పుంజుకుంటున్న ఫోర్డ్ ఇండియా అమ్మకాలు

ఫోర్డ్ ఇండియా అమ్మకాల్లో సరికొత్త ఎత్తులను తాకుతోంది. దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులు మొత్తం కలుపుకొని గడిచిన నవంబర్ 2016 లో 21,004 యూనిట్ల విక్రయాలు జరిపింది.

By Anil

అమెరికా ఆధారిత ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియన్ మార్కెట్లో రోజురోజుకీ తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. అందుకు నిదర్శనం గత నవంబర్ 2016 అమ్మకాలు. క్రితం ఏడాది నవంబర్ 2015 లో 17,189 యూనిట్ల అమ్మకాలు జరపగా, ఈ ఏడాది దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతలు కలుపుకొని అదే మాసంలో 21,004 యూనిట్ల విక్రయాలు జరిపింది.

ఫోర్డ్ ఇండియా అమ్మకాలు

ఈ ఏడాది నవంబర్‌లో ఫోర్డ్ దేశీయంగా 6,879 యూనిట్ల విక్రయాలు జరిపింది . గత ఏడాది ఇదే మాసంలో దేశీయ అమ్మకాలు 8,773 గా ఉన్నాయి. అయితే దేశీయంగా ఫోర్డ్ వాహనాల అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఫలితాలివ్వలేదు. కాని ఎగుమతుల పరంగా గత ఏడాది జరిగిన 8,416 యూనిట్లతో పోల్చుకుంటే ఈ ఏడాది నవంబర్‌లో 14,218 యూనిట్లు ఎగుమతయ్యాయి.

ఫోర్డ్ ఇండియా అమ్మకాలు

దేశీయ దిగ్గజ ఆటో మ్యాగజైన్, ఆటో కార్ ఇండియా, వ్యక్తిగత స్పేర్ పార్ట్స్ ధరల పరంగా నిర్వగహించిన సర్వేలో ఫోర్డ్ ఉత్పత్తులు అత్యంత నాణ్యమైన మరియు సరసమైనవిగా తేలింది.

ఫోర్డ్ ఇండియా అమ్మకాలు

ఫోర్డ్ ఇండియా తమ మస్టాంగ్ మీద దేశవ్యాప్తంగా ఉన్న ఫోర్డ్ డీలర్ల వద్ద బుకింగ్స్ ప్రారంభించింది. ఫోర్డ్ మస్టాంగ్‌ను 65 లక్షల రుపాయల బుకింగ్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జూలైలో ఫోర్డ్ తమ మస్టాంగ్ సూపర్ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఫోర్డ్ ఇండియా అమ్మకాలు

అత్యంత శక్తివంతమైన ఫోర్డ్ మస్టాంగ్ 5-లీటర్ సామర్థ్యం గల వి8 పెట్రోల్ ఇంజన్‌ కలదు. ఇది గరిష్టంగా 395బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

ఫోర్డ్ ఇండియా అమ్మకాలు

ఫోర్డ్ మోటార్ కంపెనీ ఎక్జ్సిక్యూటివ్ చైర్మెన్ విలియమ్ క్లే ఫోర్డ్ మాట్లాడుతూ, ఇండియాలో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ మరియు అంతర్జాతీయ వ్యాపార సేవలను విస్తరించే ప్రణాళికలో ఉన్నట్లు తెలిపాడు.

ఫోర్డ్ ఇండియా అమ్మకాలు

  • రూ. 2,50,000 ల వరకు డిస్కౌంట్లు ప్రకటించిన హ్యుందాయ్
  • ఆరు లక్షలకే బెంజ్ కారా..!! ఎలా సాధ్యం..?
  • అడ్వెంచర్ ప్రేమికుల కోసం కవాసకి వెర్సేస్ 250

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford India Records 21,004 Vehicles Sales in November
Story first published: Friday, December 2, 2016, 12:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X