువి కుగా ను 12 లక్షల నుండి 18 లక్షల మధ్య ధరతో ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉండేటట్లు విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

ఫోర్డ్ ఇండియా ఈ కుగా కాంపాక్ట్ ఎస్‌యువిని దేశీయ ఎస్‌యువి సెగ్మెంట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం ఉన్న రెనో డస్టర్, మహీంద్రా ఎక్స్‌యువీ500 మరియు హ్యుందాయ్ టుసాన్ వంటి వాటికి గట్టి పోటీగా నిలవనుంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford India Might Launch Another SUV To Bridge Gap Between EcoSport And Endeavour
Please Wait while comments are loading...

Latest Photos