దేశీయ విపణిలోకి అకార్డ్ హైబ్రిడ్‌ను విడుదల చేసిన హోండా
ఇండియా ఎంతగానో ఎదురు చూస్తున్న అకార్డ్ హైబ్రిడ్‌ను హోండా మోటార్స్ దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ధర, ఫీచర్లు మరియు సాంకేతిక వివరాలు మీకోసం....
జపాన్‌కు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ దేశీయ విపణిలోకి తమ అకార్డ్ హైబ్రిడ్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ. 37 లక్షలు ఎక్స్ షోరూమ్(ఢిల్లీ)గా నిర్ణయించింది.

హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన అకార్డ్ తొమ్మిదవ తరానికి చెందినదని సంస్థ తెలిపింది. మొదటి తరం అకార్డ్‌ను 2001లో భారతీయులకు పరిచయం చేసింది హోండా.

సరికొత్త హోండా అకార్డ్ కంప్లిట్లీ బిల్ట్ యూనిట్‌గా అందుబాటులో ఉంది. మరియు అకార్డ్ కేవలం హైబ్రిడ్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానుంది.

అకార్డ్ హైబ్రిడ్ ధర వివరాలు
- ఢిల్లీ - ధర రూ. 37 లక్షలు
- బెంగళూరు - ధర రూ. 40.57 లక్షలు
- ముంబాయ్ - ధర రూ. 40.14 లక్షలు అన్ని ధరలు ఎక్స్ షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి.
- ఈ కొత్త కారుతో మార్కెట్ ను కుదిపేయడం ఖాయం అంటున్న మారుతి
- స్కోడా 2017 ర్యాపిడ్ విడుదలకు సర్వం సిద్దం
- ఒకే బ్రిడ్జిపై రైళ్లు మరియు వాహనాలు నడిచే భారత దేశపు వంతెనలు

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న అకార్డ్‌కు పోటీగా ఉన్న టయోటా క్యామ్రీ హైబ్రిడ్ కన్నా ఆరు లక్షల రుపాయల గరిష్ట ధరతో విడుదలయింది.

హోండా మోటార్స్ ఈ అకార్డ్‌లో 2.0-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను అందించింది.

గంటకు 1.3 కిలోవాట్ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ ఇందులోని పెట్రోల్ ఇంజన్‌కు అనుసంధానం అయ్యింది.

కేవలం పెట్రోల్ ఇంజన్ మాత్రమే 145బిహెచ్‌పి పవర్ మరియు 175ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఎలక్ట్రిక్ మోటార్ 184బిహెచ్‌పి పవర్ అదేవిధంగా 315ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఎలక్ట్రిక్ మోటార్ మరియు పెట్రోల్ ఇంజన్ సంయుక్తంగా 212 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

అకార్డ్ హైబ్రిడ్ బాహ్య డిజైన్ పరంగా ఇందులో ముందు వైపున సరికొత్త స్పోర్టివ్ బంపర్ అందించారు. ఫ్రంట్ గ్రిల్ మద్య చిన్న పాటి గాజు ఫలకలతో అలంకరించారు.

ఫ్రంట్ గ్రిల్ క్రోమ్ మరియు నలుపు రంగుల్లో డిజైన్ చేయబడింది. ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే లైట్లు, ఎల్ఇడి ఫాగ్ ల్యాంప్స్, 18-అంగుళాల డ్యూయల్ టోన్ డైమండ్ కట్ వీల్స్ కలవు.

వెనుక వైపు డిజైన్‌లో అకార్డ్ హైబ్రిడ్ ఎల్ఇడి కాంబినేషన్‌లో ఉన్న టెయిల్ ల్యాంప్స్ కలిగి ఉంది. నూతన శైలిలో ఉన్న రియర్ బంపర్ మరియు బూట్ మీద విస్తరించబడిన స్పాయిలర్ కలదు.

అకార్డ్ హైబ్రిడ్ అనే దానిని సూచించేందుకు గాను హెడ్ లైట్లు మరియు టెయిల్ లైట్లు క్రిందుగా లేత నీలం రంగులో ఆంగ్లలో హైబ్రిడ్ అనే పదాన్ని ప్రత్యేకంగా అమర్చారు.

హోండా అకార్డ్ హైబ్రిడ్ వైట్ ఆర్చిడ్ పియర్ల్, లునార్ సిల్వర్ మెటాలిక్, మోడ్రన్ స్టీల్ మెటాలిక్, క్రిస్టల్ పియర్ల్ బాడీ అనే రంగుల్లో అందుబాటులో ఉంది.

ఇంటీరియర్ పరంగా అత్యంత విలాసవంతంగా ఉండేందుకు అధునాతన సెంటర్ కన్సోల్ అందించారు మరియు డ్రైవర్‌కు ముందు వైపున రెండు రకాల్ డిస్ల్పేలను అందించారు.

మల్టీమీడియా కోసం ఒక స్క్రీన్‌ను కేటాయించారి. మరో తెరను పూర్తిగా డ్రైవర్ కోసం కేటాయించారు. ఇందులో కారు యొక్క డ్రైవింగ్ తీరు మరియు సాంకేతిక వివరాలను గమనించేందుకు ఈ డిస్ల్పే సహకరిస్తుంది.

ఫీచర్ల పరంగా అకార్డ్ హైబ్రిడ్‌లో ప్యాసింజర్ సైడ్ కెమెరా, రెండు స్టేజిల్లో వాతావరణాన్ని నియంత్రించే ఫీచర్, క్రూయిజ్ కంట్రోల్, సన్ రూఫ్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఇందులో ఉంది.

హోండా అకార్డ్ హైబ్రిడ్ లో రియర్ ప్యాసింజర్ల కోసం ఏ/సి వెంట్స్

హోండా అకార్డ్ హైబ్రిడ్ ఇంటీరియర్ నుండి ఫ్రంట్ వ్యూవ్....



Click it and Unblock the Notifications








