బస్సులు, రైళ్లు మర్చిపోయేలా చేస్తున్న కారు.. మొత్తం కుటుంబాన్ని ఎక్కడికైనా హాయిగా తీసుకెళ్లొచ్చు!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎప్పటికీ తగ్గని క్రేజ్‌తో నిలిచే MPVలలో టయోటా ఇన్నోవా (Toyota Innova) ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కుటుంబ ప్రయాణాలు, లాంగ్ డ్రైవ్స్, అలాగే కమర్షియల్ వినియోగం.. ఏ కోణంలో చూసినా ఈ వాహనం నమ్మకానికి ప్రతీకగా మారింది. కాలం మారుతున్నా, కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నా, ఇన్నోవాపై వినియోగదారుల విశ్వాసం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మార్కెట్లో Toyota ఈ ఇన్నోవాను రెండు వెర్షన్లలో అందిస్తోంది. ఒకటి ఇన్నోవా క్రిస్టా (Innova Crysta) కాగా, మరొకటి ఆధునిక ఫీచర్లు, హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross). ఈ రెండింటిలో కూడా తమతమ ప్రత్యేకతలు ఉన్నప్పటికీ, కొత్త తరం వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది హైక్రాస్ మోడల్.

ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని మరింత బలంగా నిరూపిస్తున్నాయి. 2026 ఫిబ్రవరిలో టయోటా ఇన్నోవా హైక్రాస్ మొత్తం 6,041 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇదే సమయంలో, గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 5,622 యూనిట్లుగా ఉండేది. రెండు గణాంకాలను పోల్చితే, ఈసారి అదనంగా 419 యూనిట్లు అమ్ముడైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. శాతం పరంగా చూసినప్పుడు, ఈ పెరుగుదల సుమారు 7.45 శాతం వరకు ఉంది.

Toyota Innova Hycross February 2026 Sales 7 54 Percent Growth Compared To Previous

ఇది ఒక స్థిరమైన వృద్ధి అని చెప్పాలి. ముఖ్యంగా MPV సెగ్మెంట్‌లో పోటీ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో, ఇలాంటి గ్రోత్ సాధించడం అంత సులభం కాదు. అయినప్పటికీ, టయోటా ఇన్నోవా హైక్రాస్ తన ఆధునిక డిజైన్, కంఫర్ట్, విశ్వసనీయతతో వినియోగదారుల మనసు గెలుచుకుంటూ ముందుకు సాగుతోంది. తాజా అమ్మకాల వృద్ధి చూస్తే, రాబోయే రోజుల్లో కూడా డిమాండ్ ఇలాగే కొనసాగుతుందని చెప్పడం అతిశయోక్తి కాదు.

ఈ మోడల్ ధరలు కూడా వినియోగదారులకు విభిన్న ఎంపికలను అందించేలా ఉన్నాయి. ఎంట్రీ లెవల్ వేరియంట్ సుమారు రూ.19.15 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, అన్ని ఆధునిక ఫీచర్లు, లగ్జరీ ఎలిమెంట్స్‌తో కూడిన టాప్ వేరియంట్ ధర రూ.32 లక్షల వరకు చేరుతుంది. ఈ ధర రేంజ్ ద్వారా బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు విభిన్న కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.

Toyota Innova Hycross February 2026 Sales 7 54 Percent Growth Compared To Previous

పనితీరు విషయానికి వస్తే, టయోటా ఈ హైక్రాస్ మోడల్‌లో రెండు ప్రధాన ఇంజిన్ ఎంపికలను అందిస్తోంది. ఒకటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) సిస్టమ్. హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఇంధన సామర్థ్యం పెరగడమే కాకుండా, డ్రైవింగ్ సమయంలో సైలెంట్, స్మూత్ అనుభవం కూడా లభిస్తుంది. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, CVT, e-CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంది.

దీనివల్ల డ్రైవింగ్ చాలా సాఫీగా ఉంటుంది. ముఖ్యంగా నగర ట్రాఫిక్‌లో గేర్ మార్పుల అవసరం లేకుండా సౌకర్యవంతంగా నడిపించుకోవచ్చు. మైలేజ్ పరంగా కూడా Toyota Innova Hycross మంచి బ్యాలెన్స్‌ను అందిస్తోంది. పెట్రోల్ వేరియంట్‌లో సుమారు 16.13 kmpl నుంచి, హైబ్రిడ్ వేరియంట్‌లో 23.24 kmpl వరకు మైలేజ్ లభించడం గమనార్హం. ఈ స్థాయి మైలేజ్, ముఖ్యంగా పెద్ద MPV సెగ్మెంట్‌లో, వినియోగదారులకు ఒక పెద్ద ప్లస్ పాయింట్‌గా మారుతుంది.

Toyota Innova Hycross February 2026 Sales 7 54 Percent Growth Compared To Previous

ఇది ప్రీమియం డిజైన్, పెద్ద కేబిన్ స్పేస్, హైబ్రిడ్ టెక్నాలజీ వంటి అంశాలతో ఇది కుటుంబాలు, లాంగ్ డ్రైవ్ ప్రేమికులకే కాకుండా, కమర్షియల్ యూజర్లకు కూడా బెస్ట్ ఎంపికగా మారింది. భద్రతా ప్రమాణాల్లో భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో ఈ MPV అద్భుతమైన స్కోర్లు సాధించింది. వయోజన రక్షణలో 32లో 30.47 పాయింట్లు, పిల్లల రక్షణలో 49లో 45 పాయింట్లు సాధించింది.

More from DriveSpark

Article Published On: Sunday, March 29, 2026, 14:34 [IST]
English summary
Toyota innova hycross february 2026 sales 7 54 percent growth compared to previous
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+