2017 హోండా సివిక్ హ్యాచ్‍బ్యాక్ రహస్య ఫోటోలు మరియు సాంకేతిక వివరాలు
ఎన్నో కాలంగా చాలా వరకు ఉత్పత్తులు ఒకే సెగ్మెంట్లో కొనసాగుతూనే ఉంటాయి. అంటే పాత వాటిని ఎప్పటికప్పుడు రీడిజైన్ చేస్తూ ఫస్ట్, సెకండ్, థర్డ్ జనరేషన్ అంటూ మార్కెట్లోకి విడుదల చేస్తుంటారు. అందులో హోండా వారి సివిక్ సెడాన్ కారు కూడా ఒకటి.
కాని దీనికి భిన్నంగా సివిక్ సెడాన్‌ను సివిక్ హ్యాచ్‌బ్యాక్ రూపంలో కూడా అందివ్వడానికి సిద్దమైంది హోండా మోటార్స్. 2017 హోండా సివిక్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌కు చెందిన పోటోలు మరియు సాంకేతిక వివరాలు విడుదలయ్యాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం...

సివిక్ హ్యాచ్‌బాక్ ఐదు డోర్లతో డిజైన్ చేయబడింది. ప్రస్తుతం ఈ కథనంలో అందించిన ఫోటోలు సివిక్ ను బ్రిటన్ నుండి అమెరికాకు ఎగుమతి చేస్తున్న సమయంలో తీసినవి.

హోండా సివిక్ హ్యాచ్‌బ్యాక్ ప్రోటోటైప్‌ను 2016 న్యూ యార్క్ ఆటో షో లో ప్రదర్శించారు.

ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిద్దమైన సివిక్ హ్యాచ్‌బ్యాక్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ కోసం ప్రస్తుతం ఉన్న సివిక్ సెడాన్ ప్లాట్ ఫాంను వేదికగా చేసుకున్నారు.

ఇది వినియోగదారులకు అందుబాటులోకి వస్తే 1.5-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ మరియు 2.0-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ విటిఇసి ఇంజన్‌ను పరిచయం చేయనుంది.

వినియోగదారులను ఆకర్షించడానికి సివిక్ లైనప్‌లోనికి 158బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 2.0-లీటర్ ఐ-విటిఇసి ఇంజన్‌ను కూడా పరిచయం చేస్తున్నారు.

అయితే ఈ సివిక్ హ్యాచ్‌బ్యాక్‌ను కళ్లారా చూడటానికి ఇంకా సమయం పట్టనుంది. కాని ఈ కథనంలో ఉన్న ఫోటోల ద్వారా 2017 హోండా సివిక్ హ్యాచ్‌బ్యాక్ ఎలా ఉంటుందో అంచనా వేసుకోండి.

లగ్జరీ ప్రైవేట్ జెట్ కాదు, ఇన్నోవా క్రిస్టా ఇంటీరియర్
ఫ్యూచర్ మొత్తం ఎస్‌యువిలదే !! వరుసగా విడుదలకు సిద్దమైన SUVలు


Click it and Unblock the Notifications








